నేమ్‌బోర్డు, కాగితాలను విసురుతున్న రెడ్డి సబ్రహ్మణ్యం (పాతచిత్రం)
సాక్షి, కాకినాడ: గతవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెచ్చిపోయిన విషయం విదితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు.
దీంతో సహనం కోల్పోయిన రెడ్డి సుబ్రహ్మణ్యం.. జగ్గిరెడ్డిని నోటికొచ్చినట్టు తిడుతూ, అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. వాటర్ బాటిళ్లు, నేమ్‌బోర్డు, కాగితాలను విసురుతూ దాడికి దిగారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రెడ్డి సబ్రహ్మణ్యం ఇలా చేయడంపై సభలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ఘాంతపోయారు.
ఈ ఘటనపై బుధవారం రెడ్డి సబ్రహ్మణ్యం స్పందించారు. ‘నేను మనిషినే.. మహాత్ముడిని కాదు. అయినా జెడ్పీ సమావేశంలో సహనం కోల్పోయి బాటిల్ విసిరాను. అది దురదృష్టకరమైన సంఘటన. తొందరపడకుండా ఉంటే బాగుండేది. జడ్జి స్థానంలో ఉన్న నన్ను దొంగ అనడంతో సహనం నశించింది. ఇసుక అవినీతి అరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment