'మనోభావాలకు దెబ్బతగిలితే రాజీపడేది లేదు' | somireddy chandramohan reddy warns officials | Sakshi
Sakshi News home page

'మనోభావాలకు దెబ్బతగిలితే రాజీపడేది లేదు'

Published Tue, May 26 2015 9:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

'మనోభావాలకు దెబ్బతగిలితే రాజీపడేది లేదు' - Sakshi

'మనోభావాలకు దెబ్బతగిలితే రాజీపడేది లేదు'

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలకు నష్టం జరిగినా.. వేధించినా రాజీపడే ప్రసక్తి లేదు. ఇటీవల పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు ఓ ఆర్డీఓను కలిస్తే పట్టించుకోలేదని తెలిసింది. వెంటనే ఫోన్లో మాట్లాడి ఆ ఆర్డీఓను మందలించాను. అలా ఎవరైనా కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. నెల్లూరులో టీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో ఆయన సప్రసంగించారు.

వైఎస్సార్ సెంటిమెంట్ తుపానులా వీస్తుంటే పార్టీ కోసం.. కార్యకర్తల కోసం నిలబడ్డామని చెప్పారు. ఒక్కటిగా ఉన్న రాష్ట్రం విడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కొంతకాలం గడిచాక తెలంగాణ వారు ఆంధ్రాలో కలవాలని కోరుకునే రోజు వస్తుందని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నెల్లూరు జిల్లాకు వద్దంటున్నా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement