ఈ చిన్నోడు ఎవరో తెలుసా? | can you identify this cute young lad? | Sakshi
Sakshi News home page

ఈ చిన్నోడు ఎవరో తెలుసా?

Published Thu, Mar 5 2015 3:04 PM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

can you identify this cute young lad?

ఎంచక్కా తాత చంకెక్కి ఆయన చేతి మీద చెయ్యివేసి అమాయకంగా చూస్తున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా? మరోవైపు.. రెండు చేతులకు రెండు వాచీల్లాంటివి కూడా కనిపిస్తున్నాయి కదూ. ఇంత అమాయకంగా కనిపిస్తూ, కళ్లకు కాటుక కూడా పెట్టుకున్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం తన సినిమాలతో పాటు ట్వీట్లు, వ్యాఖ్యలతో కూడా సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎప్పటిదో తన చిన్ననాటి ఫొటో ఆల్బం తీసుకుని, అందులోని రెండు ఫొటోలను ఇప్పుడు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వాటిలో ఒకటి తానొక్కడే ఉన్న ఫొటో కాగా, మరొకటి.. తన తాతగారితో ఉన్న ఫొటో అంటూ పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement