ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధా విరుచుపడ్డారు. చంద్రబాబు చేస్తున్నదంతా కూడా పనికిమాలిన పరిపాలన అన్నారు. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా స్వచ్ఛందంగా రాజధాని కోసం తమ భూములు ఇచ్చారని చెప్తున్నారని అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పారు.