మూసీనదికి గిన్నిస్ రికార్డు ఖాయం: వర్మ
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన నది అంటూ ఏమైనా ఉందంటే.. అది మూసీయేనని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ విషయమై ఆయన తాజాగా వరుసపెట్టి మూడు ట్వీట్లు చేశారు. మూసీనది వీడియో ఫుటేజిని పోటీలకు పంపితే.. ప్రపంచంలోనే అత్యంత చెత్త నదిగా అది గిన్నిస్ రికార్డులు సాధించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్ఎస్ దీనిపై దృష్టిపెట్టి దాన్ని శుభ్రం చేయిస్తారని ఆశిస్తున్నట్లు వర్మ చెప్పారు. ఏ నగరమైనా తనను తాను నగరం అని చెప్పుకోవాలంటే ముందుగా తన నదులను శుభ్రం చేసుకోవాలని.., భవిష్యత్తులో మూసీనది తెలంగాణకు పర్యాటక కేంద్రంగా మారాలని ఆశిస్తున్నానని తెలిపారు.
I think the Musi river of the Telangana state has to be dirtiest river in the whole world...I wish KCR and his TRS will get it cleaned up
— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2015
Any city which calls itself a city will first keep its river clean and I wish Musi will become a tourist attraction for Telangana state
— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2015
If video footage of Musi river is sent for competition it will for sure win a Guinness book record for the dirtiest river in world
— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2015