'వంగవీటి' సినిమాలో కొన్ని షాట్స్..
సినిమాపై ఆసక్తిని పెంచేందుకు విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు అంటూ ప్రచారం చేసుకోవడం అందరూ చేసే పని. దర్శకుడు రాంగోపాల్ వర్మది అందుకు భిన్నమైన శైలి. ఆయన రూపొందించిన 'వంగవీటి' సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే 'వంగవీటి'కి సంబంధించిన కొన్ని షాట్లను దసరా సందర్భంగా(మంగళవారం) సోషల్ మీడియాలో పెట్టారాయన. అద్భుతమైన బ్యాగ్రౌడ్ స్కోర్ తో.. 'చంపరా.. చంపెయ్యరా..' అంటూ దడపుట్టేంచే వంగవీటి షాట్లను వీడియోలో చూడోచ్చు. (చూడండి: రాంగోపాల్ వర్మ 'వంగవీటి' ట్రైలర్)
గాంధీ జయంతి సందర్భంగా వర్మ అక్టోబర్ 2న 'వంగవీటి' ట్రైలర్ విడుదల చేశారు. యూ ట్యూబ్ లో ఇప్పటివరకు 15.5 లక్షల మంది దానిని చూశారు. ఇక వంగవీటి షాట్లు నెటిజన్లను ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.