ప్రొటోకాల్ విస్మరించడం దారుణం
ప్రొటోకాల్ విస్మరించడం దారుణం
Published Mon, Sep 26 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
ఆత్రేయపురం : స్థానిక ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులకు కనీస సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పిచ్చుకలంక ప్రాంతాన్ని సందర్శించి ప్రొటోకాల్ విస్మరించారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక మం డల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొటోకాల్ విస్మరణపై, ఆయా శాఖల అధికారుల తీరుతెన్నులపై ప్రివిలేజ్ కమిటీకీ ఫిర్యాదు చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తనకు సమాచారం ఇవ్వకండా నియోజకవర్గ పరిధిలోని పిచ్చుకలంక పర్యటక కేంద్రాన్ని అధికారికంగా పరిశీలించడం ఎంతవరకు సమంజసమన్నారు. పిచ్చుక లంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు తన తండ్రి సోమసుందరరెడ్డి హయాంలో అప్పటి పర్యాటక మంత్రి గీతారెడ్డిని తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. బొబ్బర్లంక గ్రామంలో జిరాయితీ భూములు లేక గ్రామస్తులు జీవనోపాధి నిమిత్తం తరతరాలుగా రొయ్యి సీడ్ ద్వారా జీవనం సాగిస్తున్నారని ఇరిగేషన్ అధికారులు వారిని వేధించడం తగదన్నారు. పిచ్చుకలంకను ఆనుకుని ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న రైతులను అధికారులు ఖాళీ చేయమనడం దారుణమన్నారు.
Advertisement
Advertisement