డైరెక్టర్ వర్మ, నిర్మాతపై పిటిషన్ దాఖలు
వంగవీటి రాధాకృష్ణ
విజయవాడ లీగల్: దర్శకుడు రామ్‌గోపా ల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, సహ నిర్మాత పి.సుధీర్‌చంద్ర ‘వంగవీటి’ సినిమా ద్వారా తమ కుటుంబానికి పరువు నష్టం కలిగించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం ఒకటవ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జి.వెంకటేశ్వర్లు గతంలో పోలీసులకు ఫిర్యా దు చేసిన కాపీ ప్రతిని దాఖలు చేయాలని కోరుతూ వాయిదా వేశారు. వంగవీటి సోదరులైన రాధా, మోహనరంగారావులపై అసత్య, అబద్ధ కథనాలతో సినిమాను తీసి లక్షలాది వం గవీటి అభిమానుల మనోభా వాలను దెబ్బతీశారని పిటి షన్‌లో పేర్కొన్నారు. రంగా 1981 నుంచి జాతి, కుల, మత రహితంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు.
మేమేమన్నా రౌడీలమా?
అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి తన పెదనాన్న, తండ్రిలను రౌడీలుగా చూపించారని మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ... సినిమా విడుదలకు ముందే తాము అభ్యంతరం తెలిపామన్నారు.