రావులపాలెం: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ నెలకొంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్నాకు దిగడం, పోలీసులు రంగప్రవేశం వరకు వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. రావులపాలెం మండలం పొడగట్లపల్లి-రాజవరం ఆర్అండ్‌బి రోడ్డు ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌పై టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య వివాదం ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధర్నాకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అడ్డుకున్నారు.