vijayawada CRDA office
-
బెజవాడలో వైఎస్ జగన్ ధర్నా
-
'చంద్రబాబుదంతా పనికిమాలిన పాలన'
-
'రాత రాసి ఉంటే.. సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సంస్థలకు రాజధాని నిర్మించాలన్న దుర్భుద్దితో... రైతులు ఒప్పుకోకపోయినా ప్రజల కన్నీటితో రాజధాని నిర్మించేందుకు సిద్ధమయ్యారని.. అధికారం ఉంది కదా అని మదమెక్కిన మనస్తత్వంతో బలవంతంగా భూ సేకరణకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. భూములు కోల్పోయిన రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. రాజధాని నిర్మాణం కోసం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధికారం ఉందని చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. భూములు లాక్కునేందుకు అబద్ధాలు కూడా చెబుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో రాజధాని భూములకు వ్యతిరేకంగా మూడు పంటల పండించే భూములు బలవంతంగా తీసుకున్నారని, రైతులు కేసులు వేశారు. కౌంటర్ ఫైలు చేసిన దానిలో చంద్రబాబు...3 పంటలు పండే భూములు లేవు. 2వేల ఎకరాలే మాగాణి. మిగిలినదంతా మెట్ట భూములు అని చెప్పారు. కార్పొరేట్ సంస్థల కోసమే చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములు బలవంతంగా లాక్కుంటోంది. ప్రభుత్వం అన్యాయం చేస్తే ప్రజలు ఎవరి దగ్గరకు పోవాలి ముఖ్యమంత్రి అంటే మనసున్నవాడు కావాలి. కానీ భూ బకాసురుడయ్యాడు. అధికారం అన్నది ఎల్లకాలం ఒకరి వద్దే ఉండదు. మీరు చేసే అన్యాయం ఎల్లకాలం ఉండదు. త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది బలంతంగా తీసుకున్న రైతుల భూముల్ని మళ్లీ వారికి ఇచ్చి... సాగులోకి తెస్తాం చంద్రబాబు పాలన అంతా మోసం మోసం మోసం అనే పదంతో సాగుతోంది. ఓటు వేసిన రైతన్నలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడి, వారు ఆత్మహత్యలు చేసుకునేలా టీడీపీ సర్కారు వ్యవహరిస్తోంది ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్న బాబు...పచ్చి మోసం చేశారు. చంద్రబాబు మోసంతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అన్న అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారు. హోదా ఇస్తే అన్ని విధాల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దు...ప్యాకేజీ చాలంటున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే మోదీ కాళ్ల దగ్గర బాబు సాష్టాంగ పడుతున్నారు. నా పై కేసులు ఉన్నాయి. అప్పట్లో సోనియా గాంధీతోనే తలపడ్డా. ఇప్పుడూ కూడా భయపడను. దేవుడు రాత రాస్తే...నేను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. బీజేపీ మెడలు వంచేలా హోదా కోసం చంద్రబాబు పోరాడాలి, లేదంటే చంద్రబాబు మెడలు మేం వంచుతాం. ఈ నెల 29న వైఎస్ఆర్ సీపీ బంద్‌ను వ్యతిరేకించేందుకు చంద్రబాబు నానా కుయుక్తులు పన్నుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్ సీపీ బంద్ చేపట్టింది. -
'చంద్రబాబుదంతా పనికిమాలిన పాలన'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధా విరుచుపడ్డారు. చంద్రబాబు చేస్తున్నదంతా కూడా పనికిమాలిన పరిపాలన అన్నారు. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా స్వచ్ఛందంగా రాజధాని కోసం తమ భూములు ఇచ్చారని చెప్తున్నారని అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పారు. సింగపూర్ తరహా రాజధాని ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. తామెప్పుడూ రాజధాని నిర్మాణానికి విరుద్ధం కాదని తెలిపారు. విజయవాడకు గతంలో ఎన్నడూ లేని ట్రాఫిక్ తీసుకొచ్చారని, చంద్రబాబు వచ్చారని ఒకసారి నారాయణ వచ్చారని ఒకసారి, పుల్లారావు వచ్చారని ఒకసారి రోడ్డు వెంట అంగుళం కదలనివ్వకుండా వాహనాలు నిలిపేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిపట్ల గెలిపించిన ప్రజలే నానా తిట్లు చంద్రబాబును తిడుతున్నారని తెలియజేశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రైతుల పక్షాన ఉండేది ఒక్క వైఎస్ జగనే అని, వైఎస్సార్సీపీనే అని వంగవీటి రాధ తెలిపారు. -
'చంద్రబాబు ప్రధానిలా ఫీలవుతున్నారు'
-
'చంద్రబాబు ప్రధానిలా ఫీలవుతున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మాదిరిగా భావిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సింగపూర్ వారికి రాజధాని నిర్మించిన అనుభవం ఉందా? వారికి వ్యవసాయం గురించి తెలుసునా అని రోజా ప్రశ్నించారు. ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చేపడుతున్న ధర్నాలో రోజా మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంతో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు పరిగెత్తుకుపోయారని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేస్తున్నా ఎల్లో మీడియా మాట్లాడటం లేదని విమర్శించారు. ఇటీవల ఓ పత్రికలో వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఓ వార్త రాశారని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరాడేది వైఎస్ జగన్ ఒక్కరేనని రోజా పేర్కొన్నారు. ఆ పత్రికలు ఇప్పటికైనా ప్రజలు గౌరవించేలా వ్యవహరించాలని హితవు పలికారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రుణమాఫీ, ప్రత్యేక హోదా, విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, తహశీల్దార్ వనజాక్షిపై దాడి అంశాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. -
'లుంగీలు కట్టుకున్నారు.. వెళ్లిపోండంటారు'
-
'లుంగీలు కట్టుకున్నారు.. వెళ్లిపోండంటారు'
విజయవాడ: బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూములను లాక్కోవడంపట్ల ఓ రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. 40 ఏళ్లుగా బంధం పెనవేసుకుపోయిన తమ భూములను వదిలి ఎక్కడికి వెళ్లిపోవాలన్న ఆలోచనతో గత రెండు నెలల నుంచి కంటికి నిద్ర, కడుపునిండా భోజనం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ధర్నాలో ఆ రైతు మాట్లాడుతూ ఇది తనొక్కడి ఆందోళనే కాదని, ప్రతి ఒక్కరి ఆందోళన అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నట్లు కొత్తగా నిర్మించబోయే రాజధాని ప్రజా రాజధాని కాదని, అది కార్పొరేట్ రాజధాని మాత్రమే అవుతుందని చెప్పారు. ఎన్నో ఖరీదైన పంటలు పండుతున్న తమ భూములు అసలు పంటలకే పనికి రావని రాసుకుని ఆక్రమించుకుంటున్నారని, భార్యా బిడ్డలు, పశుసంపద ఉన్న తాము ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. ఈ భూములేమైనా తమ వద్ద బలవంతంగా తీసుకుంటున్న వారి బాబులు ఇచ్చారా? తాతలు ఇచ్చారా? ఎవరి సొమ్మని నిలదీశారు. ఇక్కడ మలేషియా, సింగపూర్ రాజధాని కట్టిన తర్వాత తమను అసలు ఉండనిస్తారా? నీకు ఇంగ్లిష్ రాదు.. వెళ్లిపో అని వెళ్లగొట్టరా అని ప్రశ్నించారు. విదేశీ సంప్రదాయాలు తీసుకొచ్చి తెలుగు ప్రాంతంలో రుద్దడమేమిటని అన్నారు. బెదిరించి, భయబ్రాంతులకు గురిచేసి తమ భూములను లాక్కుని రాళ్ల నిర్మాణం చేపట్టాక ఏముంటుందని ప్రశ్నించారు. అసలు పంట భూములన్నీ పోయాక ఏ ప్రాంతంలో అయినా గ్రామాలు ఎలా ఉంటాయి? ప్రజలు ఎలా ఉంటారని నిలదీశారు. ఎంతోమంది మేధావులు ఆంధ్రప్రాంతం నుంచి విదేశాలకు వెళ్లిపోతుంటే ఎవరికీ ఆమోదయోగ్యం కానీ విదేశీ పరిజ్ఞానం పేరిట సింగపూర్ రాజధాని అంటూ నిర్మాణానికి కుట్ర చేశాడని ఆరోపించారు. తమకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీపై ప్రభుత్వ నేతలైన గాలి ముద్దు కృష్ణమనాయుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇలా ఆరోపణలు చేస్తున్నవారెవరైనా సెంటు భూమి రాజధాని కోసం వదులు కున్నారా అని నిలదీశారు. మీ ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడటం గాలి ముద్దు కృష్ణమనాయుడికి సబబు కాదని, సరిగా రెండు కళ్లు పెట్టి చూస్తే, తమ ప్రాంతానికి వస్తే అసలు విషయం బోధ పడుతుందని హితవు పలికారు. అందమైన రాజధాని తమకు అవసరం లేదని పరిశుభ్రమైన ప్రజలందరికీ అవసరమైన రాజధానే కావాలని అన్నారు. సాధారణంగా ఓ ఇళ్లు నిర్మాణం చేపట్టేముందు చుట్టుపక్కల వారిని శుభం కోసం పిలుస్తామని అలా ఎవరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని భూమిపూజ కోసం పిలిచారని నిలదీశారు. తామంటే సామాన్య ప్రజలమని, ఇతర పార్టీ పెద్దలు ఉన్నారు కదా వారినెందుకు పిలవలేదని.. రాజధాని విషయంలో కుట్రలు దాగుండటం వల్లే అలా చేశారని అన్నారు. -
'వైఎస్ఆర్ కంటే దీటుగా వైఎస్ జగన్ పరిపాలిస్తారు'
-
'వైఎస్ఆర్ కంటే దీటుగా వైఎస్ జగన్ పరిపాలిస్తారు'
విజయవాడ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే దీటుగా ఆయన కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలించగలరని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చేపడుతున్న ధర్నాలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే భూములను లాక్కొంటున్నారని విమర్శించారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకే వ్యతిరేకమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టేశారని విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో భూముల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. -
రైతుల నోళ్లు కొట్టి...భూసేకరణా?
విజయవాడ : రైతుల నోళ్లు కొట్టి ...బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ భూ సేకరణను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం...తాజాగా బలవంతపు భూ సేకరణ చేపట్టిందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. రైతులతో పాటు, కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం భూ సేకరణ ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని, అయితే ఆ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోయినా...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 166 జీవో తీసుకు వచ్చి భూముల సేకరిస్తోందని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గ్రామకంఠాల పేరుతో దానికొక నోటిఫికేషన్ ఇచ్చి రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. ఈ చర్యలను ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. -
భూ సమీకరణ తీరుపై వైఎస్ జగన్ ధర్నా
-
భూ సమీకరణ తీరుపై వైఎస్ జగన్ ధర్నా
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ నేతలతో పాటు రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన, భూ సేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రైతుల గొంతుపై కత్తిపెట్టి భూ సేకరణకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు చర్యలను ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఖండించనున్నారు. కాగా తమ భూములు బలవంతంగా లాక్కోవద్దని, ఇచ్చిన వారి నుంచి మాత్రమే తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏడాదికి మూడు పంటలు, అనుకూలిస్తే నాలుగు పంటలు పండే భూములను రాజధాని పేరుతో చంద్రబాబుకు ఇచ్చి తాము ఎటుపోయి, ఏమి తిని బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడటమే కాకుండా పరోక్షంగా పోలీసులతో బెదిరింపులకు దిగుతున్న విషయం తెలిసిందే.