విజయవాడ: బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూములను లాక్కోవడంపట్ల ఓ రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. 40 ఏళ్లుగా బంధం పెనవేసుకుపోయిన తమ భూములను వదిలి ఎక్కడికి వెళ్లిపోవాలన్న ఆలోచనతో గత రెండు నెలల నుంచి కంటికి నిద్ర, కడుపునిండా భోజనం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ధర్నాలో ఆ రైతు మాట్లాడుతూ ఇది తనొక్కడి ఆందోళనే కాదని, ప్రతి ఒక్కరి ఆందోళన అని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నట్లు కొత్తగా నిర్మించబోయే రాజధాని ప్రజా రాజధాని కాదని, అది కార్పొరేట్ రాజధాని మాత్రమే అవుతుందని చెప్పారు. ఎన్నో ఖరీదైన పంటలు పండుతున్న తమ భూములు అసలు పంటలకే పనికి రావని రాసుకుని ఆక్రమించుకుంటున్నారని, భార్యా బిడ్డలు, పశుసంపద ఉన్న తాము ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. ఈ భూములేమైనా తమ వద్ద బలవంతంగా తీసుకుంటున్న వారి బాబులు ఇచ్చారా? తాతలు ఇచ్చారా? ఎవరి సొమ్మని నిలదీశారు. ఇక్కడ మలేషియా, సింగపూర్ రాజధాని కట్టిన తర్వాత తమను అసలు ఉండనిస్తారా? నీకు ఇంగ్లిష్ రాదు.. వెళ్లిపో అని వెళ్లగొట్టరా అని ప్రశ్నించారు.
విదేశీ సంప్రదాయాలు తీసుకొచ్చి తెలుగు ప్రాంతంలో రుద్దడమేమిటని అన్నారు. బెదిరించి, భయబ్రాంతులకు గురిచేసి తమ భూములను లాక్కుని రాళ్ల నిర్మాణం చేపట్టాక ఏముంటుందని ప్రశ్నించారు. అసలు పంట భూములన్నీ పోయాక ఏ ప్రాంతంలో అయినా గ్రామాలు ఎలా ఉంటాయి? ప్రజలు ఎలా ఉంటారని నిలదీశారు. ఎంతోమంది మేధావులు ఆంధ్రప్రాంతం నుంచి విదేశాలకు వెళ్లిపోతుంటే ఎవరికీ ఆమోదయోగ్యం కానీ విదేశీ పరిజ్ఞానం పేరిట సింగపూర్ రాజధాని అంటూ నిర్మాణానికి కుట్ర చేశాడని ఆరోపించారు.
తమకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీపై ప్రభుత్వ నేతలైన గాలి ముద్దు కృష్ణమనాయుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇలా ఆరోపణలు చేస్తున్నవారెవరైనా సెంటు భూమి రాజధాని కోసం వదులు కున్నారా అని నిలదీశారు. మీ ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడటం గాలి ముద్దు కృష్ణమనాయుడికి సబబు కాదని, సరిగా రెండు కళ్లు పెట్టి చూస్తే, తమ ప్రాంతానికి వస్తే అసలు విషయం బోధ పడుతుందని హితవు పలికారు.
అందమైన రాజధాని తమకు అవసరం లేదని పరిశుభ్రమైన ప్రజలందరికీ అవసరమైన రాజధానే కావాలని అన్నారు. సాధారణంగా ఓ ఇళ్లు నిర్మాణం చేపట్టేముందు చుట్టుపక్కల వారిని శుభం కోసం పిలుస్తామని అలా ఎవరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని భూమిపూజ కోసం పిలిచారని నిలదీశారు. తామంటే సామాన్య ప్రజలమని, ఇతర పార్టీ పెద్దలు ఉన్నారు కదా వారినెందుకు పిలవలేదని.. రాజధాని విషయంలో కుట్రలు దాగుండటం వల్లే అలా చేశారని అన్నారు.
'లుంగీలు కట్టుకున్నారు.. వెళ్లిపోండంటారు'అ
Published Wed, Aug 26 2015 12:04 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement