
సాక్షి, డిట్రాయిట్: ప్రముఖ రాజకీయ నేత దివంగత వంగవీటి మోహన్ రంగా 29వ వర్ధంతి సందర్భంగా డిట్రాయిట్‌లో వైఎస్‌ఆర్‌సీపీ డిట్రాయిట్ కమిటీ, అభిమానులు సమావేశమై రంగాకి జోహార్ అంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశం దీపక్ గోపాలం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జితేంద్ర బొండాడ ప్రారంభోన్యాసం చేస్తూ రంగా సేవా నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. అంతేకాక దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రంగాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వారు గుర్తు చేశారు. నేడు పేదల పెన్నిధిగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.
మరి కొంతమంది రంగాతో వారి పరిచయానుభవాలను పంచుకున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరు రంగా అడుగుజాడలలో నడవాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్ మందుటి, చెంచు రెడ్డి తాడి, దేవానాథ్ గోపిరెడ్డి, శ్రీకాంత్ గాయం, రవి నర్సింహారెడ్డి, లలిత్ కుమార్ వడ్లమూడి, ప్రసాద్ బేతంచెర్ల, వెంకట్ ఎనుముల, ధీరజ్ పులిగడ్డ, నరేష్ పూల, మురళి సుంకర, సుధీర్ బస్సు, సుధాకర్ తోట, పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment