సబ్‌కలెక్టర్ నిశాంత్‌కుమార్ దంపతులను సన్మానిస్తున్న కలెక్టర్
తిరుపతి సిటీ: ‘సబ్‌కలెక్టర్‌గా నిశాంత్‌కుమార్ గత 14 నెలల్లో ప్రోటోకాల్, భూసేకరణతో పాటు భూ ఆక్రమణలను నిరోధించగలిగారు. ఒత్తిళ్ల మధ్యలో కూడా ప్రజలకు మేలు చేశారు.’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రశంసించారు. సబ్‌కలెక్టర్ నిశాంత్ కుమార్ బదిలీపై వెళుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి ఒక ప్రైవేటు హోటల్‌లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు భూములు తీసుకుంటే సదరు భూమి కోల్పోయే వ్యక్తి జీవనం కూడా మెరుగు పరచడానికి బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. నిషాంత్ చేసిన మంచిపనులకు నిదర్శనంగా సీపీఎంకు చెందిన కందారపు మురళి వంటి నేతలు వీడ్కోలు సభలో పాల్గొనడం విశేషమన్నారు.
అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అనుభవం లేని తాను ఇక్కడ ఎన్నో నేర్చుకున్నానని, కలెక్టర్ సూచనలతోనే ప్రజా సమస్యలను పరిష్కరించగలిగానన్నారు. జాయింట్ కలెక్టర్ గిరీషా మాట్లాడుతూ తక్కువగా మాట్లాడి పనులు చక్కబెట్టేవారని, నిశాంత్ నుంచి ఫైల్ వస్తే చూడకుండా సంతకం చేయవచ్చునని గుర్తు చేశారు. అనంతరం నిశాంత్‌కుమార్ దంపతులను తిరుపతి రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దుశ్శాలువతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏఓ ఝాన్సీ, రేణిగుంట విమానాశ్రయ డైరెక్టర్ పుల్ల, సీఎస్‌ఎఫ్ కమాండెంట్ మనీషా, తహసీల్దార్లు నరసింహులునాయుడు, చంద్రమోహన్, రాజశేఖర్, మునాఫ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment