protocal
-
తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు
తిరుపతి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈవో గౌతమి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం తొలిసారి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు అసహనానికి గురయ్యారు. అధికారులు పుష్ప గుచ్చాలు ఇస్తున్నప్పటికీ తీసుకోకుండా వాటిని పక్కకు తోసేశారు. అదే సమయంలో స్థానిక నేతలు ఇచ్చిన బొకేలను మాత్రం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణం చేశాక స్పెషల్ విమానంలో కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అయితే.. గాయత్రి నిలయం వద్ద ఆయన వాహనం దిగి నేరుగా లోపలికి వెళ్లారు. అప్పటికే లోపల ఉన్న తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు యత్నించగా.. సీఎం చంద్రబాబు తిరస్కరించారు. అయితే.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఇచ్చిన గుచ్ఛాలను మాత్రం ఆయన నవ్వుతూ తీసుకున్నారు. వాహనం దిగిన తనకు స్వాగతం పలికేందుకు అధికారులు బయటకు రాకపోవడంతోనే ఆయన ప్రవర్తించి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ అంశం తెరపైకి వచ్చింది. ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబుతిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా విజయవాడ వెళ్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకోనున్నారాయన. అనంతరం ఈ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే కీలక హామీలపైఆయన సంతకాలు చేస్తారని సమాచారం. -
Hyderabad: అదనపు డీజీ అయినా నో చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15, జనవరి 26న దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా వందనం ఉంటుంది. సంబంధిత కార్యాలయ అధిపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదనపు డీజీ స్థాయిలో ఉండే నగర పోలీసు కమిషనర్‌కు మాత్రం ఆ చాన్స్ ఉండదు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు మాత్రం అప్పుడప్పుడు అవకాశం చిక్కుతుంటుంది. నగర కొత్వాల్‌కు ఉండే కీలకమైన బాధ్యతే అందుకు కారణం. ► హైదరాబాద్ కమిషనరేట్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండలకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్థాయి అధికారి కమిషనర్లుగా ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఆ రెండు కమిషనరేట్లకూ ఏడీజీలే కమిషనర్లుగా ఉన్నారు. ► రాష్ట్ర డీజీపీకి సైతం లేని విధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సహా వివిధ ప్రత్యేక అధికారాలు ఈ ముగ్గురు కమిషనర్లకూ ఉంటాయి. కీలక హోదా కలిగిన ఈ ముగ్గురికీ జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. మిగిలిన ఇద్దరికీ అప్పుడప్పుడూ ఆ చాన్స్ దొరుకుతుంది. ► జీహెచ్ఎంసీలో ప్రధాన కమిషనర్, కలెక్టరేట్లలో కలెక్టర్లు, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, జలమండలిలో దాని ఎండీ.. ఇలా వాటి అధిపతులే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. కమిషనరేట్లలో మాత్రం ఇతర అధికారులకే ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ► హైదరాబాద్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.సుధారాణి, సైబరాబాద్‌లో మహిళా భద్రత విభాగం డీసీపీ సి.అనసూయ ఆదివారం జెండా వందనం చేశారు. రాచకొండలో మాత్రం కమిషనర్ మహేష్ భగవత్ ఎగరేశారు. ఇలానే అప్పుడప్పుడు సైబరాబాద్ కమిషనర్ కూడా జెండాను ఆవిష్కరిస్తుంటారు. హైదరాబాద్ కొత్వాల్ మాత్రం ఎగరేసిన దాఖలాలు లేవు. ► ఆయనకు కీలక బాధ్యతల కారణం హైదరాబాద్ కమిషనర్‌కు జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. గణతంత్ర వేడుకలైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా నగరంలో అధికారిక ఉత్సవాలు జరుగుతాయి. వీటికి జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న సీఎం (ఈ రెండు సందర్భాల్లో ఇద్దరూ హాజరైనా అధికారికంగా గౌరవ వందనం స్వీకరించేది ఒకరే) హాజరవుతారు. వారితో పాటే మంత్రులు, అత్యున్నత అధికారులూ వస్తారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. ► ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసు విభాగంలోని ఇతర ఉన్నతాధికారుల కంటే కమిషనర్‌కే ఎక్కువ. ► ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్నందువల్లే హైదరాబాద్ కమిషనర్‌కు ఎప్పుడూ తన కార్యాలయంలో జెండా ఎగురవేసే అవకాశం చిక్కదు. -
ఎంపీ కోమటిరెడ్డికి అవమానం: సీఎం కేసీఆర్ సభకు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: తన నియోజకవర్గ పరిధిలో నిర్వ హించిన అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సమా చారం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధి కారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. కేంద్రమంత్రులను కలిసిన కోమటిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కార్యాలయంలో కోమటిరెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల కోసం విజ్ఞప్తులు అందించారు. అనంతరం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీని కలిసి తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రాంత అభివృద్ధి గురించి విన్నవించారు. రోడ్డు కోసం వారిని బుజ్జగిస్తున్నారు తన ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లే రోడ్డును వాసాలమర్రి గ్రామస్తులు అడ్డుకున్నందుకే సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. అందుకే వారికి అర చేతిలో వైకుంఠం చూపెడుతున్నారన్నారు. వాసాలమర్రి కార్యక్రమానికి తననెందుకు ఆహ్వానించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. -
వ్యాక్సిన్ల మిక్సింగ్ వద్దు: వీకే పాల్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వ్యాక్లిన్ల మిక్సింగ్ ప్రోటోకాల్‌కి అనుమతి లేదని ప్రకటించింది. నీతీ అయోగ్ సభ్యుడు, వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ చైర్మన్ వీకే పాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. వ్యాక్సిన్ల కొరత సమస్య వచ్చినప్పటి నుంచి టీకా మిక్సింగ్ అంశం తెరపైకి వచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం మనదేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు ప్రజలకు అందించారు. దేశంలో చాలా మంది ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కోవిడ్ తొలి డోస్ టీకాగా తీసుకున్నారు. రెండో డోసు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలి డోసు తీసుకున్న టీకా లభ్యత లేకపోవడంతో మరో కంపెనీ టీకాను రెండో డోసుగా తీసుకొవచ్చా ? ‘ వ్యాక్సిన్ మిక్సింగ్’? క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ చైర్మన్ వీకే పాల్ స్పందించారు. ప్రస్తుతానికి టీకా మిక్సింగ్‌ని వ్యాక్సినేషన్ ప్రోటోకాల్‌లో చేర్చలేదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలినా.. అదే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నట్టు గుర్తించాలన్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై అంతర్జాతీయంగా పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వీకే సింగ్ వెల్లడించారు. గడువు మారలేదు ఇక మొదటి, రెండో డోసులకు సంబంధించిన గడువు విషయంలో ఎటువంటి మార్పులు లేవని వీకే సింగ్ స్పష్టం చేశారు. కోవీషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12 వారాలు, కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ 4 వారాలుగానే ఉందని చెప్పారు. -
ప్రోటోకాల్ రగడ
గుంటూరు రూరల్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని వర్శిటీ కార్యక్రమాల్లో తనకు కనీసం ఆహ్వానం లేకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్లో తన పేరును సైతం ఏర్పాటు చేయడంలేదని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం, శాటిలైట్ పరిశోధనా స్థానం శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తనకు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వర్శిటీ వీసీ డాక్టర్ దామోదర్‌నాయుడుతో వాగ్వి వాదానికి దిగారు. తనకేమీ సంబంధంలేదని, జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ ప్రకారమే అందరికీ సమాచారం ఇచ్చామని, అదేవిధంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామని వీసీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని ఇరువురికి సర్ధి చెప్పాడు. దీంతో వివాదం సద్దు మణిగింది. గుంటూరు రూరల్: రైతులకు అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయంలో నైపుణ్యతలు పెంపొందించేందుకు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ కృషి చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వర్శిటీ ప్రాంగణంలో నూతన పరిశోధనా భవనం సముదాయానికి శంకుస్థాపన, విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం శుక్రవారం జరిగాయి. మంత్రి మాట్లాడుతూ రూ. 50 లక్షలతో అధునాతన పద్ధతిలో విత్తన శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా గంటకు రెండు టన్నుల వరకు విత్తనాలు, అపరాలు శుద్ధి చేయవచ్చని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న శాటిలైట్ అగ్రికల్చర్ పరిశోధనా స్థానాన్ని రూ 1.75 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెంటర్‌ను రూ. 64 లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని, అగ్రికల్చర్ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్‌ను రూ. కోటి ఐదు లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వర్శిటీ వీసీ డాక్టర్ వి. దామోదర్‌నాయుడు, వర్శిటీ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
చినబాబు వస్తున్నారని..
పెనుమంట్ర : ప్రొటోకాల్... ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల నిర్వహణకు అంకుశం లాంటి పదం ఇది. దీనిని అడ్డదిడ్డం చేసి తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటైపోయింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన చిన్నచిన్న ప్రజాప్రతినిధులపై ప్రొటోకాల్‌నే బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి వారిని ఇరుకు పెడుతున్నారు. ఇదే సమయంలో అ«ధికార పార్టీ నేతలు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ వ్యవహారం. వారం రోజులు క్రితం అనధికారికంగా ప్రారంభించిన భవనాన్ని మళ్లీ మంత్రి లోకేష్‌తో బుధవారం ప్రారంభించడానికి అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా ఏర్పాట్లు సాగించేస్తున్నారు. పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం తొలి నుంచి వివాదాస్పదంగామారింది. గ్రామం నడిబొడ్డున ఉన్న పంచాయతీ కార్యాలయం శిథిలం కావడంతో నూతన భవన నిర్మాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో పాత భవనం ఉన్నచోటనే నిర్మించాలని ఒక వర్గం అక్కడ కాకుండా స్థానిక పంచాయతీ చెర్వు గట్టున ఉన్న పంచాయతీ స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని మరోవర్గం పట్టుపట్టారు. దీంతో అప్పటి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గ్రామానికి విచ్చేసి చెర్వు గట్టునే శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యతిరేక వర్గం వారు కోర్టును ఆశ్రయించడంతో భవన నిర్మాణం నిలిచిపోయింది. అనంతరం స్థానిక మంత్రి పితాని సత్యనారాయణ ఇరువర్గాలను సఖ్యత చేసే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దీంతో సర్పంచి వర్గం వారు గ్రామశివారున దాతలు అందించిన స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసేశారు. పలుమార్లు ఈ పంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. వారం రోజుల క్రితం మంత్రి పితానిచే ఈ భవన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మంత్రి రాకపోవడంతో ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. దీంతో విసుగు చెందిన సర్పంచ్, అతని అనుచరులు వారం రోజుల క్రితమే భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలోనే సర్పంచి పాలనా వ్యవహారాలు చక్కదిద్దుతున్నారని గ్రామ ప్రతిపక్ష నాయకులు పేర్కొంటున్నారు. పెనుమంట్ర సర్పంచ్‌పై వివక్ష ఇదే మండలంలోని పెనుమంట్ర గ్రామ పంచాయతీ భవనాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గ్రామ వార్డుమెంబర్ ఉందుర్తి కమలమ్మచే గ్రామ సర్పంచి దాట్ల రంగావతి ప్రారంభింపజేశారు. దీంతో తమకు కనీస సమాచారం లేదంటూ, ప్రభుత్వ సెలవుదినాన ప్రారంభోత్సవాలు తగదంటూ అప్పుడు అధికారులు నానా హంగామా చేశారు. అప్పటికప్పుడు పోలీసులు సైతం రంగప్రవేశం చేసి కార్యాలయాన్ని తాత్కాలికంగా మూయించి వేశారు. కాని ఇప్పుడు పంచాయతీ భవన ప్రారంభోత్సవంపై అధికార పక్ష నేతలు చూపుతున్న ప్రొటోకాల్ వివక్షతపై ç విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సామరస్యానికి ప్రొటోకాల్ అడ్డు!
1962 భారత–చైనా యుద్ధం నాటి గందరగోళమే ఇంకా రాజ్య సరిహద్దులో కొనసాగుతోంది. రెండు దేశాల సైనిక దళాల మధ్య పనిచేయాల్సిన హాట్‌లైన్ ప్రొటోకాల్ సమస్యల్లో చిక్కుకుపోయింది. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదురైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్ వైపు నుంచి హాట్లైన్లో ఎవరు మాట్లాడాలి? భారత్ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్యకలాపాల (ఆపరేషన్స్) డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైనికాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్ సమస్య తలెత్తుతుంది. ఎవరైనా కొన్ని తప్పని సరి పొరపాట్లు చేయడం తప్పుకాదు. అయితే, రక్షణ రంగంలో ఉద్దేశపూర్వక నిష్క్రియాపరత్వం సరి కాదు. ఇక్కడ అవకాశం పోతే దాన్ని సమర్ధించుకో వడం కుదరదు. భారత సైనిక, రక్షణ వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకొచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు వదులుకుంటోంది. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లుగా వాయిదాపడుతున్న సంస్కర ణలు సైనిక రంగంలో అమలు చేయడానికి అవకాశం వచ్చింది. ఈ పని చేయకుండా గత ప్రభుత్వాలను నిందించి ప్రయోజనం లేదు. సైన్యానికి అనుకూల మనే అభిప్రాయం ఉన్న కారణంగా మోదీ సర్కారు చాలా చేస్తుందనే అంచనాలు వేశారు. ఏ ఇతర రంగంలో లేనంతగా రక్షణ రంగ సంస్కరణ విష యంలో కేంద్ర వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక వ్యవ స్థను విప్లవాత్మక మార్పులతో ఆధునికీకరించే అరు దైన అవకాశం లభించినా తన పాలనాకాలంలోని చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏవేవో కొన్ని చిన్నాచితకా చర్యలతో కాలం గడుపుతోంది. తన సైనిక కాల్బలానికి అవసరమైన మౌలిక రైఫిళ్లు, సైనిక దళాలకు ఓ మోస్తరు బూట్లు సమకూర్చడానికి నానా పాట్లు పడుతోంది. వైమానికి దళానికి ఆధునికీకరిం చిన జాగ్వార్ యుద్ధ విమానాలు ఇస్తున్నట్టు సగ ర్వంగా చెప్పుకుంటోంది. కాని మొదట ఈ రకం విమానాలను ప్రవేశపెట్టి 40 ఏళ్లు దాటాయి. సైన్యా నికి ఆయుధాలు, సామాగ్రి సరఫరా చేయడంలో వెనుకబాటు మంచిది కాదు. కానీ, రక్షణ రంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు ఆలస్యం చేస్తే జరిగే నష్టం చాలా ఎక్కువ. ఈ విషయంపైనే ఇండియాను చైనా సూటిగా ప్రశ్నించింది. ‘‘మా వైపున అత్యవసర సమ యంలో మాట్లాడడానికి హాట్‌లైన్‌ను ఎవరు నిర్వ హిస్తారో మాకు తెలుసు. భారత సరిహద్దులో తూర్పు నుంచి పశ్చిమ కొస వరకూ యుద్ధ రంగ కమాండర్ ఈ పని చేస్తారు. మరి మీ వైపును ఎవరు చూస్తారు?’’ అని చైనా వేసిన ప్రశ్న ఆందోళనకరం. భారత సరిహద్దులో చైనాకు ఒకే కమాండర్! భారత సరిహద్దులో మోహరించే చైనా సైనిక దళా లన్నింటికీ ఒకే కమాండర్ ఉన్నారు. చైనా బలగాలకు ఒక ఉన్నత సైనిక కమాండర్, ఒక ప్రధాన సైనిక కార్యాలయం ఉంటే, ఇందుకు విరుద్దమైన పరిస్థితి భారత్‌ది. చైనా సరిహద్దున ఉన్న అరుణాచల్, సిక్కిం– భూటాన్ ప్రాంతం తూర్పు ఆర్మీ కమాండర్ నియంత్రణలో ఉంటుంది. ఉత్తరాఖండ్(మధ్య) సెక్టర్ మధ్య ఆర్మీ కమాండర్ అదుపులో, హిమా చల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం పశ్చిమ ఆర్మీ కమాండర్ నియంత్రణలో ఉంటాయి. ఇకపోతే, కశ్మీర్ మొత్తం, లద్దాఖ్ చివరి వరకూ ఉత్తర ఆర్మీ కమాండర్ చేతిలో ఉన్నాయి. భారత వైమానికి దళం (ఐఏఎఫ్) కూడా తన తూర్పు, మధ్య, పశ్చిమ కమాండ్ల ద్వారా సరిహద్దులో తన విధులు నిర్వహి స్తోంది. అంటే, చైనా సరిహద్దులో మూడు నక్షత్రాల హోదా ఉన్న కనీసం ఎనిమిదిమంది భారత సైనిక కమాండర్లు ఒకే ఒక చైనా కమాండర్‌తో విధుల నిర్వహణలో పోటీపడుతుంటారన్న మాట. ఆధునిక సైన్యాన్ని నడిపించే విధానం ఇది కాదు. రెండు దేశాల సైనిక దళాల మధ్య పని చేయాల్సిన హాట్‌లైన్ ప్రొటోకాల్ సమస్యల్లో చిక్కుకుపోయింది. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహ ద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదు రైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్ వైపు నుంచి హాట్లైన్లో ఎవరు మాట్లాడాలి? భారత్ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్య కలాపాల (ఆపరేషన్స్) డైరెక్టర్ జనరల్(డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైని కాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్ సమస్య తలెత్తు తుంది. మన మొత్తం సైనిక(ఆర్మీ) దళాల డీజీఎంఓ చైనాకు చెందిన ‘కేవలం’ యుద్ధరంగ(థియేటర్) కమాండర్‌తో మాట్లాడడం కుదురుతుందా? అనే ప్రశ్న మన సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇది కేవలం ప్రొటోకాల్‌కు సంబంధించినదే అయితే హాస్యాస్పదం కాదా? ఆధునిక యుద్ధంలో వేగం, పోరు తీరు, శరవేగంతో దళాలు, ఆయుధాల తర లింపు, ఆయుధాల పనితీరు, సమన్వయంతో కూడిన యుద్ధ వ్యూహాలు అత్యంత కీలకమైనవి. మన మౌలిక సైనిక వ్యవస్థలను బ్రిటిష్‌వారు మనకు అప్పజెప్పి వెళ్లిన స్థాయిలోనే ఇప్పటికీ కొనసాగు తున్నాయి. బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన సైనిక కంటోన్మెంట్లే ఇంకా పనిచేస్తున్నాయి. ఇటీవల మాజీ నౌకాదళ అధిపతి అరుణ్ ప్రకాశ్‌తో మాట్లాడిన ప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన విషయం వెల్లడిం చారు. ‘‘డొక్లామ్ సరిహద్దులో చైనాతో పోరాటం మొదలై ఉంటే–ఐదు రకాల భారత సైనిక విభా గాలు(కమాండ్లు) చైనా ఆర్మీతో తలపడాల్సివచ్చేది. వివిధ భారత విభాగాల మధ్య సమన్వయం సమస్యే. అదే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒకే కమాండ్ కింద ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా భారత దళాలతో పోరాడేది,’’ అని ఆయన చక్కగా కీలక పోరు సమస్యను వివరించారు. స్వల్ప కాలంలో, కొద్ది ప్రదేశంలో జరిగే భీకరపోరులో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలం? 19 విభిన్న కమాండ్లుగా భారత సైన్యం! భారత సైనిక దళాలను ప్రస్తుతం 19 విభిన్న విభా గాలుగా(కమాండ్లు) విభజించిందీ అరుణ్‌ప్రకాశ్ వివరించారు. ఏ రెండు సైనిక కమాండ్లూ ఏక లక్ష్యంతో, ఒకే ప్రాంతంలో లేవని ఆయన చెప్పారు. ఇంతటి అధ్వాన స్థితిలో సైనిక వ్యవహారాలు నడు స్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే తూర్పు ఆర్మీ కమాండ్ కోల్‌కతాలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద గ్రూపులను అదుపులో పెట్టే బాధ్యత కూడా దీనిదే. ఈ ఆర్మీ కమాండ్‌తో సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన తూర్పు వైమానిక దళ కమాండ్ విచిత్రంగా యుద్ధ విమానాలు దిగే ఎయిర్‌స్ట్రిప్ కూడా లేని ప్రాంతంలో ఉంది. సుందరమైన పర్వతా లకు నిలయమైన ఎగువ షిల్లాంగ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటే ఎంత ఇబ్బందికరంగా ఉందంటే–కోల్‌కతా నుంచి వేగంగా విమానంలో షిల్లాంగ్ వెళ్లాలంటే బంగ్లాదేశ్ గగనతలంపై పయ నించాల్సి ఉంటుంది. ఆర్మీ కమాండ్ ఉన్న కోల్‌కతా లోనే దీన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని బ్రిటిష్ వారు ప్రశ్నిస్తున్నారు. ఇక తూర్పు నౌకాదళ కమాండ్ విషయానికి వస్తే ఇది దక్షిణాన విశాఖపట్నంలో ఉంది. తూర్పు రంగంలో మాత్రమే ఇంతటి గందర గోళ పరిస్థితులున్నాయంటే పొరపడినట్టే. పశ్చిమ కమాండ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పశ్చిమ ఆర్మీ కమాండ్ చండీగఢ్ నగరం శివార్లలోని చండీమంది ర్లో ఉంది. కాగా, పశ్చిమ వైమానికి దళ కమాండ్ ఢిల్లీ నుంచి పనిచేస్తోంది. భారత వైమానిక దళా ధిపతి ప్రధాన కార్యాలయం, అతి పెద్ద కమాండ్ ఒకే నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ రెండింటికి మధ్య దూరం కేవలం ఐదు మైళ్లే. ఇలా దేశంలోని సైనిక కమాండ్ల జాబితాలు, వివరాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అన్ని కమాండ్లలోనూ ఒకే రకమైన అవ్వవస్థ రాజ్యమేలు తోంది. దక్షిణ ఆర్మీ కమాండ్ పుణె నగరంలో ఉండగా, పాకిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్– రాజస్థాన్ ఏడారి ప్రాంతం రక్షణ బాధ్యత దీనికి అప్పగించారు. కాని, దీనికి తోడ్పడాల్సిన నైరుతి వైమానికి దళ కమాండ్ గాంధీనగర్ నుంచి పని చేస్తోంది. ఇంకా, వైమానిక దళ దక్షిణ కమాండ్ తిరు వనంతపురంలో ఉంది. దీనికి మొత్తం ద్వీపకల్ప ప్రాంత రక్షణ బాధ్యత కల్పించారు. ఆర్మీ నైరుతి కమాండ్ జైపూర్‌లో ఉండగా, దానికి సాయమం దించే వాయుసేన ప్రధానకార్యాలయాలు ఢిల్లీలో (పశ్చిమ), గాంధీనగర్‌లో ఏర్పాటై ఉన్నాయి. అల హాబాద్(మధ్య)లోని వైమానిక దళ కమాండ్ కూడా దీనితో కొన్నిసార్లు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, ఏ రెండు కమాండ్లూ ఒక చోట నుంచి, ఒకే లక్ష్యంతో పని చేయడం లేదని స్పష్టమౌతుంది. ఒక్క అండమాన్ దీవుల్లో మాత్రమే త్రివిధ బలగాల కమాండ్లు ఒకేచోట కేంద్రీకృతమై పనిచేస్తున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కొత్త సమీకృత కమాండ్లు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయని చెప్పవచ్చు. చివరి సంవత్సరంలో హడావుడి ఇంతటి గందరగోళ పరిస్థితుల మధ్య ఇప్పటికే ఎక్కువగా విస్తరించి ఉన్న ఆర్మీ తూర్పు కమాండ్ ఆజమాయిషీలో కొత్తగా మౌంటెన్ స్ట్రయిక్ కోర్ అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పెట్టారు. పైన వివరించిన ఆందోళనకరమైన విషయాలు ‘ద ప్రింట్’ వెబ్సైట్లో వెల్లడవడంతో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త దళం ఏర్పాటు విషయాన్ని ఆర్మీ నిర్ణయానికే వదిలేశామని ఆమె చెప్పారు. ఆర్మీ చీఫ్ అనవసరంగా సైనిక కమాం డ్లను విస్తరించే కన్నా ఉన్న వాటిని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంతో తెగువ, తెలివితేటలు ప్రద ర్శిస్తున్నారని భావిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏమంటే, సైన్యానికి సంబంధించిన మౌలిక సంస్థా గత విషయాలపై మంత్రి స్పందన. సంయుక్త యుద్ధ రంగ కమాండ్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం అనుకూలమని ఆమె చెప్పారు. ఈ విషయం మనం గతంలో ఎన్ని సార్లు విన్నాం? ఈ విషయంలో ముందుకు సాగడానికి ఇదివరకటి ప్రభు త్వాలకు రాజకీయ బలం లేదు. మరి మోదీ ప్రభు త్వం ఈ నాలుగేళ్లలో ఈ పనిచేయకుండా ఎవరు అడ్డుకున్నారు? మొదటి నాలుగు సంవత్సరాలూ కళ్లు మూసుకున్న మోదీ ప్రభుత్వం చివరి దశలో హడావుడి చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యస్థలో పరిపా లన అంటే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ కాదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
వద్దురా... సామీ ఈ విధులు
సాక్షి, కడప / అగ్రికల్చర్ : ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లుంది జిల్లా కేంద్రంలోని పలు శాఖల అధికారులు పరిస్థితి. ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. కాదు.. పోము.. అంటే కుదరదు. అందునా ప్రభుత్వ ఉద్యోగం. ప్రోటోకాల్ కావడంతో అల్లాడిపోతున్నారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు వారంరోజులుగా ప్రతిరోజు వస్తున్న ప్రముఖుల సేవలో ప్రభుత్వ అధికారులు నలిగిపోయారు. వద్దురా సామీ.. ఈ విధులు అంటూ కొట్టుకుంటున్నారు. మంత్రులు, వీఐపీల వెంట వచ్చే చోటా మోటా నేతలఆర్డర్లతోనే అధికారులు అదిరిపోతున్నారు. ఇది కావాలి, అది కావాలి అంటూ మంత్రుల వెంట వచ్చేవారు ఆదేశాలు ఇస్తుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్ష కారణంగా అధికారులకు నిద్ర ఉండటం లేదు. ఒకపక్క ప్రొటోకాల్, మరోపక్క దీక్షకు సంఘీభావాల నేపథ్యంలో జన సమీకరణతో అల్లాడిపోయారు. తమ్ముళ్లతో తంటా! దీక్షకు సంఘీభావం తెలుపడానికి వచ్చే మంత్రులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రొటోకాల్ కలిగిన సంస్థల అధ్యక్షులు ఆర్‌అండ్‌బీలో దిగుతున్నారు. ఈ సందర్భంలో వారి అనుయాయుల హడావుడి అంతా ఇంతా కాదు. వారి కోర్కెలు తీర్చడం పలుశాఖల్లో ప్రొటోకాల్ చూసే అధికారుల చేతిచమురు వదులుతోందని ఆందోళన చెందుతున్నారు. ఉద యం పూట తెలుగు తమ్ముళ్లు తమకు టిఫెన్లు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్నం ఖరీదైన భోజనాలు తెప్పించి ఉం చాలని ఆదేశించడం పరిపాటిగా మారిం దని అధికారులు వాపోతున్నారు. పోతూపోతూ తమ వాహనాలకు డీజిల్ పట్టించుకుని మరీ వెళుతున్నారు. మంత్రుల హడావుడి.. అధికారుల గడిబిడి రోజూ మంత్రుల హడావుడి ఉంది. ప్రతిక్షణం వారి రాక కోసం కొందరు అధికారులు బొకేలు అందించడం, తర్వాత దీక్ష ప్రాంగణానికి తీసుకెళ్లే వరకు బాధ్యతలతో బిజీబిజీగా కనిపిస్తున్నారు. అలాగే మంత్రుల రెస్ట్ కోసం విశ్రాంతి భవనాలకు తీసుకు వెళ్లడం, ఇతర అవసరాల మేరకు అందుబాటులో ఉండడంతోపాటు మంత్రుల విభాగాలకు సంబం«ధించిన జిల్లా అధికారులు కూడా ప్రొటోకాల్ ప్రకారం కనిపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా మంత్రుల పర్యటనలతో అధికారులు వారంరోజులుగా అల్లాడిపోతున్నారు. అలాగే జిల్లాకు మంత్రులు, వీఐపీలు, ఎంపీలు, సినీ ప్రముఖులు రాకతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. వారం రోజులుగా ఎయిర్‌పోర్టు నుంచి దీక్షా శిబిరం వరకు మంత్రులను తీసుకు రావడం, రోడ్డు మార్గాన వచ్చేవారికి ఎక్కడికక్కడ వెంట బందోబస్తుతోపాటు దీక్షాశిబిరం వద్ద వీఐపీల తాకిడి నేపథ్యంలో బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగానికి నిద్రలేకుండా పోయింది. -
ఒత్తిళ్ల మధ్య ప్రజలకు మేలు చేశారు
తిరుపతి సిటీ: ‘సబ్‌కలెక్టర్‌గా నిశాంత్‌కుమార్ గత 14 నెలల్లో ప్రోటోకాల్, భూసేకరణతో పాటు భూ ఆక్రమణలను నిరోధించగలిగారు. ఒత్తిళ్ల మధ్యలో కూడా ప్రజలకు మేలు చేశారు.’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రశంసించారు. సబ్‌కలెక్టర్ నిశాంత్ కుమార్ బదిలీపై వెళుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి ఒక ప్రైవేటు హోటల్లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు భూములు తీసుకుంటే సదరు భూమి కోల్పోయే వ్యక్తి జీవనం కూడా మెరుగు పరచడానికి బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. నిషాంత్ చేసిన మంచిపనులకు నిదర్శనంగా సీపీఎంకు చెందిన కందారపు మురళి వంటి నేతలు వీడ్కోలు సభలో పాల్గొనడం విశేషమన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అనుభవం లేని తాను ఇక్కడ ఎన్నో నేర్చుకున్నానని, కలెక్టర్ సూచనలతోనే ప్రజా సమస్యలను పరిష్కరించగలిగానన్నారు. జాయింట్ కలెక్టర్ గిరీషా మాట్లాడుతూ తక్కువగా మాట్లాడి పనులు చక్కబెట్టేవారని, నిశాంత్ నుంచి ఫైల్ వస్తే చూడకుండా సంతకం చేయవచ్చునని గుర్తు చేశారు. అనంతరం నిశాంత్‌కుమార్ దంపతులను తిరుపతి రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దుశ్శాలువతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏఓ ఝాన్సీ, రేణిగుంట విమానాశ్రయ డైరెక్టర్ పుల్ల, సీఎస్ఎఫ్ కమాండెంట్ మనీషా, తహసీల్దార్లు నరసింహులునాయుడు, చంద్రమోహన్, రాజశేఖర్, మునాఫ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తా
శ్రీకాకుళం సిటీ: అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించకపోతే బాధ్యులను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి స్పష్టం చేశారు. పాలకొండ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించడం లేదన్న ఎమ్మెల్యే కళావతి ఫిర్యాదు మేరకు కలెక్టర్ పైవిధంగా స్పందించారు. గ్రామ సర్పంచ్ నుంచి మంత్రుల వరకు అధికారులు విధిగా ప్రొటోకాల్‌ను పాటించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయి సంఘ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ నాయకులు సైతం పలు శాఖల పనితీరుపై ధ్వజమెత్తారు. అధికారులకు, సభావేదికపై ఉన్న వారికి ప్రశ్నల వర్షం కురిపించారు. వారి సమాధానాలతో అసంతృప్తి వ్యక్తం చేసారు. మొత్తం 47 శాఖల ఉండగా, కేవలం ఏడుశాఖల పనితీరుపై మాత్రమే చర్చ కొనసాగింది. ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 3 వరకు జెడ్పీలో జరిగిన స్థాయి సంఘాల సమావేశం తీరును పరిశీలిస్తే... చర్చించిన శాఖలు.. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, హౌసింగ్, మార్కెటింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఎస్ఏ శాఖలపై చర్చిం చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు, జెడ్పీ సీఈఓ బి.నగేష్, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే కంబా ల జోగులు, విశ్వాసరాయి కళావతి, గౌతు శ్యాం సుందర్శివాజీ, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మరుగుదొడ్లు లేకపోతే పింఛన్ కట్.. మరుగుదొడ్లు నిర్మించకపోతే వ్యక్తిగత పింఛన్, రేషన్ సరుకులు నిలుపుదల చేస్తామని కలెక్టర్ ధనంజయరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో సర్పంచ్‌లు అశ్రద్ధ చేస్తే 14వ ఆర్థిక సంఘ నిధులు ఆపేస్తామని చెప్పారు. స్వచ్చభారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 వేలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.18వేలు ఇస్తున్నామన్నారు. జిల్లాకు జీవనాడి వంశధార.. వంశధార నది జిల్లాకు జీవనాడి వంటిదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 19 నిర్వాసిత గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించడంలో కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాం గం కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. నిర్వాసితులకు నష్టపరిహారంగా రూ.12 కోట్లు అదనంగా ఖర్చు పెట్టామన్నారు. నిర్వాసితి కాలనీలకు ప్రత్యేకంగా బృందాలను పంపిస్తూ ఉపాధి జాబ్‌కార్డులను ఇస్తామని చెప్పారు. -
