అయ్యా.. నన్ను ఒగ్గెయ్యండయ్యా..: రాజమౌళి | rajamouli responds on ram gopal varma tweet | Sakshi
Sakshi News home page

అయ్యా.. నన్ను ఒగ్గెయ్యండయ్యా..: రాజమౌళి

Published Mon, Apr 24 2017 9:45 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

అయ్యా.. నన్ను ఒగ్గెయ్యండయ్యా..: రాజమౌళి - Sakshi

అయ్యా.. నన్ను ఒగ్గెయ్యండయ్యా..: రాజమౌళి

ఒకవైపు నాలుగు రోజుల్లో భారీ సినిమా విడుదల కాబోతోంది. అదికూడా ముందు ఒక భాగం అనుకున్నది రెండు భాగాలుగా తీసిన సినిమా. అలాంటప్పుడు దర్శకుడు ఎంత టెన్షన్‌తో ఉంటాడో ఊహించగలం కదా. కానీ ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ తనతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్వీట్ చేసి.. దానికి ఏవేవో కామెంట్లు పెట్టడంతో రాజమౌళి ఏమనుకున్నారో ఏమో.. 'అయ్యా, నన్ను ఒగ్గెయండయ్యా' అంటూ వర్మను బతిమాలుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి గతంలో ఎప్పుడో ఒక సందర్భంలో తాను ఉన్న ఫొటోను రాంగోపాల్ వర్మ పొద్దున్నే ట్వీట్ చేశారు. దానికి 'బ్యూటీ అండ్ అగ్లీ' అని కేప్షన్ పెట్టారు. ఇక అప్పటినుంచి ట్వీట్ల యుద్ధం మొదలైంది. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందమైన బాహుబలి కంటే కూడా చాలా సెక్సీగా కనపడుతున్నారని ఆ తర్వాత మరింత వివరణ ఇచ్చారు వర్మ.

అయితే ఈ సంవాదంలోకి ఉన్నట్టుండి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ప్రవేశించాడు. మీరిద్దరూ గొప్ప దర్శకులన్నది వాస్తవమని, అయితే ఇద్దరూ అగ్లీగానే ఉన్నారని ట్వీట్ చేశాడు. దాంతో వర్మకు చిర్రెత్తుకొచ్చింది. మీరు చాలా బాగా చెప్పారని, అందరూ మీ అంత, షారుక్ ఖాన్ అంత అందంగా ఉండలేరని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దానికి మళ్లీ కమాల్ స్పందిస్తూ తాను అందంగా ఉన్నానన్న విషయం తనకు తెలుసని, అయితే షారుక్ ఖాన్ గురించి మాత్రం చెప్పలేనని అన్నాడు. దానికి ఈ ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని వర్మ అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో అగ్లీ.. బ్యూటీ అంటూ ఆ రెండు పదాల కలయికతో ఓ పెద్ద వాక్యాన్ని ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement