
'కావాలనే రద్దు చేయించారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరమని వైఎస్సార్ సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడుగుతున్నారని విమర్శించారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రేపు నిర్వహించనున్న సమావేశాన్ని కావాలనే చంద్రబాబు రద్దు చేయించారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతొ కలిగే లాభాలను విద్యార్థులు, యువతకు తెలియజేయాలన్నదే వైఎస్ జగన్ ఉద్దేశమని తెలిపారు. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు.