
కొడాలి నానితో జరిగిన భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు.
గుడివాడ టౌన్: కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావును (నాని) దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆదివారం కలిశారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉన్నాయి.
కొడాలి నానితో జరిగిన భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ (బాబ్జీ), పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి, కొడాలి నాగేశ్వరరావు (చిన్ని), మాజీ కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: టీడీపీకి దెబ్బ పడింది)