చాలామంది హీరోలు సుబ్బారావులే..! | ramgopal varma comments on young heroi raj tarun | Sakshi
Sakshi News home page

చాలామంది హీరోలు సుబ్బారావులే..!

Published Fri, Nov 6 2015 1:34 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

చాలామంది హీరోలు సుబ్బారావులే..! - Sakshi

చాలామంది హీరోలు సుబ్బారావులే..!

సినిమాలతో కన్నా ట్విట్టర్ కామెంట్స్తోనే ఎక్కువగా వార్తల్లో కనిపించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తెర మీదకు వచ్చాడు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా విమర్శనాస్త్రాలను సంధిస్తూ వస్తున్న వర్మ ఈ సారి మాత్రం ఓ కుర్ర హీరోను పొగడ్తలతో ముంచెత్తాడు. త్వరలో తన సినిమాలో హీరోగా నటించబోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ను పొగుడుతూ తన మార్క్ ట్వీట్స్తో అలరించాడు వర్మ.

'రాజ్ తరుణ్ అద్భుతమైన నటుడు, అతనితో పోలిస్తే చాలా మంది హీరోలు సుబ్బారావులతో సమానం.' అంటూ కుర్రహీరోలకు చురకలంటించాడు. అంతటితో ఆగకుండా తన మాటల ప్రతాపాన్ని డైరెక్టర్ల మీద కూడా చూపించాడు.' రాజ్తరుణ్కి నటుడిగా కన్నా దర్శకుడిగా చాలా టాలెంట్ ఉంది, పూరి జగన్నాధ్, వివి వినాయక్, రాజమౌళి లాంటి దర్శకులకన్నా టాలెంటెడ్ దర్శకుడయ్యే స్థాయి ఉన్న కళాకారుడు' అంటూ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్' సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ త్వరలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూకీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వర్మ చేసిన ట్వీట్స్ రాజ్ తరుణ్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement