తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్‌ | CM Chandrababu Naidu serious on ravi venkateswara rao, annam satish | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్‌

Published Sat, Jan 7 2017 1:53 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్‌

తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్‌

విజయవాడ: తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోవడంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు. గుడివాడ ఆఫీసర్స్‌ క్లబ్‌లో రావి వెంకటేశ్వరరావు రివాల్వర్‌తో హల్‌ చల్‌ చేయడం, బాపట్ల బీచ్‌లో ఎ‍మ్మెల్సీ అన్నం సతీశ్‌ ..హరిత రిసార్ట్స్‌ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ రెండు సంఘటనలపై వివరణ ఇవ్వాలని రావి వెంకటేశ్వరరావు, అన్నం సతీశ్‌లో చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

చదవండి...(రివాల్వర్‌ అప్పగించిన టీడీపీ నేత)

అధ్యక్షుడి ఆదేశాలతో రావి వెంకటేశ్వరరావు శనివారం హుటాహుటీన సీఎం నివాసానికి వచ్చారు. గుడివాడ  కాల్పుల ఘటనపై చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. మరోవైపు బాపట్ల బీచ్‌ ఘటనపై ఎమ్మెల్సీ అన్నం సతీశ్‌...సీఎంకు ఫోన్‌ కాల్‌ చేశారు. ప్రస్తుతం దూరంగా ఉన్నందున తర్వాత వచ్చి కలుస్తానంటూ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

(బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్‌ వీరంగం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement