ప్రజారాజ్యం పెట్టడం కంటే అదే పెద్దతప్పు! | chiranjeevi should direct his 150th film, suggests ram gopal varma | Sakshi
Sakshi News home page

ప్రజారాజ్యం పెట్టడం కంటే అదే పెద్దతప్పు!

Published Wed, Jan 28 2015 3:50 PM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

ప్రజారాజ్యం పెట్టడం కంటే అదే పెద్దతప్పు! - Sakshi

ప్రజారాజ్యం పెట్టడం కంటే అదే పెద్దతప్పు!

వివాదాస్పద ట్వీట్లతో ఎప్పుడూ సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి పెద్ద బాంబే పేల్చాడు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయకపోతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే కూడా పెద్ద తప్పు అవుతుందన్నాడు. ఆయనకు దర్శకుల కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసని.. ఆ సంగతి తాను ఆయనతో కలిసినప్పుడే తనకు అర్థమైందని అన్నాడు. త్రివిక్రమ్, వినాయక్ లాంటి వాళ్లతో చిరంజీవి 150వ సినిమా చేస్తే అది ఏదో మామూలు సినిమాయే అవుతుందని, అదే ఆయన దర్శకత్వం వహిస్తే బ్రహ్మాండమైన సినిమా అవుతుందని అన్నాడు.

తన 150వ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించుకునే తెలివితేటలు, విజ్ఞత చిరంజీవికి ఉన్నాయనే తాను గట్టిగా నమ్ముతున్నట్లు ట్వీట్లలో వర్మ చెప్పాడు. ఆయన దర్శకత్వం వహించకపోతే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కంటే ఇది మరింత పెద్ద తప్పు అవుతుందని వర్మ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఆయన మూడు దశాబ్దాల సినీ చరిత్రలో ఇది అద్భుతమైన ఘట్టం అవుతుందన్నాడు. ఆయనే దర్శకత్వం వహిస్తే అది చిరంజీవికి మరో బాహుబలి అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement