'టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు' | ysrcp mla's fires on tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు'

Published Fri, Feb 12 2016 12:53 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

'టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు' - Sakshi

'టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు'

గుంటూరు: టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. వారు ఏక్షణమైనా తమ పార్టీలోకి రావొచ్చని చెప్పారు. టీడీపీ మునిగిపోయే ఓ నావలాంటిదని వైఎస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్టారెడ్డి, ఆర్కె, ముస్తాఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..'టీడీపీలోకి చేరాలని ఏ ఎమ్మెల్యే అనుకోరు. టీడీపీ ఎమ్మెల్యేలను చూస్తే ప్రజలు ఈసడించుకుంటున్నారు.

గడిచిన రెండేళ్లలో టీడీపీ ఏ ఒక్క మంచిపని చేయలేదు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే మా పై దుష్ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ క్లోజ్ కావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి కుయుక్తులు పలుకుతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తాం. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ఎప్పుడైనా వారు మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది' అని వారు అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement