చంద్రబాబునాయుడు పాలనలో నంద్యాల ప్రజలు ఎంతో నష్టపోయారని, ఆ నష్టాన్ని పూడ్చటం చాలా కష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి రాధాకృష్ణ అన్నారు. నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతినిధి వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలకు రావడం ఇక్కడి ప్రజల్లో ఆశలు చిగురించాయన్నారు. ఎక్కడ చూసినా ఫ్యాన్ గుర్తుకు ఫాలోయింగ్ పెరిగిపోతుంటే.. చంద్రబాబు గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ ఫ్యామిలీపై, జగనన్నపై అభిమానంతో శిల్పామోహన్ రెడ్డి వెంట మేమున్నామంటూ ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. '1988లో నా తండ్రి వంగవీటి మోహనరంగా గారిని పొట్టనపెట్టుకున్న పార్టీ టీడీపీ అని ఆరోపించారు.
Published Thu, Aug 3 2017 5:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement