jaggireddy
-
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సానిటైజేషన్ పనులు
-
‘వారు సభ సమయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు’
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు కావల్సినంత సమయాన్ని ఇస్తున్నప్పటికీ వారు వినియోగించుకోలేక పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. మండలిలో సంఖ్య బలం ఎక్కువ ఉండటంతో వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ ప్రభుత్వ బిల్లులను సరైనా రీతిలో ప్రవేశపెట్టడం లేదని.. బిల్లుపై చర్చ పెట్టకుండ సాగదీయడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అనేది చంద్రబాబుకు అక్కర్లేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు ఇక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దల సభలో చంద్రబాబు పెద్ద తప్పులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు విధానం మారకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని ఆయన దుయ్యబట్టారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల తల్లులు ఆనందంగా ఉన్నారని, ప్రతి బిడ్డా చదువుకోవాలనేదే సీఎం జగన్ ఉద్దేశమని ఆయన తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా విజయనగరం అని తెలిపారు. విద్యారంగంలో విజయనగరం ముందుకు వెళ్తుందని తాను ఆశిస్తున్నానట్లు పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాను చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు మెడికల్ కాలేజిని ప్రకటించిన సీఎం జగన్‌కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
‘నేను మనిషినే.. మహాత్ముడిని కాదు’
సాక్షి, కాకినాడ: గతవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెచ్చిపోయిన విషయం విదితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన రెడ్డి సుబ్రహ్మణ్యం.. జగ్గిరెడ్డిని నోటికొచ్చినట్టు తిడుతూ, అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. వాటర్ బాటిళ్లు, నేమ్‌బోర్డు, కాగితాలను విసురుతూ దాడికి దిగారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రెడ్డి సబ్రహ్మణ్యం ఇలా చేయడంపై సభలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై బుధవారం రెడ్డి సబ్రహ్మణ్యం స్పందించారు. ‘నేను మనిషినే.. మహాత్ముడిని కాదు. అయినా జెడ్పీ సమావేశంలో సహనం కోల్పోయి బాటిల్ విసిరాను. అది దురదృష్టకరమైన సంఘటన. తొందరపడకుండా ఉంటే బాగుండేది. జడ్జి స్థానంలో ఉన్న నన్ను దొంగ అనడంతో సహనం నశించింది. ఇసుక అవినీతి అరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. -
కాకినాడ: జిల్లా పరిషత్ సమావేశంలో రచ్చ రచ్చ
-
ఎమ్మెల్యేను తిడుతూ... వాటర్ బాటిల్ విసిరేసి..
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ సమావేశంలో రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన రెడ్డి సుబ్రహ్మణ్యం దుర్భాషలాడుతూ ఎమ్మెల్యేపై నేమ్ ప్లేట్, వాటర్ బాటిళ్లను విసిరేశారు. ఈ ఘటనతో సమావేశంలో మిగిలిన వారందరూ నిశ్చేష్టులు అయ్యారు. జగ్గిరెడ్డి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. కాగా, వివాదంతో చైర్మన్ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేపై దాడికి దిగిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తీరును వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. -
చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారు
-
ఆగని నిలదీతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో సోమవారం జరిగిన ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామ సభల్లో కూడా నిలదీతల పరంపర కొనసాగింది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం, కొత్తపల్లి మండలం కొమరిగిరి, గోర్సల్లో తమ సమస్యలు పరిష్కరించని ఈ సభలు ఎందుకని అధికారులను నిలదీశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండలం చింతలూరులో సీపీఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ‘దశాబ్దాలు దాటుతున్నా ఈనాం భూముల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ నేతలను దిగ్బంధనం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు మండలం పేగ గ్రామంలో గిరిజనులు ఏకంగా సభలో నిరసన తెలిపి బహిష్కరించారు. దేవీపట్నం మండలం కూడిపల్లి, చినరమణయ్యపేటలో పోలవరం ముంపు బాధితులు తమ నిరసన గళం వినిపించారు. సభను బహిష్కరించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన సభలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. తన పట్ల టీడీపీ నేతలు అవలంబించిన తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సభను బహిష్కరించారు. సభలో తొలుత ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అరకొరగా అమలు చేస్తున్న పథకాలను, అమలు చేయని హామీలను, ప్రభుత్వ దుబారాను ఎండగడుతుండగా టీడీపీ శ్రేణులు లేచి అడ్డుతగిలి గలాటా సృష్టించారు. దానికి ప్రతిగా వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసి రసాభాసగా మారింది. దీన్ని నిరసిస్తూ జగ్గిరెడ్డి సభను బహిష్కరించి బయటకు వచ్చేశారు. -
మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్ ఆలమూరు (కొత్తపేట) : ఇటీవల దళితులను ఉద్దేశించి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి సీహెచ్ ఆదినారాయణరెడ్డి అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని బహిరంగ క్షమాపణ తెలపాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని పెదపళ్లలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ రిజర్వేషన్లు ఉద్దేశించి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేశామని చెబుతున్న సీఎం చంద్రబాబు మళ్లీ స్టీరింగ్ కమిటీల నియామకం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికలోను, కాకినాడ నగరపాలక సంస్థలోను వైఎస్సార్సీపీ విజయం సాధింస్తుందని దీమా వ్యక్తంచేశారు. ఫ్రోటోకాల్ ఉల్లంఘనలతో అప్రతిష్ట జిల్లాలో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు ఉన్నచోట తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘనలతో పాల్పడుతూ టీడీపీ తన నైజాన్ని బయటపెట్టుకుంటుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరును ఒక్కోసారి రెండు, మరోసారి ఏడో నంబరులో పొందు పర్చుతున్నారన్నారు. ప్రోటోకాల్ నిబంధనలపై తరచూ మాట్లాడుతున్న రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శిలాఫలకంలో మూడో చోట స్థానే ఆరో చోట ఉంచిన విషయంపై ఆ పార్టీ నేతలు ఏమి సమాధానం చెబుతారన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నెక్కంటి వెంకట్రాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఏడిద మెహెర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
స్కీములు వారికి... కేసులు మాకు
స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి జిల్లాలో లేదు అనపర్తి : బ్రిటిష్ వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజించు–పాలించు దుర్నీతిని అనుసరించి పాలన చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. అనపర్తిలో వైస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితిలు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పచ్చ చొక్కాల వారికి అందజేస్తూ, వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే స్వేచ్ఛ, హక్కు ఉందన్నారు. ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులను అణచి వేసేందుకు అధికారపార్టీ నాయకులు కుట్ర సాగుతోందన్నారు. అప్పటికే ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సెక్షన్ 30 అమలు చేయటంతో సామాన్యులు ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రను సైతం చంద్రబాబు సర్కారు రాజకీయం చేస్తూ, అమాయకులపై కేసులు నమోదు చేయడం తగదని, దీనికి చంద్రబాబునాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవ రత్నాలు స్కీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతి భ్రమించిందన్నారు. ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న ఆయన నిరసన కార్యక్రమాలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న నిరంకుశ పాలనను గుర్తెరిగిన ప్రజలు తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మండల స్ధాయి నేతలను, నాయకులను, కార్యకర్తలను గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న నియోజకవర్గ పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యదర్శి చిర్ల వీర్రాఘవరెడ్డి, కాపు నేతలు అడబాల వెంకటేశ్వరరావు, యక్కలదేవి శ్రీను, ర్యాలి కృష్ణ, కేదారి రంగారావు, చింతా భాస్కరరామారావు, కేదారి బాబూరావు, గొల్లు హేమసురేష్, పడాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ మరణాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జాతీయ రహదారిపై రాస్తారోకో, ర్యాలీ రావులపాలెం(కొత్తపేట) : ఏజెన్సీ ఏరియాలో 16 మంది గిరిజనులు విషజ్వరాలు, వాంతులతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఈ మరణాలకు సమాధానం చెప్పాల్సింది సీఎం చంద్రబాబు నాయుడే నని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏజన్సీ ఏరియాలో మరణాల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిని వ్యతిరేకిస్తూ సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదహారో నంబర్ జాతీయ రహదారిపై రావులపాలెం కళా వెంకట్రావు సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇంత మంది మృత్యువాత పడినా ప్రభుత్వం కంటి కనిపించకుండా గుడ్డిగా ఉందని కళ్లకు గంతలు కట్టుకుని జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం గద్దె దిగాలని ఈ మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. అలాగే స్థానిక సెంటరులో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఏజన్సీలో ఇంత మంది మరణిస్తే ఇటీవల కాలంలో రెండు సార్లు జిల్లాకు వచ్చిన చంద్రబాబు కనీసం ఏజన్సీ వైపు కన్నెత్తి చూడలేదన్నారు. మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తే సరిపోతుందన్న తీరుగా వ్యవహరించడం దారుణం అన్నారు. వెంటనే ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. సంబంధిత మంత్రి అధికారులు మొద్దునిద్ర పోతున్నారని, వారు ఈ ప్రాంతాన్ని సందర్శించాలన్నారు. గత కలెక్టర్ ఆ ప్రాంతంపై సక్రమంగా పని చేయాలేదని, వైద్య ఆరోగ్యశాఖ మొద్దు నిద్రపోతూ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుందన్నారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను పంపి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరు నెలల కిత్రం ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులను సమీక్షించారని, ఆ ప్రాంతంలో ఏడు స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచిందని ప్రభుత్వం ఈ విధంగా వ్యవహిరస్తుందని జగ్గిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, ఎంపీటీసీ బొక్కా ప్రసాద్, కె.రామకృష్ణ, కముజు సత్యనారాయణ, తోరాటి లక్ష్మణరావు, యనమదల నాగేశ్వరరావు, ఆనెం వెంకన్న, దియ్యన పెదకాపు, తోటకూర సత్యనారాయణ, పమ్మి చంటి తదితరులు పాల్గొన్నారు. -
ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు అప్రజాస్వామికం
ఓటుకు నోటు వీడియో టేపుల ఆధారంతో చంద్రబాబును బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం(కొత్తపేట) : సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశారనే నెపంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించడం అప్రజాస్వామికమని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. నిజంగా ఇదే కారణమైతే ఓటుకు నోటు వ్యవహారంలో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయనను కొత్తపేట నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ నాయకులు కలిశారు. వారి ఆవేదనను జగ్గిరెడ్డికి వినిపించారు. దీనిపై ఎమ్మెల్యే మట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో బ్రాహ్మణులను ఎంతగానో గౌరవించే సంస్కృతి ఉందన్నారు. నాడు కళా వెంకట్రావు, భాను తిలకం వంటి బ్రాహ్మణ నాయకులను ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బ్రాహ్మణులను కించపర్చేలా ఉందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో జన్మభూమి కమిటీ ప్రమేయం ఉండకూడదన్న ఐవైఆర్ సూచనలు నచ్చక దానిని పచ్చచొక్కా కార్పొరేషన్‌గా మార్చేందుకే ఆయనను తొలగించారన్నారు. కులాలతో ఆడుకోవడం చంద్రబాబు మానుకోవాలన్నారు. తెలంగాణాలో ఉన్న వారిని ఇక్కడి చైర్మన్‌గా చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు బ్రాహ్మణులను బహిరంగ క్షమాపణ కోరి తప్పును సరి చేసుకోవాలన్నారు. అనంతరం స్థానిక జాతీయ రహదారి చెంతన ఉన్న మాజీ మంత్రి కళావెంకట్రావు విగ్రహానికి బ్రహ్మణ సంఘ నాయకులతో కలసి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య, బ్రాహ్మణ సంఘ నాయకుల చావలి సుబ్బరాయశాస్త్రి, దొంతికుర్తి సాంబమూర్తి, భమిడిపాటి లక్ష్మీనారాయణ, రాణి శర్మ, ఎం.సుబ్బారావు, రాణి రమేష్, ద్రోణంరాజు రంగమన్నాల్, ఎం.కుమార్‌రాజా గోటేటి మార్కండేయులు, కంభంపాటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
ఖరీఫ్ ఆకుమడులకు సాగునీరు
ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆదేశం ఆత్రేయపురం (కొత్తపేట) : పేరవరం పంపింగ్ స్కీమ్ పునర్నిర్మాణ పనులను ఈ నెల 14లోగా పూర్తిచేసి ఖరీఫ్ ఆకుమడులకు సాగునీరు అందజేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని పేరవరం పంపింగ్ స్కీమ్, వాడపల్లి నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. 2004లో అప్పటి జేసీ ఉదయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ పంపింగ్ స్కీమ్ పాత మోటార్లకు మరమ్మతులు చేశారని, తిరిగి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పంపింగ్ స్కీమ్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించినట్టు వివరించారు. నూతన అసెంబ్లీలో సైతం ఈ విషయంపై ప్రస్తావించామని గుర్తు చేశారు. ఈలోగా కొందరు అధికార పార్టీ నేతలు సీఎం చంద్రబాబుకు నిధుల మంజూరుపై కృతజ్ఞతలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిం చిందన్నారు. 16 గంటల విద్యుత్ కోసం... వసంతవాడ, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలకు 16 గంటలు విద్యుత్ సరఫరా విషయాన్ని రైతుల తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు జగ్గిరెడ్డి చెప్పారు. వాడపల్లి వద్ద రూ1.98 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపతికన పూర్తి చేయాల్సిందిగా అదేశించారు. ఈ ప్రాంతంలో అరటి గెలలు సైకిళ్లతో వచ్చే రైతుల కోసం సర్వీస్ రోడ్డును వంతెన సమీపంలో ఏర్పాటు చేయాలని డీఈ శ్రీనివాస్‌కు సూచించారు. కొందరు నాయకులు ఉనికి కాపాడుకోవడానికి, కమీషన్ల కోసం ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆలమూరు మండలం బడుగువానిలంకలో రైతుల కోసం ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ వద్ద పోరాడి రైతుల సమస్యలు పరిష్కరించామన్నారు. రావులపాలెం పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీనివాస్, ఏఈలు శ్రీనివాస్, రాజమౌళి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్లు కనుమూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీనివాస్, రైతు విభాగం రాష్ట్ర సభ్యులు చిలువూరి నాగరామసత్యనారాయణరాజు (బాబిరాజు), చిలువూరి దుర్గరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లి శ్యామ్సన్, సర్పంచ్ కోమలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ చిలువూరి చిన వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టం పట్టకుండా నవ నిర్మాణ దీక్షలా?
- ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట: అర్ధాంతరంగా వచ్చిన సుడిగాలి, వానతో వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమై రైతులు నష్టపోతే వారిని పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు నవ నిర్మాణ దీక్షలకు పరిమితమవుతారా?అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వచ్చిన గాలివానకు నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమయ్యాయి. మంగళవారం జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వాడపాలెం, వానపల్లి లంక ప్రాంతాల్లో పర్యటించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చారా? నష్టాన్ని అంచనా వేశారా?అని జగ్గిరెడ్డి రైతులను ప్రశ్నించారు. ఇంతవరకూ ఎవరూ రాలేదని తెలపడంతో ఆయన అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్‌కు ఫోన్ చేసి అధికారుల తీరును వివరిస్తూ వెంటనే పంట నష్టాలు నమోదు చేసి పంపిస్తే కనీసం ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉందన్నారు. ఐదు రోజులుగా అధికారులను నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. పంట నష్టాలపై జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని, అవసరమైతే వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. జగ్గిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి , జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, మండల సేవాదళ్ కన్వీనర్ గూడపాటి ప్రవీణ్‌కుమార్, వాడపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు గనిశెట్టి శేఖర్, పార్టీ రైతు విభాగం నాయకుడు పెదపూడి శ్రీనివాస్ ఉన్నారు. -
పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేయాలి
– కలెక్టర్‌కు విన్నవించిన జక్కంపూడి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సాక్షి, రాజమహేంద్రవరం: పుష్కర ఎత్తిపోతలు, సత్యసాయి తాగునీటి పథకం, పోలవరం ఎడవ కాలువలో ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోతున్నారని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రను కలిశారు. అవార్డు నోటీసులు రైతుల ఇంటికి వెళ్లి ఇవ్వకుండా వారి పోలాలల్లోని రాళ్లకు, స్తంభాలకు అంటించడం దారుణమన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని అడిగిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించడం సరికాదన్నారు. రైతుల భూములు తీసుకుని తిరిగి వారిపైనే కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కేసుల ఎత్తివేతపై సానుకూల దృక్ఫథంతో ఆలోచించాలని కోరారు. వారి వెంట వామపక్ష నేతల అరుణ్, నల్లా రామారావు, వైఎస్సార్సీపీ నేతలు మేడపాటి షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరి, కోడికోట తదితరులు ఉన్నారు. -
పన్నుల పేరిట దోపిడీ
టీడీపీ పాలనలో సామాన్యులపై ఇంటి పన్నుల పెనుభారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం రావులపాలెంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా రావులపాలెం (కొత్తపేట) : కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం నేడు పన్నుల పేరుతో ప్రజల ను దోచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలో ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ శనివారం రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. స్థానిక కళావెంకట్రావు సెంటర్ నుంచి జాతీయ రహదారిపై రావులపాడు జంక్షన్ వరకూ తిరిగి అక్కడ నుంచి పంచాయతీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. కళావెంకట్రావు సెంటరులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి పెంచిన పన్నులు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంక్షేమం, కుమారుడు లోకేష్ సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఎద్దేవా చేశా రు. ఇంటి పన్నులు 200 నుంచి 300 శాతం పెంచడమే కాకుండా నీటి, డ్రైనేజీ, లైటింగ్ పన్నులు అంటూ ప్రజలకు తెలియకుండానే వారిపై భారం మోపుతున్నారన్నారు. పింఛన్ సొమ్మును సైతం ఇంటి పన్నుగా మినహాయించుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. మూడేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించని ప్రభుత్వం ఇంటి పన్నులు మాత్రం భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ఇంటి పన్నులు తగ్గించేంత వరకూ వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తప్పుడు కేసులు పెట్టాలని చూసినా భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అయితే టీడీపీ ప్రభుత్వం 144 , సెక్షన్ 30 అంటూ ప్రజల హక్కులను కాలరాస్తోందన్నారు. అనంతరం పంచా యతీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. పన్నుల తగ్గించాలంటూ కార్యదర్శి దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనకు సీపీఐ మండల కార్యదర్శి కర్రి రామిరెడ్డి మద్దతు పలికారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, కనుమూరి శ్రీనివాసరాజు, ముత్యాల వీరభద్రరావు, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ద్వారంపూడి సుధాకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం (కొత్తపేట) : నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఆత్రేయపురంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం డైరెక్టర్ చిలువూరి బాబిరాజు స్వగహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా నష్టం కలిగిస్తోందన్నారు. ఆలమూరు మండల సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని మండపేటకు , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కపిలేశ్వరపురానికి తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విషయంలో కూలీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే విషయం ఒక్కటీ, అధికారులకు చెప్పేది మరొకటి అవుతుందన్నారు. ర్యాంపులో పక్కన పెట్టిన డబ్బును కూలీలకు పంచాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణం , పింఛన్లు , రుణాలు పంపిణీలో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. పంచాయతీల్లో పన్నులు అడ్డుగోలుగా పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో రైతులకు మోటార్లకు ఆయిల్ అందించాల్సి ఉందని అలా అందించకుండా ఈ సొమ్మును పచ్చచొక్కాల సెలక్షన్ కమిటీలు పంచుకుంటున్నాయని విమర్శించారు. గత శాసన సభలో ఇరిగేషన్ మంత్రి దృష్టికి తెచ్చి పేరవరం ఎత్తిపోతల పథకం ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించగా పనులు నత్తనడకన నడుస్తున్నాయని వాపోయారు. ఉచ్చిలి పంపింగ్ మోటార్లు సైతం పనిచేయడం లేదన్నారు. సభలో సమస్యలు చర్చించడానికి సమయం ఇవ్వాలని కోరితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను సస్పెస్షన్ చేసి నోరు నొక్కేయడం దారణమన్నారు. అమరావతిలో నూతన అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు ప్రారంభానికి వైఎస్సార్సీపీ సభ్యులను కనీసం ఆహ్వానించకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాదిరిగా ప్రారంభించుకోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా తప్పించుకున్నట్టు తెలిపారు. రైతాంగానికి నీరు అందించకుండా వేరే చోటకు తరలించడం ప్రజల క్షేమం దృష్ట్యా మంచిది కాదని సభలో ప్రస్తావించనున్నట్టు తెలిపారు. అనంతరం స్దానిక వైఎస్సార్సీపీనేత దండు సుబ్బరాజు స్వగృహంలో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి కర్రినాగిరెడ్డి, ఉప సర్పంచ్ చిలువూరి చిన వెంకట్రాజు పాల్గొన్నారు. -
ఉచిత ఇసుకతో వ్యాపారం చేస్తారా ?
ఇసుక ర్యాంపులు నిలిపే అధికారం ఎవరిచ్చారు? నేను ర్యాంపు తెరిపిస్తే అమాయక కూలీలపై అక్రమ కేసులా? దమ్ముంటే నాపై పెట్టండి బేషరతుగా లొంగిపోతా అధికారుల తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం కొత్తపేట : ఓ వైపు సీఎం ఇసుక ఉచితం అని హామీ ఇస్తే మరో వైపు అధికారులు ఆ హామీని గాలికొదిలేసి అధికార పార్టీతో కుమ్మక్కై వ్యాపారం చేస్తారా? అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును మూసివేయగా జట్టు కూలీల ఫిర్యాదుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ర్యాంపు తెరిపించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి వీఆర్వో ఫిర్యాదు మేరకు ఐదుగురు కూలీలపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యపై జగ్గిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం సాయంత్రం కొత్తపేటలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జట్టు మేస్త్రీ కూడా కాని అధికార పార్టీ దళారికి కొమ్ము కాసి సుమారు 500 మంది కూలీలు కడుపు మాడ్చితే వారి ఆవేదన మేరకు తాను స్వయంగా వెళ్లి అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి ర్యాంపు గేటు తీశానన్నారు. దానిని జీర్ణించుకోలేక సామాన్య కూలీలపై కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.15 రోజుల్లో ఆ ర్యాంపులో «బాట నిర్వహణ సొమ్ము పేరుతో దళారి ద్వారా తహసీల్దార్ రూ.లక్షలు వెనకేసుకున్నారని ఆరోపించారు.ఈ రోజు కూలీలందరూ కలిసి దానిని ప్రశ్నిస్తే..సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ర్యాంపు మూసివేశారు. ఆ వ్యక్తులపైనే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ‘అసలు ర్యాంపు మూసేసే అధికారం ఆయనకెక్కడిది? ఉచిత ఇసుకకు తాళాలేమిటి? దళారిని పెట్టి కూలీల కష్టార్జితాన్ని దోచుకోవడమేమిటి? తాళం తీసింది నేను..దమ్ము ధైర్యం వుంటే నాపై కేసులు పెట్టండి? భేషరతుగా లొంగిపోవడానికి సిద్ధంగా వున్నానంటూ’ సవాల్ విసిరారు. ర్యాంపు తీయకపోయినా.. అక్రమ కేసులు తొలగించకపోయినా, సమగ్ర విచారణ జరపాలి. లేకుంటే రెవెన్యూ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. గతంలో ఈ తహసీల్దార్ అనధికార ఫైర్ లైసెన్స్‌ల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని దానిపై చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దళారులతో కలిసి అవినీతికి అడ్డాగా మారారని తహశీల్దార్ తీరుపై జగ్గిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.బాటా పేరుతో వసూలు చేసిన సొమ్ము కూలీలందరికీ చెందాలని, ఆ సొమ్ముకు లెక్కలు చెప్పాలని తహసీల్దార్‌ను జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు బండారు కృష్ణమూర్తి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణమూర్తి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పేపకాయల బ్రహ్మానందం, మండల న్యాయ విభాగం కన్వీనర్ చావలి సుబ్బరాయశాస్త్రి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాకే నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ విభాగం సభ్యుడు కొంబత్తుల రామారావు, పార్టీ వివిధ విభాగాల నాయకులు దంగేటి సుబ్రహ్మణ్యం(డీఎస్), సలాది బ్రహ్మాజీ, యర్రంశెట్టి నాయుడు, ధర్నాల వెంకటేశ్వరరావు, మహ్మద్ హరుణ్ పాల్గొన్నారు. -
కూలీల పొట్ట కొడతారా?
తహసీల్దార్ తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసహనం మందపల్లి ఇసుక ర్యాంపు నిలిపివేతపై ఆగ్రహం ర్యాంపు గేటు తాళం తొలగించిన జగ్గిరెడ్డి మందపల్లి(కొత్తపేట) : ఇసుక ర్యాంపుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 500 మంది జట్టు కూలీల కష్టార్జితాన్ని దోచుకుంటున్న దళారులకు కొమ్ముకాస్తారా? అందుకు ర్యాంపును మూసేసి కూలీల పొట్ట కొడతారా? అధికారులుగా మీరు తీసుకునే నిర్ణయం సరైనదా? అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తహసీల్దార్ ఎన్.శ్రీధర్‌ను ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును ఈ నెల 2న తెరిచారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇసుక ఎగుమతి, బాట నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని ఇసుక ఎగుమతి చేయాలని అధికారులు జట్టు సంఘాలకు సూచించారు. 12 జట్టు కూలీ సంఘాలకు చెందిన సుమారు 500 మంది కూలీలు ఇసుక ఎగుమతులు చేస్తున్నారు. ఇదిలా వుండగా బాట నిర్వహణ పేరుతో వసూలు చేస్తున్న సొమ్మును జట్టు మేస్త్రీ కూడా కాని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ర్యాంపును నిర్వహిస్తూ మిగిలిన సొమ్మును పంచకుండా తన గుప్పెట్లో పెట్టుకుని లెక్కలు చెప్పడం లేదని కూలీల ఆరోపణ. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తికి వ్యతిరేక వర్గాల కూలీలందరూ బాట నిర్వహణ బాధ్యత నెలలో 15 రోజులు తాము చేపడతామని అధికారులను కోరారు. దానిపై ఈ నెల 18 న తహసీల్దార్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇసుక కమిటీ.. జట్టు సంఘాల మేస్త్రీలతో చర్చించారు. బాట నిర్వహణ సొమ్ము వీఆర్వో వసూలు చేసి అధికారుల జాయింట్ అకౌంట్లో జమ చేయగా బాటకు ఎంత ఖర్చు అవుతుందో అంత డ్రా చేసి ఇస్తామని శ్రీధర్ తెలిపారు. సోమవారం ర్యాంపు గేటు తెరవకపోవడంతో కూలీలు వీఆర్వోను ఆరా తీయగా జాయింట్ అకౌంట్ పని పూర్తి కాలేదని , అందువల్ల తహసీల్దార్ ర్యాంపు తెరవద్దన్నారని తెలిపారు. దాంతో జట్టు సంఘాల సభ్యులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన మందపల్లి ర్యాంపుకు చేరుకోగా మేస్త్రీలు కుంపట్ల వెంకన్న,వి లక్ష్మణస్వామి, నేరేడుమిల్లి మందేశ్వరరావు, బద్దా ఏసు, యార్లగడ్డ గణేష్, నక్కా సత్యనారాయణ తదితరులు ర్యాంపులో జరుగుతున్న తీరును, తహసీల్దార్ ప్రతిపాదనపై విముఖత, ర్యాంపు మూసివేత తదితర అంశాలను ఏకరువుపెట్టారు.జగ్గిరెడ్డి తహసీల్దార్‌కు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. ఏ విషయమైనా చర్చించడానికి ర్యాంపు మూసేయాలా? కూలీలను ఖాళీగా కూర్చోపెట్టి కడుపు మాడ్చాలా? ఇది సరైన నిర్ణయం కాదు. వెంటనే గేటు తెరిపించండి అంటూ ఆదేశించారు. కొంత సేపటికి వీఆర్వో ర్యాంపునకు రాగా గేటు తాళం ఏది? అని ఆరా తీస్తే ఒకటి పోలీస్ వద్ద, మరొకటి జట్టు సంఘం మేస్త్రి కాని వ్యక్తి వద్ద వుందన్నారు. దాంతో పోలీసు అధికారులతో సంప్రదించి జగ్గిరెడ్డి తాళం తొలగించి గేటు తెరిచారు. కూలీలంతా ఒక్కమాటపై నిలవాలి కూలీలందరూ ఒక్క మాటపై నిలబడాలని జగ్గిరెడ్డి అన్నారు. లేకుంటే అధికారులకు లోకువ. దాన్ని ఆసరాగా తీసుకుని ఇలాగే పొట్ట కొడతారు అని అన్నారు. దళారులకు అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వసూలు చేసే మొత్తం మీకే దక్కాలని అన్నారు. అధికారులు దళారులకు సహకరించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీకు ఏకష్టమొచ్చినా అందుబాటులో వుంటానని జగ్గిరెడ్డి కూలీలకు భరోసా ఇచ్చారు. జగ్గిరెడ్డి వెంట రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సాదు చెంచయ్య, గ్రామ పార్టీ నాయకులు తోరాటి గణేష్,చింతం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ర్యాంపు మూసివేతపై తహసీల్దార్ శ్రీధర్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటున్నామన్నారు.బాట నిర్వహణ సొమ్ము జాయింట్ అకౌంట్లో జమచేసి ఖర్చు చేయడం రాజమండ్రి డివిజన్లో అమలు జరుగుతుందని, ఆ విషయం చర్చించేందుకు ర్యాంపు మూసి చేసి మేస్త్రీలను రమ్మని కబురు పంపితే వారు రాలేదని అన్నారు. -
ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తారా?
జన్మభూమి సభలో అధికార పక్షాన్ని నిలదీసిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తెలుగుదేశం నేతల తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ కొత్తపేట : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రజల పక్షాన అధికారులను ప్రశ్నిస్తే మా నోరు నొక్కేస్తారా? ఇది ప్రజల సభా.. లేక తెలుగుదేశం పార్టీ సభా? ఏమిటీ వివక్ష? ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరు.. కనీసం మాట్లాడే హక్కు కూడా లేదా? ఇది ప్రజాస్వామ్యమేనా? లేక నియంతృత్వ పాలనా? అర్ధం కావడంలేదు.అంటూ కొత్తపేట జన్మభూమి గ్రామసభలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మిద్దే అనూరాధ అధ్యక్షతన జరిగిన గ్రామసభ వేదికపై స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కంఠంశెట్టి శ్రీనివాసరావు తదితర టీడీపీ నాయకులు ఆశీనులై వున్నారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హాజరు కాగా ఆయనను సర్పంచ్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఆయన వేదికను పరిశీలించి వైఎస్సార్సీపీ నాయకులను కూడా ఆహ్వానించాలని జగ్గిరెడ్డి సూచించారు. దానికి జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ అభ్యంతరం చెప్పడంతో మీరు ప్రొటోకాల్ ప్రకారమే పిలిచారా? అయితే నేనూ కిందే కూర్చుంటాను అంటూ జగ్గిరెడ్డి వేదిక నుంచి దిగి ప్రజల మధ్య కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేష¯ŒS కార్డులు,పక్కా గృహాలు, పింఛన్ల మంజూరుపై ఆయా శాఖల అధికారులను నిలదీశారు. మాట్లాడితే రూ 16 వేల కోట్ల లోటు బడ్జెట్ అంటారు. సీఎం ఇల్లు వాస్తు మార్పునకు రూ.100 కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం పార్టీ రహితంగా ప్రతి ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు, పక్క తెలంగాణా ప్రభుత్వం ప్రతీ ఎమ్మెల్యేకు రూ.3 కోట్లు ఇస్తుండగా ఇక్కడ ఏపీలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో గేదెలను కొన్నట్టు కొంటున్నారని, వారి ప్రలోభాలకు లొంగని ఎమ్మెల్యేలపై ఓడిపోయిన నాయకులకు నిధులు ఇస్తున్నారని విమర్శించారు. నైతిక విలువలు వున్న వాడిని కాబట్టే మీ అధికారానికి నేను అమ్ముడుపోలేదన్నారు. అడక్కుండా ఉండడం వల్లే ఇక్కడ మీ ఆటలు సాగుతున్నాయన్నారు. ప్రజా తీర్పును గుర్తెరిగి ఎవరి స్థానం ఎక్కడో గ్రహించాలని హితవు పలికారు. అధికార మదంతో వ్యవహరిస్తున్నారనడంతో పలు మార్లు మైక్ కట్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం మీ సాంప్రదాయమా అని, భవిష్యత్‌లో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. దానిపై దర్నాల రామకృష్ణ సహా టీడీపీ నాయకులు ఎమ్మెల్యే చిర్ల ప్రసంగానికి అడ్డుతగలడంతో వైఎస్సార్సీపీ నాయకులు వేదిక వద్దకు వచ్చారు. దానితో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాటతో రసాభాసగా మారింది. రావులపాలెం సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో అప్పటికే మోహరించిన పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను విడదీశారు. టీడీపీ నాయకుల తీరును నిరసిస్తూ జగ్గిరెడ్డి సభను బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గతంలో నీరు–చెట్టు పథకం కింద తీసిన మట్టిని తమ సొంత స్థలాలకు ఉపయోగించుకున్నారని, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాల్పడుతున్న అవినీతిని ప్రశ్నిస్తానని మైక్ ఆఫ్ చేసి నోరు నొక్కే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
ముందుచూపు లేక ఇబ్బందులు
పెద్దనోట్ల రద్దుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సీఎం చంద్రబాబు లేఖలు ఇచ్చినప్పుడల్లా అరిష్టమే కొత్తపేట : కేంద్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో నియోజకవర్గంలో మంగళవారం పలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్న పేద,సామాన్య ప్రజానీకానికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కొత్తపేట ఆంధ్రాబ్యాంకు వద్ధ జగ్గిరెడ్డి స్వయంగా ప్రజలకు మజ్జిగ అందచేశారు.ఈ సందర్బంగా ఆయన బీఎం బీహెచ్ రవిశంకర్‌తో బ్రాంచ్‌కు నగదు సరఫరా, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.రైతులకు ఎంత ఇవ్వాలి?పెళ్లిళ్లు చేసుకుంటే ఎంత ఇవ్వాలి? ప్రభుత్వ పెన్షనర్‌కు రూ.10 వేలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మీరు ఎంత ఇస్తున్నారు? అంటూ బీఎంను ప్రశ్నించారు. రైతుకు రూ.50వేలు, పెళ్లికి రూ 2.5 లక్షలు ఇవ్వాలని చెప్పిన మాట మాట వాస్తవమే కానీ ఇక్కడ నగదు వుండాలి కదా సార్. ఆంధ్రాబ్యాంక్‌కు సంబంధించి జిల్లాకు కేవలం రెండు చెస్ట్లే వున్నాయి. వచ్చిన నగదును వచ్చినట్టుగా పంపిణీ చేస్తున్నాం అంటూ బీఎం సమాధానం చెప్పారు. బాబూ.. లేఖలు రాయొద్దు జగ్గిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు లేఖలు (రాష్ట్ర విభజనకు, పెద్ద నోట్ల రద్దుకు) ఇచ్చినప్పుడల్లా రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి ఇకపై ఎప్పుడూ లేఖలు రాయవద్దని జగ్గిరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజా సమస్యలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణ శూన్యమన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు, బ్యాంకర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, మండల పార్టీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ విస్మరించడం దారుణం
ఆత్రేయపురం : స్థానిక ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులకు కనీస సమాచారం లేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పిచ్చుకలంక ప్రాంతాన్ని సందర్శించి ప్రొటోకాల్ విస్మరించారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక మం డల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొటోకాల్ విస్మరణపై, ఆయా శాఖల అధికారుల తీరుతెన్నులపై ప్రివిలేజ్ కమిటీకీ ఫిర్యాదు చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తనకు సమాచారం ఇవ్వకండా నియోజకవర్గ పరిధిలోని పిచ్చుకలంక పర్యటక కేంద్రాన్ని అధికారికంగా పరిశీలించడం ఎంతవరకు సమంజసమన్నారు. పిచ్చుక లంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు తన తండ్రి సోమసుందరరెడ్డి హయాంలో అప్పటి పర్యాటక మంత్రి గీతారెడ్డిని తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. బొబ్బర్లంక గ్రామంలో జిరాయితీ భూములు లేక గ్రామస్తులు జీవనోపాధి నిమిత్తం తరతరాలుగా రొయ్యి సీడ్ ద్వారా జీవనం సాగిస్తున్నారని ఇరిగేషన్ అధికారులు వారిని వేధించడం తగదన్నారు. పిచ్చుకలంకను ఆనుకుని ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న రైతులను అధికారులు ఖాళీ చేయమనడం దారుణమన్నారు. -
ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యసేవలందించాలి
రావులపాలెం: డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యసేవలందించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని దేవరపల్లి, రావులపాలెం, నార్కెడిమిల్లి, వానపల్లి తదితర గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలడంతో బాధితులు పలువురు రాజమహేంద్రవరంలోని వివిధ ప్రవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని ఆదివారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆయా ఆస్పత్రుల్లో పరామర్శించారు. వారిS ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచిం చారు. రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిని ఆయన పరామర్శించారు. అనంతరం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి డెంగీ కేసులు నమోదు కాలేదని చెబుతున్న వైద్యులకు ఇంత మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నప్పటికీ విషయం తెలియడం లేదా అని ప్రశ్నించారు. గోపాలపురం, ఊబలంక, ర్యాలి, ఆత్రేయపురం, వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో డెంగీ కేసులను గుర్తించలేదని వైద్యులు చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయి ప్రాణాపాయ స్థితిలో చాలా మంది ప్రైవేట్ ఆస్పతుల్లో చేరుతున్నారన్నారు. ఒక్కొక్కరికీ సుమారు రూ.60 వేల వరకూ ఖర్చు అవుతోందన్నారు. బాధితుల్లో అధికశాతం పేద, మధ్యతరగతి వారే కావడంతో వారికి వైద్య ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన పడితే వారు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చోటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు లేఖరాస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం డెంగీ తదితర జ్వరాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యసేవలు ప్రభుత్వాస్పత్రుల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అంతాబాగుందని మంత్రి కామినేని చెబుతున్నారని, ఎవరూ రాకపోతే అంతా బాగానే ఉంటుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జ్వరాల తీవ్రతపై ఆయన ఫోన్లో డీఎంఅండ్హెచ్ఓతో మాట్లాడారు. వెంటనే ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలను అదుపు చేయాలని సూచించారు. అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, అప్పారి విజయకుమార్, సీహెచ్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎంతోకాలం సాగవు : జగ్గిరెడ్డి
కొత్తపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎంతో కాలం సాగవని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగ్గిరెడ్డి తదితర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా అక్కడ ఓడినవారికి నిధులు ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, జిల్లా పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు రాజా, మండల పార్టీ అధ్యక్షుడు ఎం.వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన పోరాడుతాం
రావులపాలెం, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రజలకు భరోసా ఇచ్చారు. సోమవారం రావులపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తపేట నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కుడిపూడి చిట్టబ్బాయి, ఇందుకూరి రామకృష్ణంరాజు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి, తదితర నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలతో అన్ని పార్టీ నాయకులను కలుపుకుని పోటీ చేస్తే ఆ గాలిని తట్టుకుని జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక నాయకుడు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అని గుర్తు చేశారు. జగ్గిరెడ్డి విజయం ప్రజా విజయమన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కూటమి నేతలు చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు గెలిచిన నాయకులతోపాటు స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి చంద్రబాబులా ఆచరణ సాధ్యం కాని రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చేవారమని, కానీ ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పే నైజం తమ నాయకుడిది కాదన్నారు.చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా నిలదీస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో జగ్గిరెడ్డి విజయం పార్టీకి ఆక్సిజన్ వంటిదని పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల సమస్యలపై జగ్గిరెడ్డి పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటారని జిల్లా అధికార ప్రతినిధి మిండగుదిటి మోహన్ పేర్కొన్నారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇది వైఎస్సార్ సీపీ ప్రతి కార్యకర్త గెలుపు అన్నారు. తనకు ఈ విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకోడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు పీకే రావు, గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, ఇండస్ట్రియల్ విభా గం కన్వీనర్ మం తెన రవిరాజు, రావులపాలెం, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యులు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, ముత్యాల వీరభద్రరావు, నాతి అనురాగమయి పాల్గొన్నారు.