ప్రొటోకాల్ ప్రముఖులకే బ్రేక్ దర్శనం
సాక్షి, తిరుమల : సంవత్సరాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. కాబట్టి గోకులం భవనంలోని జేఈవో కార్యాలయంలో శుక్రవారం నుంచి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని, ఈ నిర్ణయాన్ని జనవరి మొదటి వారంలో మళ్లీ సమీక్షిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా ఈ నెల 28 నుంచి జనవరి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆర్జిత సేవలను, దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవని అధికారులు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడంతో ఏకాంతంగా అభిషేకం నిర్వహించిన తరువాత ప్రముఖులకు బ్రేక్ దర్శనం ప్రారంభిస్తారు. లఘు దర్శనం మాత్రమే అమలుచేస్తారు. హారతి ఉండదు. మహద్వార ప్రవేశం ఉండదు. టికెట్లపై సూచించిన మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
ప్రొటోకాల్ రగడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్నా
రావులపాలెం: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్నాకు దిగడం, పోలీసులు రంగప్రవేశం వరకు వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. రావులపాలెం మండలం పొడగట్లపల్లి-రాజవరం ఆర్అండ్బి రోడ్డు ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌పై టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదం ఏర్పడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధర్నాకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అడ్డుకున్నారు. -
టీఆర్ఎస్లో ప్రొటోకాల్ రగడ
వర్ధన్నపేట: అధికార పార్టీలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యేపై ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రుగా ఉన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. దీనిని నిరసిస్తూ సభా ప్రాంగణానికి వస్తే అక్కce ఫ్లెక్సీలో ఎంపీ పసునూరు దయాకర్ పేరు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిల పేర్లు కూడా పెట్టలేదు. దీంతో కినుక వహించిన వారిద్దరూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. -
పాలమూరులో ప్రొటోకాల్ చిచ్చు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రొటోకాల్ వివాదం శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ సమావేశంలో చిచ్చుకు దారితీసింది. ఈ విషయమై మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌ డ్, సంపత్‌కుమార్‌ల నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. జెడ్పీ అతిథి గృహం పునఃప్రారంభోత్సవం విషయమై స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు సమాచారం ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఇటీవల మరమ్మతులు చేసిన జెడ్పీ అతిథి గృహాన్ని శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఎందుకివ్వలేదని, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యే చేత ఎలా ప్రారంభోత్సవం చేయిస్తారంటూ జెడ్పీ సమావేశం లో శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్, జడ్చర్లలో గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ చేత ప్రారంభోత్సవం చేయిస్తే ఊరుకుంటా రా అంటూ మండిపడ్డారు. గంటసేపు వివా దం సాగడంతో బండారి భాస్కర్ కలుగజేసు కుని అనుకోకుండా రిబ్బన్ కట్ చేయాల్సి వచ్చిందని, అధికారిక ప్రారంభోత్సవం కాదని కొబ్బరికాయ కూడా కొట్టలేదంటూ చెప్పుకొచ్చారు. మంత్రులిద్దరూ భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. నన్నెందుకు అవమానిస్తారు: సంపత్ ఈ విషయమై ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇద్దరు మంత్రులు నాకు బలవంతంగా కత్తెర ఇచ్చి రిబ్బన్ కట్ చేయించి, తీరా ఇప్పుడేమో బోగస్ ఓపెనింగ్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం. మంత్రులే స్వయంగా బోగస్ ఓపెనింగ్ చేయించి నన్ను అవమాన పరుస్తారా? నాకు అవమానం కలిగిస్తే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా’ అంటూ ధ్వజమెత్తారు. -
ప్రొటోకాల్ విస్మరించడం దారుణం
ఆత్రేయపురం : స్థానిక ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులకు కనీస సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పిచ్చుకలంక ప్రాంతాన్ని సందర్శించి ప్రొటోకాల్ విస్మరించారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక మం డల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొటోకాల్ విస్మరణపై, ఆయా శాఖల అధికారుల తీరుతెన్నులపై ప్రివిలేజ్ కమిటీకీ ఫిర్యాదు చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తనకు సమాచారం ఇవ్వకండా నియోజకవర్గ పరిధిలోని పిచ్చుకలంక పర్యటక కేంద్రాన్ని అధికారికంగా పరిశీలించడం ఎంతవరకు సమంజసమన్నారు. పిచ్చుక లంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు తన తండ్రి సోమసుందరరెడ్డి హయాంలో అప్పటి పర్యాటక మంత్రి గీతారెడ్డిని తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. బొబ్బర్లంక గ్రామంలో జిరాయితీ భూములు లేక గ్రామస్తులు జీవనోపాధి నిమిత్తం తరతరాలుగా రొయ్యి సీడ్ ద్వారా జీవనం సాగిస్తున్నారని ఇరిగేషన్ అధికారులు వారిని వేధించడం తగదన్నారు. పిచ్చుకలంకను ఆనుకుని ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న రైతులను అధికారులు ఖాళీ చేయమనడం దారుణమన్నారు. -
