గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్‌ | Tdp And Janasena Overaction In Gudivada | Sakshi
Sakshi News home page

గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్‌

Published Thu, Jan 18 2024 1:37 PM | Last Updated on Fri, Feb 2 2024 8:14 PM

Tdp And Janasena Overaction In Gudivada - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల ఓవరాక్షన్‌ ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుకు అడ్డంగా బైక్‌లను నిలిపిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా రెచ్చగొట్టే చర్యలకు టీడీపీ పాల్పడింది.

కాగా, గుడివాడ రాజకీయం హీటెక్కింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్‌ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్‌లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే..  దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement