తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ సమావేశంలో రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు.