టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ
కొరిటెపాడు(గుంటూరు) : జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ జీవవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా మినీ మహానాడు సోమవారం(నేడు) ఉదయం 9.30 గంటలకు శ్రీ వవేంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రాంభమవుతుందన్నారు. రాష్ట్ర పార్టీ ప్రతినిధుల మహాసభ(మహానాడు)లో ప్రవేశపెట్టబోయే ముసాయిదా తీర్మానాల అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జిల్లాలో మౌలిక వసతుల కల్పన-ప్రధాన సమస్యలపై తగిన విధంగా చర్చించి, అవసరమైన మార్పులు, కూర్పులతో రాష్ట్ర మహాననాడుకు పంపుతామన్నారు. పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, రాయపాటి శ్రీనివాస మద్ధాళి గిరిధర్, బోనబోయిన శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మినీ మహానాడును విజయవంతం చేయాలి
Published Mon, May 25 2015 12:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM