Gudivada Assembly Constituency
-
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: గుడివాడ కూటమి రాజకీయాల్లో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెండా దిమ్మపై దాడి ఘటనతో గత అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ - జనసేన కార్యకర్తల బాహాబాహీ కాస్తలో తప్పింది.నాగవరప్పాడు జంక్షన్లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. టీడీపీ వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే.. జనసేన జెండా దిమ్మ పై దాడిని తమ పై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అలాగే.. టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత ధారా నరసింహారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. -
గుడివాడ సీటు గెలుపుపై మేకపోతు గాంభీర్యం!
ఆ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తవ్వగానే పసుపు పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పోలింగ్ సరళి తమకే అనుకూలమని డప్పు కొట్టుకున్నారు. కట్ చేస్తే.. తాజా లెక్కలు చూశాక వారిలో ఆందోళన మొదలైందట. ఏదో అనుకుంటే మరేదో జరిగేలా ఉందనుకుని కలవరపడుతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగు తమ్ముళ్ల టెన్షన్‌కు కారణమేంటి?.. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ టాప్ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకున్న నియోజకవర్గం గుడివాడ. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని శక్తిగా ఉన్న కొడాలి నానిని వైఎస్ఆర్సీపీ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవకుండా అడ్డుకోవాలనేది టీడీపీ నాయకత్వం బలమైన కోరిక. ఇందుకోసం రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేసింది. కొడాలి నానిపై పోటీకి పనికొచ్చే నాయకులు గుడివాడలో కనిపించక, చివరికి అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును పోటీలో నిలిపింది. కొడాలి నానిని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేసిన వెనిగండ్ల రాము, టీడీపీ నేతలు పోలింగ్ సరళిని చూసి ఖంగుతిన్నారట. 13వ తేదీన జరిగిన పోలింగ్ లో గుడివాడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతం పెరగడానికి మహిళా ఓటర్లలో చైతన్యం ఎక్కువగా కనిపించడమే ప్రధాన కారణం. మొత్తంగా.. గుడివాడ నియోజకవర్గం అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నందివాడ మండలంలో రెండు కేంద్రాలు, గుడివాడ పట్టణంలోని రెండు కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా లేకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ సరళి..పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూ లైన్లను చూసి బోల్డంత ఊహించుకున్న టీడీపీ నేతల ఆశలపై వారే తయారుచేసుకున్న తాజా లెక్కలు నీళ్లు చల్లాయట. రికార్డ్ స్థాయిలో జరిగిన పోలింగ్ సైకిల్ పార్టీకి అనుకూలంగా లేదని వారిలో వారే చర్చించుకుంటున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా తరలి రావడం తమకే కలిసి వచ్చిందని టీడీపీ నేతలు సంబరపడినప్పటికీ, పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలు వారిని కలవరపెడుతున్నాయని టాక్. భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. మహిళల ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయట. గడచిన మూడు దశాబ్ధాలుగా గుడివాడ నియోజకవర్గంలో జరగని చాలా అభివృద్ధి పనులు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని చేసి చూపించారు. పేదల సొంతింటి కల టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల రూపంలో ప్రజలకు అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకున్న తరుణంలో మరోసారి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.తాజా అంచనాలు భయపెడుతున్నా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తమను కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెప్పుకుంటున్నారట టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. లోలోన టెన్షన్ పడుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ ను చూసే మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గెలుపు లాంఛనమే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న చర్చ ప్రస్తుతం గుడివాడలో జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే -
ఉచ్ఛ నీచాల్లేని వ్యక్తి చంద్రబాబు
గుడివాడ టౌన్: రాజకీయాల్లో ఉచ్ఛం, నీచం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నాని గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన చూపిన మార్గమే తనకు ఆదర్శమని అన్నారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింన ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యుల చేతిలో, అధికార దాహంతో అల్లాడుతున్న ఒక మోసకారి చేతిలో వంచనకు గురై పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనో వేదనతో మృతి చెందారన్నారు. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పాడో, పార్టీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని అధికారంలోకి వచ్చాడో వాడే, ఆ గజదొంగే ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నాడన్నారు. ఇటువంటి నక్కజిత్తుల వేషాలను ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. తెలంగాణలో ప్రజలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారన్నారు. 2024 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైతం టీడీపీని, చంద్రబాబు నాయకత్వాన్ని కనుమరుగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బ్రతికుండగా దుర్మార్గుడని, పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి పదవి నుంచి దింపేసిన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండలెయ్యడం, వర్ధంతులు చేస్తామనడం మోసపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుని రా కదలిరా.. అంటున్న సెంట్రల్ జైలు చంద్రబాబు రా కదలిరా అని జనంలోకి వస్తుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు ఆయన్ని రా కదలిరా.. అని పిలుస్తోందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కన్ను పని చేయడంలేదు, కిడ్నీ పని చేయడంలేదు, ఇంకా ఏదో పని చేయడంలేదు అంటూ జిత్తులమారి నక్కలా తప్పించుకుంటున్న 420 గాడిని రాజమండ్రి సెంట్రల్ జైలు కదలి రమ్మనిపిలుస్తోందని, ఆయన త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. త్వరగా జైలుకు వెళ్లు అని సుప్రీంకోర్టు బాబును ఆదేశించిందన్నారు. ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే ఎన్టీఆర్ వారసులమని కుటుంబ సభ్యులు చెప్పుకుంటుంటే.. ప్రజలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌నే ఆయనకు నిజమైన వారసుడిగా గుర్తిస్తున్నారని నాని చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపు కుటుంబ సభ్యుల నీచమైన బుద్ధిని తెలియజేసిందే తప్ప జూనియర్ ఎన్టీఆర్‌కు జరిగే నష్టం ఏమీలేదన్నారు. తన అల్లుడు పప్పుగాడిని పైకి లేపేందుకు బాలకృష్ణ ఇటువంటి నీచమైన కార్యాలకు తెరలేపారన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు లాంటి వారు వందల మంది వచ్చింనా జూనియర్ ఎన్టీఆర్‌కు ఊడేదేమీలేదన్నారు చంద్రబాబు ఇంతకు ముందు కూడా తనకు డిపాజిట్లు రాకుండా చేస్తానంటూ వీరంగం వేశారని, కానీ తాను నాలుగుసార్లు శాసన సభ్యునిగా గెల్చానని తెలిపారు. గుడివాడలో తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు మారుతున్నారు తప్ప తన గెలుపులో ఏమాత్రం తేడా లేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండటం, ఆయన పాలన కొనసాగడం తనకు ముఖ్యమని, పదవులు ఈకతో సమానమని అన్నారు. ప్రతి పార్టీకీ గెలవాలనే లక్ష్యం ఉంటుందని, గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వడం పార్టీ అధినేత ఆలోచన అని చెప్పారు. ఇవన్నీ సర్వ సాధారణమని, వీటితో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు. 1978లో చంద్రగిరిలో గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఓడిపోలేదా అని ప్రశ్నించారు. ఆయన సీఎం అయ్యాక జరిగిన 5 ఎన్నికల్లో చంద్రగిరిలో ఒక్కసారైనా గెలిచారా అని అన్నారు. గన్నవరంలో గెలిచిన గద్దె రామ్మోహన్‌రావును విజయవాడలో, నందిగామలో గెలిచిన దేవినేని ఉమను మైలవరంలో, కొవ్వూరు నుంచి తెచ్చిన జవహర్‌ను తిరువూరులో బాబు ఎందుకు పోటీ చేయిస్తున్నాడని అన్నారు. బాలయ్య హిందూపూర్‌లో పుట్టాడా? వాడికి కొంపాగోడు ఉందా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నక్కజిత్తుల చంద్రబాబు మాటలు నమ్మరని స్పష్టంచేశారు. -
చంద్రబాబు.. నువ్వెంత నీచుడివో చెబుతూనే ఉంటా : కొడాలి నాని
సాక్షి, గుడివాడ : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం గుడివాడలో జరిగిన చంద్రబాబు సభపై నాని మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు టీడీపీ వర్దంతి సభ నిర్వహించడానికి గుడివాడ వచ్చాడు. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గుడివాడ అభివృద్ధి కోసం ఏం చేశాడు. వైఎస్సార్, జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 275 ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా పేదల కోసం కొనుగోలు చేయలేదు. మంచి నీటి అవసరాల కోసం 216 ఎకరాల్లో చెరువుల కోసం మేం ఏర్పాటు చేశాం. చంద్రబాబుకు ఇదే నా సవాల్. చంద్రబాబు మగాడైతే నా సవాల్ స్వీకరించాలి. పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించాడా. నిరూపిస్తే గుడివాడలో పోటీ నుంచి తప్పుకుంటా. నేను గంజాయి మొక్కని కాదు. గుడివాడ ముద్దు బిడ్డని. టీడీపీ తులసివనంలో చంద్రబాబే గంజాయి మొక్క. చంద్రబాబు సభకు 10 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేశారు. చంద్రబాబువి 420 మాటలు. గుడివాడలో టిడ్కో ఇళ్లు కట్టించింది మేమే. టీడీపీ హయాంలో కేవలం 1200 ఇళ్లకు పునాదులు మాత్రమే వేశారు. జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన బిడ్డకు నీ పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదా. చంద్రబాబు ఎందుకు పుట్టాడో తెలియదు చంద్రబాబువన్నీ అబద్దాలే. చంద్రబాబు ఎన్టీఆర్‌నే గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీఆర్ మంచివాడైతే చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎందుకు తొలగించారు. చంద్రబాబు ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్‌లో కాదా. చంద్రబాబు నా వెంట్రుక ముక్క కూడా పీకలేడు. తిరుపతి బస్టాండ్‌లో జేబులు కొట్టే వెదవలకు నేను భయపడను. చంద్రబాబు ఎంత నీచుడో అందరికీ చెప్తా. చావనైనా చస్తాను కానీ చంద్రబాబు ఉడత ఊపులకు బెదరను మరదల్ని చంపిన 420 చంద్రబాబు. మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చంద్రబాబు చెప్పాలి. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు. చంద్రబాబుకు ఏ కోటాలో పదవి వచ్చింది...నీతుల కోటాలోనా..? కోతల కోటాలోనా..? వెన్నుపోటు కోటానా..? జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుకోవడం కోసం పిచ్చిబాలయ్యను ఉసిగొల్పారు’అని చంద్రబాబుపై నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుకు అడ్డంగా బైక్‌లను నిలిపిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా రెచ్చగొట్టే చర్యలకు టీడీపీ పాల్పడింది. కాగా, గుడివాడ రాజకీయం హీటెక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. -
గుడివాడలో హై అలెర్ట్
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లావాసుల ఆవేదన ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. హీటెక్కిన గుడివాడ రాజకీయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బాబు మాములోడు కాదుగా! చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది.