
కృష్ణా జిల్లా: వంగవీటి రంగాని చంపింది టీడీపీ ప్రభుత్వమేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..రంగా బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగటానికి వచ్చిన వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. నిరాహార దీక్ష చేస్తున్న రంగాని హతమార్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రంగా మహోన్నత వ్యక్తి అని, ఆయన అడుగుజాడల్లో నడవటం వల్లే తాను ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని తెలిపారు. రంగాకి ద్రోహం చేసింది తెలుగుదేశం నాయకులేనని ఆరోపించారు. రంగా పేదల మనిషని, ప్రజలకు మేలు చేసే నాయకత్వం వహించే లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి రంగన్న అని కొనియాడారు.
వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా రాధారంగా మిత్రమండలి, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అవనిగడ్డలో 10 స్కూళ్లలో 500 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాం ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గంలోని ఆకులమన్నాడు, ముంజులూరు, చెరుకుమిల్లి గ్రామాల్లో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment