బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఎంతోకాలం సాగవు : జగ్గిరెడ్డి | tdp Blackmail politics says Jaggireddy | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఎంతోకాలం సాగవు : జగ్గిరెడ్డి

Published Sun, Mar 13 2016 1:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:38 PM

tdp Blackmail politics says Jaggireddy

 కొత్తపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఎంతో కాలం సాగవని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని  శనివారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు.  పాత బస్టాండ్ సెంటర్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగ్గిరెడ్డి తదితర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
 
 ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా అక్కడ ఓడినవారికి నిధులు ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, జిల్లా పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు రాజా, మండల పార్టీ అధ్యక్షుడు ఎం.వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement