baahubali 2 movie
-
పైరసీపై జక్కన్న ఏమన్నారు?
ఇప్పటివరకు థియేటర్లలో కెమెరాలు పెట్టి షూట్ చేయడం ద్వారా సినిమాలు పైరసీ చేయడం తెలుసు గానీ, ఏకంగా సెర్వర్ లోంచే మాస్టర్ ప్రింట్‌ను కాపీ చేసేసుకుని దాన్ని ఆన్లైన్లో పెడతామంటూ బెదిరించడాన్ని తొలిసారి చూశామని బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. తమ దగ్గర మొత్తం సినిమా ఒరిజినల్ ప్రింట్ ఉందని, కావాలంటే చూసుకొమ్మని చిన్న క్లిప్పింగ్ పంపించినట్లు ఆయన తెలిపారు. దాంతో అసలు ఏం చేయాలో కూడా తనకు అర్థం కాలేదన్నారు. పైరసీ గ్యాంగును పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడంతో ఊపిరి పీల్చుకున్న రాజమౌళి.. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. అయితే ఈసారి లక్కీగా పోలీసులు చాలా యాక్టివ్‌గా స్పందించారని, దాంతో సినిమా పైరసీ కాకుండా అడ్డుకోగలిగారని చెప్పారు. ప్రధానంగా సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, ఏసీపీ రఘువీర్ లాంటివాళ్లు చాలా పర్సనల్ ఇంట్రస్ట్ తీసుకుని మరీ ఈ కేసును ఛేదించారని జక్కన్న అన్నారు. ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత అది పైరసీ బారిన పడటం, వాటిని అడ్డుకోడానికి ఇంతమంది ఇన్నిరకాలుగా కష్టపడాల్సి రావడం దారుణమని ఆయన చెప్పారు. -
అయ్యా.. నన్ను ఒగ్గెయ్యండయ్యా..: రాజమౌళి
ఒకవైపు నాలుగు రోజుల్లో భారీ సినిమా విడుదల కాబోతోంది. అదికూడా ముందు ఒక భాగం అనుకున్నది రెండు భాగాలుగా తీసిన సినిమా. అలాంటప్పుడు దర్శకుడు ఎంత టెన్షన్‌తో ఉంటాడో ఊహించగలం కదా. కానీ ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ తనతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్వీట్ చేసి.. దానికి ఏవేవో కామెంట్లు పెట్టడంతో రాజమౌళి ఏమనుకున్నారో ఏమో.. 'అయ్యా, నన్ను ఒగ్గెయండయ్యా' అంటూ వర్మను బతిమాలుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి గతంలో ఎప్పుడో ఒక సందర్భంలో తాను ఉన్న ఫొటోను రాంగోపాల్ వర్మ పొద్దున్నే ట్వీట్ చేశారు. దానికి 'బ్యూటీ అండ్ అగ్లీ' అని కేప్షన్ పెట్టారు. ఇక అప్పటినుంచి ట్వీట్ల యుద్ధం మొదలైంది. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందమైన బాహుబలి కంటే కూడా చాలా సెక్సీగా కనపడుతున్నారని ఆ తర్వాత మరింత వివరణ ఇచ్చారు వర్మ. అయితే ఈ సంవాదంలోకి ఉన్నట్టుండి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ప్రవేశించాడు. మీరిద్దరూ గొప్ప దర్శకులన్నది వాస్తవమని, అయితే ఇద్దరూ అగ్లీగానే ఉన్నారని ట్వీట్ చేశాడు. దాంతో వర్మకు చిర్రెత్తుకొచ్చింది. మీరు చాలా బాగా చెప్పారని, అందరూ మీ అంత, షారుక్ ఖాన్ అంత అందంగా ఉండలేరని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దానికి మళ్లీ కమాల్ స్పందిస్తూ తాను అందంగా ఉన్నానన్న విషయం తనకు తెలుసని, అయితే షారుక్ ఖాన్ గురించి మాత్రం చెప్పలేనని అన్నాడు. దానికి ఈ ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని వర్మ అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో అగ్లీ.. బ్యూటీ అంటూ ఆ రెండు పదాల కలయికతో ఓ పెద్ద వాక్యాన్ని ట్వీట్ చేశారు. @RGVzoomin Ayyaaa...nannu oggeyyandayyaa.... -
బాహుబలి-2 రైట్స్ ఎవరికి దక్కాయో తెలుసా?
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా.. బాహుబలి -2. మొదటి భాగానికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో రెండో భాగం ఎప్పుడు బయటకు వస్తుందా, దాన్ని ఎలా పంపిణీ చేసి మంచి లాభాలు ఆర్జిద్దామా అని అంతా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటుండటంతో బిజినెస్ కూడా మొదలైపోయింది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా హక్కుల అమ్మకాలు కూడా జరిగిపోయాయి. ఎంతకు వెళ్లాయన్న విషయం బయటకు రాలేదు గానీ.. ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ ఈ హక్కులను కొనుగోలు చేశారని మాత్రం తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా బాహుబలి సినిమా తన అధికారిక ట్విట్టర్ పేజి ద్వారా వెల్లడించింది. We are pleased to confirm that Narayan Das Narang and Sunil Narang of Asian Enterprises have acquired the Nizam rights for #Baahubali2. — Baahubali (@BaahubaliMovie) 11 October 2016