పాలన మూలన
సమీక్షలు, ప్రొటోకాల్ విధుల్లో జిల్లా అధికారులు కార్యాలయాల్లో పేరుకుపోతున్న ఫైళ్లు పనులు కాక ఇబ్బందిపడుతున్న ప్రజానీకం విజయవాడ : రాజధాని ముఖ్య కేంద్రం విజయవాడ అయినందుకు సంబరపడాలో.. పాలనను పక్కనబెట్టి నిత్యం సీఎం, మంత్రుల చుట్టూ తిరిగే అధికారులను చూసి బాధపడాలో అర్థంకాక జిల్లావాసులు తలలు పట్టుకుంటున్నారు. అమరావతి రాజధాని అయినప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే జరుగుతుండడంతో అంతా సంతసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసుకున్నాక కొంతమంది అమాత్యులు కూడా ఆయన బాటే పట్టారు. నిత్యం సీఎంను కలిసేందుకు సందర్శకులు రావడం.. రోజువారీ సమీక్షలు.. అడపాదడపా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. మిగిలిన మంత్రులు కూడా తమ శాఖ సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు తరచు ఇక్కడికే వచ్చిపోతున్నారు. వీరు నిత్యం నిర్వహించే సమీక్షలను చూసి అధికారులు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. సమీక్షలకే పరిమితం.. గంటలకొద్దీ సమీక్షలు సాగడంతో జిల్లాలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అధికారులు క్షేత్ర సందర్శనను పూర్తిగా మానేశారు. వీఐపీల ప్రొటోకాల్ విధుల నిర్వహణ, వీడియో కాన్ఫరెన్స్‌లు, సెల్ కాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలతోనే అధికారులు కాలక్షేపం చేస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు ప్రతిఒక్కరూ సీఎం క్యాంపు ఆఫీసు, కలెక్టర్ క్యాంపు ఆఫీసు, ఎయిర్‌పోర్టు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమవుతున్నారు. గంటలకొద్దీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అధికారులు పడిగాపులు పడుతున్నారు. ఫలితంగా ఆయా కార్యాలయాల్లో ఫైళ్లన్నీ పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలన స్తంభిస్తోంది. ఇదిలా ఉంటే మరికొందరు అధికారులు, సిబ్బంది నివేదికలు తయారుచేయడంలో తలమునకలై ఉంటున్నారు. కనీసం గ్రామస్థాయిలో పనిచేసే వీఆర్వోలు, ఇంజినీరింగు డిపార్టుమెంట్లో పనిచేసే ఏ ఒక్క వర్క్ఇన్స్పెక్టర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. రోజూ గ్రామాలు, పట్టణాల్లో జరిగే రోడ్ల అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఇంజినీరింగ్, ఆర్ అండ్ బీ, ఎన్‌హెచ్ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లకుండా క్యాంపు ఆఫీసుల వద్దే మకాం వేస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు వర్క్‌షాపుల ఏర్పాటు, జనసమీకరణ వంటి పనుల్లో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉంటున్నారు. ప్రతి నెల నాలుగైదు పబ్లిక్ మీటింగులు, వర్క్‌షాపులలో స్టాల్స్ ఏర్పాటుచేయడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని అధికారులు వాపోతున్నారు. మంత్రులతో మొర ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టడం వల్ల రాత్రి పొద్దుపోయే వరకు తాము ఇబ్బందులు పడుతున్నామని మంత్రులు, ప్రజాప్రతినిధులకు అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. సోమవారం మచిలీపట్నంలో జరిగిన మీకోసం కార్యక్రమానికి పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంతో కలెక్టర్ బాబు.ఎ. ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ప్రొటోకాల్ విధులు, జిల్లా ఉన్నతాధికారులు చేయనవసరం లేదని, మంత్రుల పర్యటనలకు దిగువ స్థాయి అధికారులను పంపితే చాలని పలు శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆదేశాలివ్వడం కొసమెరుపు. -
ప్రొటోకాల్ ఉల్లంఘన
ఎంపీ పొంగులేటికి తెలపకుండా బ్రిడ్జి శంకుస్థాపన అధికారుల తీరుపై విమర్శలు సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల శాఖ అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ రహదారుల పరిధిలోకి వచ్చే ఈ పనులను మంగళవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చిన పనులకు ప్రత్యేకంగా స్థానిక పార్లమెంటు సభ్యుడికి సమాచారం ఇవ్వాలి. బ్రిడ్జికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకంపై ప్రత్యేకంగా ఎంపీ పేరు పేర్కొన్నా... ఆయనకు మాత్రం ఆహ్వానం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ఎన్‌హెచ్ ఎస్ఈ వసంత వివరణ ఇస్తూ.. అధికారులు ఎంపీకి సమాచారం ఇచ్చేందుకు పలుమార్లు ఫోన్ చేశారని, ఆయన ఫోన్ ‘నాట్ రీచబుల్’ అని వచ్చిందని తెలిపారు. -
పెన్నహోబిలంలో ప్రొటోకాల్ వివాదం
-
పెన్నహోబిలం ఆలయంలో ప్రొటోకాల్ వివాదం
అనంతపురం: అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. శనివారం అక్కడ రథోత్సవం జరిగింది. స్థానిక ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రాకుండానే ఆలయ అధికారులు రథోత్సవాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆలయ అధికారి సుధారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. -
తెలుగుదేశం ఏజెంటుల్లా అధికారులు
హైదరాబాద్: అధికారులు తెలుగుదేశం పార్టీ ఏజెంటుల్లా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పీలేరు వైఎస్సార్సీపీ శాసన సభ్యుడు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్, మదనపల్లి ఆర్డీవో, చిత్తూరు జెడ్పీ సీఈవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవకుండా తనపై పోటీ చేసి ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ ఖాన్‌ను పిలుస్తున్నారని, రామచంద్రారెడ్డి పిటిషన్లో వివరించారు. -
టీడీపీ నేతల హల్చల్!
పదవులు లేకపోయినా వేదికలెక్కుతున్న తెలుగుతమ్ముళ్లు పిలవకపోతే అధికారులపై చిందులు బహిరంగంగానే బెదిరింపులు, ఆగ్రహావేశాలు తీవ్ర ఆవేదన చెందుతున్న అధికారులు పెందుర్తి : ‘ఏమోయ్ నీకు ప్రొటోకాల్ తెలుసా... ఎవరో చెప్పిన తరువాత నన్ను వేదిక మీదకు పిలుస్తావా... ఎలా ఉంది నీకు... నీ సంగతి చూస్తా’... ఇదీ ఆదివారం పురుషోత్తపురంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఓ ఉన్నతాధికారిపై టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు చిందులు. నియోజకవర్గంలోని అధికారులకు ప్రొటోకాల్ తలనొప్పులు పట్టుకున్నాయి. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా తెలుగుతమ్ముళ్లు వాలిపోతున్నారు. తమను వేదిక పైకి పిలవకపోతే అలుగుతున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా అధికారులను దూషిస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇదెక్కడి ప్రొటోకాల్ బాధరా బాబూ అంటూ అధికారులు జట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి పదవుల్లేని తెలుగుతమ్ముళ్లు సరికొత్త ‘ప్రొటోకాల్’తో ప్రభుత్వ కార్యక్రమాలు కాస్త పార్టీ కార్యక్రమాలుగా మారిపోతున్నాయని ప్రజలు విసుక్కుంటున్నారు. ఇదెక్కడి బాధ... వాస్తవానికి అధికారపక్షంలో ఉన్నా పదవులు లేని నాయకులను వేదికల మీదకు పిలవాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకే తప్ప నాయకులకు ప్రొటోకాల్ వర్తించదు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక పెందుర్తి నియోజకవర్గంలో ప్రొటోకాల్‌కు అర్థం మారిపోయింది. ఎమ్మెల్యేల అనుచరులు ఎంతమంది వేదిక వద్దకు వస్తే అంతమందిని పైకి పిలవాల్సిన పరిస్థితి అధికారులకు ఏర్పడింది. పదుల సంఖ్యలో వస్తున్న నాయకులతో వేదిక నిండిపోవడంతో కార్యక్రమాన్ని నడిపించాల్సిన ఉన్నతాధికారులు సైతం ఏదో మూల నిలబడ్డమో..వేదిక ముందు కూర్చోవడమో చేస్తున్నారు. మరోవైపు వేదిక మీదకు వెళ్లిన ప్రతి నేతకు మైక్ ఇవ్వాల్సి రావడంతో ప్రభుత్వ కార్యక్రమం కాస్త పార్టీ కార్యక్రమంగా మారిపోతుందుని కొందరు అధికారులు వాపోతున్నారు. అందరికీ కోపమే... అధికారుల తీరు ఇలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి మరోలా ఉంది. వాస్తవానికి ఎమ్మెల్యే బండారుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పెందుర్తిలో అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యేల అనుచరులు ఈ ప్రాంతంలో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యే, అందులో వర్గాలు కలుపుకుని అంతా కలిపి దాదాపు 50 నుంచి 60 మంది అవుతున్నారు. వీరందరినీ వేదిక పైకి పిలవకపోతే స్థానిక ఎమ్మెల్యే బండారుపై అలుగుతున్నారు. దీంతో ఇటు నాయకులకు సర్దిచెప్పలేక... అటు అధికారులను సముదాయించలేక బండారు మౌనం వహిస్తున్నారు. -
టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
పుత్తూరు : తెలుగుతమ్ముళ్లు ప్రొటోకాల్‌ను విస్మరించి ఓవరాక్షన్ చేశారు. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం జరిగిన అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే రోజా హాజరైన ఈ సమావేశానికి ఆస్పత్రి ఇన్చార్జ్ డాక్టర్ సబిత, డాక్టర్ రవిరాజులు ప్రొటోకాల్ ప్రకారం తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ తులసీకుమార్, చైర్మన్ కరుణాకరన్, ఎంపీపీ గంజి మాధవయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు కమలమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ పుష్పలతను వేదికపైకి ఆహ్వానించారు. ఆస్పత్రి నివేదికను చదివి వినిపించడంతో పాటు సమస్యలను వేదిక దృష్టికి తీసుకొచ్చారు. అయితే అక్కడే డాక్టర్స్ గదిలో వేచి ఉన్న టీడీపీ కార్యకర్తల్లోని ఒకరు గోపాల్‌రెడ్డి సమావేశం మధ్యలో కల్పించుకున్నారు. వైద్యులు వారి సమస్యలను మాత్రమే చెప్పుకొచ్చారని, తాను పబ్లిక్ తరఫున మాట్లాడుతున్నానని, రోగుల సమస్యను మరచి మాట్లాడటం సరికాదని వాదించారు. ఆస్పత్రి అంబులెన్స్ మూడు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే వారే లేరని గట్టిగా రెచ్చిపోయారు. ఈ దశలో కౌన్సిలర్, వైఎస్సార్సీపీకి చెందిన ఏలుమలై(అమ్ములు) జోక్యం చేసుకుంటూ ప్రొటోకాల్‌ను వ్యతిరేకించి అతనిని ఎందుకు రానిచ్చారని అధికారులపై మండిపడ్డారు. దీంతో మాట్లాడటానికి నువ్వెవరంటూ గోపాల్‌రెడ్డి బిగ్గరగా కేకలు వేయడంతో ఆయనకు అండగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు తోడయ్యారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఇరువర్గాల అరుపులు కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. ఒక దశలో రోజా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులకు సమాచారం వెళ్లింది. ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉదయం నుంచే టీడీపీ వర్గీయులు మోహరించినా అధికారులు పట్టించుకోలేదు.