రాజమౌళి.. పవన్ కలిసి సినిమా తీస్తే! | Rajamouli and pawan combo will hit box office, says ramgopal varma | Sakshi
Sakshi News home page

రాజమౌళి.. పవన్ కలిసి సినిమా తీస్తే!

Published Mon, Mar 27 2017 1:06 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

రాజమౌళి.. పవన్ కలిసి సినిమా తీస్తే! - Sakshi

రాజమౌళి.. పవన్ కలిసి సినిమా తీస్తే!

ఒకవైపు కాటమరాయుడు సినిమా విడుదలై దాని రికార్డుల గురించి చర్చలు జరుగుతుండటం, మరోవైపు బాహుబలి 2 సినిమా ఆడియో రిలీజ్, ప్రీరిలీజ్ వేడుక అట్టహాసంగా జరగడంతో.. ఈ అంశంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. రాజమౌళి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించి ఓ సినిమా చేస్తే అది బాక్సాఫీసులను బద్దలుకొట్టి, రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని అన్నాడు. అది వీలైనంత త్వరగా జరిగితే బాగుంటుందని తాను ఆశిస్తున్నట్లు కూడా రామూ చెప్పాడు.

అమెరికాలో ఇప్పటికే 9 లక్షల డాలర్ల వసూళ్లను దాటిన కాటమరాయుడు సినిమా త్వరలోనే ఒక మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకునేందుకు సిద్ధంగా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికి మొత్తం 6.04 కోట్ల రూపాయలను ఈ సినిమా అమెరికాలో వసూలు చేసినట్లు చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement