Minister prattipati pullarao
-
సమీక్షల షో
►కస్టమ్ మిల్లింగ్‌లో అక్రమాలపై సర్కారు తీరిది ►రూ.68 కోట్లుబకాయిపడిన 23 మంది మిల్లర్లు ►రెండేళ్లుగా చర్యలు శూన్యం ►మంత్రి మారటంతో మిల్లుల తనిఖీలు, ►కేసుల నమోదుకు ఆదేశాలు నెల్లూరు : ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని దొడ్డిదారిన అమ్మేసుకుని ఖజానాకు తూట్లు పొడిచిన అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. సమీక్షల పేరిట హడావుడి చేస్తూ.. తెరవెనుక నుంచి అక్రమార్కులకు ఆశీస్సులు అందజేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటన సాగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు నియోజకవర్గాలో పర్యటించిన ఆయన రెండుచోట్ల శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. కొన్ని మిల్లులను తనిఖీ చేశారు. కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన బియ్యాన్ని (సీఎంఆర్) అమ్మేసుకున్న మిల్లర్లపై కేసులు నమోదు చేసి నెల రోజుల్లో ఆ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశించారు. ఖజానాకు గండికొడితే ఉపేక్షించేది లేదని ప్రకటించి వెళ్లారు. ప్రతిసారి ఇలాగే ‘షో’ నిర్వహించటం మినహా ఎలాంటి ప్రయోజనం లేకపోతోంది. ఏటా ఇదే తంతు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్న మిల్లర్ల విషయంలో ఏటా ఇదే తంతు నడుస్తోంది. జిల్లాలో 23 మంది మిల్లర్లు సుమారు రూ.68 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. బియ్యాన్ని అమ్మేసుకున్నారు. వారినుంచి సొమ్మును రికవరీ చేసే పేరిట ఏటా నాలుగుసార్లు సమీక్షలు నిర్వహించడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మిల్లర్ల వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఉండటంతో మంత్రి హడావుడి చేసి వెళ్లడం.. ఆనక లాబీయింగ్‌తో చర్యలు నిలుపుదల చేయించుకుని కాలం గడపటం పరిపాటిగా మారింది. నిధుల స్వాహా సాగుతోందిలా జిల్లాలో సుమారు 300 రైస్ మిల్లులు ఉండగా, వాటిలో 250 మిల్లులు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. రెండేళ్ల నుంచి ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు లేకపోవటం, జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండటంతో ఇక్కడి మిల్లర్లు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతోపాటు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం ఐకేపీ కేం ద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం ఆడే నిమిత్తం కస్టమ్ మిల్లింగ్ పేరిట మిల్లర్లకు అప్పగిస్తోంది. బియ్యం ఆడినందుకు వారికి కమీషన్ చెల్లిస్తోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.3.65 కోట్ల విలువైన 17.70 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లర్లు.. ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో దర్జాగా అమ్మేసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.40.90 కోట్ల విలువైన 18,907 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ పేరిట తీసుకున్న మిల్లర్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి 23 మంది మిల్లర్లు వడ్డీలు, జరిమానాలతో కలిపి రూ.68 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మంత్రులు మారినా.. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన పరిటాల సునీత అనేక మార్లు జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ బియ్యాన్ని బొక్కిన మిల్లర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా గురువారం అదే శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో పర్యటించారు. రెండు మిల్లుల్ని సీజ్ చేసి, నెలలోగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. గతంలోనూ కొందరిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా ఎలాంటి పురోగతి లేదు. అధికార పార్టీ నేతలు లాబీయింగ్ నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. కొందరు మిల్లర్ల నుంచి సొమ్ములు దండుకుని వారిపై చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయిస్తున్నారు. మొత్తం మీద మంత్రి పర్యటన పరోక్షంగా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించేందుకు దోహదపడుతుందనే విమర్శ వినిపిస్తోంది. -
‘నయీం’ సినిమా షురూ
-
‘నయీం’ సినిమా షురూ
- అమరావతిలో క్లాప్ కొట్టిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తుళ్లూరు రూరల్ (గుంటూరు): గ్యాంగ్‌స్టర్ నయీం జీవితకథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా పట్టాలెక్కింది. అమరావతిలోని మందడం గ్రామంలోగల శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ఏపీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాకు 'ఖయీం భాయ్' అనే టైటిల్ ను ఖరారుచేశారు. పి. వెంకట్ రెడ్డి, ఎ. ప్రభాకర్‌రెడ్డిలు ఈ సినిమా నిర్మాతలు. మందడం గ్రామానికి చెందిన కట్టా రాంబాబు అనే నటుడు 'ఖయీం భాయ్' టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నయీం పేరును రాంబోగా పిలుస్తారు. ముహుర్తం షాట్ గా.. గణేష్ విగ్రహం ఎదుట నయీం కేరక్టర్ అయిన రాంబాబు కొబ్బరికాయ కొట్టి నృత్యం చేసే దృశ్యాలను చిత్రీకరించారు. బెంగళూరుకు చెందిన మౌని ఈ సినిమాలో హీరోయిన్. ముమైత్ ఖాన్, తనికెళ్ల భరిణి, ఎల్బీ శ్రీరాం, బెనర్జీ, రాం జగన్, ఫిష్ వెంకట్, శివ సత్యనారాయణ, హేమ, ప్రగతి, జ్యోతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 'ఖయీం భాయ్'కి మాటలు గోపి మోహన్, సంగీతం శేఖర్ చంద్ర అందిస్తుండగా కెమెరామెన్ గా శ్రీధర్నార్ల, మేకప్ సూర్యచంద్ర, కాస్ట్యూమ్ వలి, కో–డైరెక్టర్ పీవీ రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ క్రిష్ణారెడ్డి, జేవీ నారాయణరావులు వ్యవహరిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. కాగా, ఈ సినిమా ఎక్కువ భాగం ఏపీ రాజధాని ప్రాంతంలో, కీలకమైన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లోని పాతబస్తీ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇదిలాఉంటే, దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం నయీం కథ ఆధారంగా మూడు సినిమాలను తీస్తానని గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ప్రారంభించిన వివరాలేవీ వెల్లడించలేదు. ఇంతలోనే 'ఖయీం భాయ్' సెట్స్ పైకి రావడం, గోపీ మోహన్ లాంటి పేరున్న రచయిత మాటలు, భరత్ డైరెక్షన్ వహిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. -
చిలకలూరిపేట ‘సాక్షి’ విలేకరిపై దాడి
♦ కుడి భుజం, ఎడమకాలిపై గాయాలు ♦ పెద్దోళ్లతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని బెదిరించిన దుండగులు యడ్లపాడు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ‘సాక్షి’ విలేకరిగా పనిచేస్తున్న మానుకొండ సురేంద్రనాథ్‌పై గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు దాడిచేసి గాయపర్చారు. రాత్రి 7.30 గంటల సమయంలో సురేంద్రనాథ్ విధులు ముగించుకుని స్వగ్రామమైన యడ్లపాడుకు వెళుతూ గ్రామశివారులో కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం వాహనం ఆపాడు. వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధంతో ఆయనపై దాడిచేశారు. దీంతో సురేంద్ర కుడి భుజం, ఎడమకాలిపై గాయాలయ్యాయి. పెద్దవాళ్లతో పెట్టుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయని బెదిరించిన దుండగులు.. సురేంద్ర సెల్‌ఫోన్‌లోని మెమొరీకార్డు తీసుకునివెళ్లారు. అనంతరం సురేంద్ర తన మిత్రుడు రోశయ్యకు ఫోన్ చేసి వివరాలు తెలపడంతో వారు అతడిని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం యడ్లపాడు పోలీసుస్టేషన్లో సురేంద్ర ఫిర్యాదు చేశారు. గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన భార్య చేస్తున్న అవినీతిపై కథనాలు రాసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఇతర నాయకులు యడ్లపాడు ఆస్పత్రికి చేరుకుని సురేంద్రనాథ్‌ను పరామర్శించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ దిలీప్‌కుమార్, యడ్లపాడు ఎస్సై ఉమామహేశ్వరరావు ఆసుపత్రికి వెళ్లి దాడి వివరాలను తెలుసుకున్నారు. -
‘కేంద్ర పనులకు’ మోదీ పేరు పెట్టాలి
బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టే విషయాన్ని పరిశీలించాలని సర్కారును శాసన మండలిలో బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు కోరారు. మండలిలో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో కరువు నివారణకు, పంటలకు సాగునీటిని అందించేందుకు ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్ కింద (2015-16) రూ.3,197.60 కోట్లతో 3,84,018 నీటి కుంటలను మంజూరు చేసినట్లు తెలిపారు. మంత్రి ప్రసంగం మధ్యలో సోము వీర్రాజు కలుగజేసుకొని రాష్ర్టంలో సంక్షేమ పథకాలకు ‘చంద్రన్న బాట’, ‘చంద్రన్న కానుక’ వంటి పేర్లు పెడుతున్న తరహాలోనే కేంద్ర నిధులతో చేపట్టే పనులకు మోదీ పేరును పెట్టే విషయమై పరిశీలించాలన్నారు. దీనిపై మంత్రి పుల్లారావు స్పందిస్తూ.. దీనిపై సీఎంతో చర్చిస్తామన్నారు. -
తాగుబోతు భర్తపై మంత్రికి ఫిర్యాదు
ఇంద్రకీలాద్రి: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును అకస్మాత్తుగా ఓ మహిళ అడ్డుకుంది. విజయవాడలో ఉండే దుర్గ(32) అనే మహిళ రోజూ తన భర్త తాగేసి వేధింపులకు పాల్పడుతున్నాడని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వివరాలు.. కొత్తపేట ఏరియా వాగు సెంటర్‌కు చెందిన దుర్గ రోజులానే ఈ రోజు కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను అడ్డుకుంది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భీష్మించుకు కూర్చుంది. దీంతో మంత్రి పోలీసులను పిలిపించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పడంతోఆందోళన విరమించింది. -
రైతు పేరుతో ‘కోతలు’
తెనాలి : ‘రైతుకోసం చంద్రన్న’ పేరుతో స్థానిక మార్కెట్‌యార్డులో సోమవారం నిర్వహించిన భారీ కార్యక్రమానికి అధికారులు ప్రకటించినట్టుగా 20 వేలమంది రైతుల్ని సమీకరించలేకపోయారు. ఆశించినంతకాకున్నా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు రైతులు, పార్టీ కార్యకర్తల్ని మంత్రులు సంతృప్తిపడేలా రాబట్టగలిగారు. రైతులకోసం ఉద్దేశించిన సభలో ఆత్మస్తుతి, పరనింద అన్న తరహాలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలు సాగాయి. చంద్రబాబును కీర్తించటంలో, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయటంలో ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా మాట్లాడారు. ఒకరిద్దరు మంత్రులు, మరో ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలతో దాడిచేశారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రుణమాఫీపై 13 జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు జిల్లా రైతులు ఎక్కువగా సద్వినియోగం చేసుకొన్నట్టు చెప్పారు. ఇక్కడ 5.75 లక్షల రైతులకు రూ.2,900 కోట్లు రద్దుకాగా, ఇందులో రూ.910 కోట్లు ఇప్పటికే వారి ఖాతాల్లో జమైనట్టు చెప్పారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షానికి సవాలు విసిరారు. ఊరూరా రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను ప్రకటిస్తున్నామనీ, అప్పుడు లబ్ధి పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బండారం బయటపడుతుందన్నారు. ప్రత్యేకహోదాపై దీక్ష, ధర్నాల పేరుతో జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన ప్రసంగంలో, రైతురుణమాఫీ ఎవరూ చేయలేని బృహత్ కార్యక్రమంగా చెప్పారు. సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. రాజనీతిజ్ఞుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర ప్రజల పూర్వజన్మసుకృతంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ఏకరువు పెడుతూ అన్నింటికీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబును అభినవ అంబేద్కర్గా పోల్చారు. శాసనమండలి మాజీ చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి ఒక్కరే, ప్రత్యేకహోదానే కాకుండా హెచ్చు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఏపీలో ఇక రాబోయేది ఏక పార్టీ విధానమేనని, అది టీడీపీనేనని జోస్యం చెప్పారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్ మాట్లాడుతూ, బాబును అభినవ కాటన్‌కన్నా ఎక్కువని పొగిడారు. ఇదే సభలో మాట్లాడినప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు మంత్రుల తరహాలోనే విమర్శలు చేయటం మరో విశేషం! గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, జిల్లా ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రబాబు, నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రసంగించారు. -
రిషితేశ్వరి కేసులో నిందితులను ఉపేక్షించం
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు వెస్ట్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి పై నియమించిన న్యాయ విచారణ కమిటీ నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. స్థానిక ఇ న్స్పెక్షన్ బంగళాలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడే వారిని వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా, వారిని రైతులు నమ్మరని తెలిపారు. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. పుష్కరాలలో అధికార యంత్రాంగం సేవలను మంత్రి కొనియాడారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చిట్టిబాబు, జీడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడ్రస్ లేని పార్టీకి రఘువీరా అధ్యక్షుడు!
మంత్రి ప్రత్తిపాటి ఎద్దేవా కొరిటెపాడు (గుంటూరు) : అడ్రస్‌లేని కాంగ్రెస్ పార్టీకి ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షుడని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 125 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న రఘువీరా రాజమండ్రిలో రణభేరి మోగిస్తామని ప్రకటించడం విడ్డూరంగా వుందన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన నానా అగచాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇక మనుగడ వుండదన్నారు. విచక్షణారహితంగా రాష్ట్రాన్ని ఎందుకు విభజించాల్సి వచ్చిందో ముందు రఘువీరా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. ముందు సోనియాగాంధీపై రణభేరి మోగించాలని హితవు పలికారు. చేసిన తప్పులకు చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మహాసంకల్ప సభకు 13జిల్లాల నుంచి లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సంవత్సరంలో చేసిన అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి వివరించనున్నారని తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు పరుస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చచ్చి, కుళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎవరూ బతికించలేరన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని సలహాలు, సూచనలు అందించాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, వట్టికూటి హర్షవర్ధన్, పొన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ సజ్జా హేమలత పాల్గొన్నారు. -
రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ గడువు పెంపు
31వ తేదీ వరకు రైతులకు అవకాశం కలెక్టరేట్‌తోపాటు అన్ని ఆర్డీవో కార్యాలయాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ మచిలీపట్నం : రుణమాఫీ పథకం లబ్ధిపొందని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ప్రకటించారు. వాస్తవానికి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో రుణమాఫీ దరఖాస్తులను స్వీకరించారు. సోమవారం కూడా ఈ కేంద్రం కొనసాగనుంది. రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ గడువును పెంచుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో కలెక్టరేట్‌తోపాటు, జిల్లాలోని నాలుగు ఆర్డీవో కార్యాలయాల్లోనూ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వ్యవసాయశాఖ డీడీ బాలునాయక్ ‘సాక్షి’కి తెలిపారు. గడువు పొడిగింపు రెండోసారి ఏప్రిల్ 27వ తేదీన కలెక్టరేట్లో రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. మే 15వ తేదీ వరకు గడువు విధిం చారు. రైతుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో ఈ నెల 25వ తేదీ వరకు ఈ గడువు పొడిగించారు. ఈ గడువు సోమవారంతో ముగియనుంది. ఈలోగానే వ్యవసాయశాఖ మంత్రి ఈ నెల 31వ తేదీ వరకు ఈ గడువును పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రానికి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రోజుకు 900 చొప్పున దరఖాస్తులు స్వీకరించారు. రూ.50 వేలకు మించి రూ.1.50 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు వాయిదాల పద్ధతిలో మొదటి వాయిదాగా రూ.30 వేలు మాత్రమే జమ అయ్యింది. ఈ విషయాన్ని గమనించని రైతులు తాము తీసుకున్న రుణం మొత్తం మాఫీ కాలేదని ఫిర్యాదుల కేంద్రానికి వచ్చారు. కొంత మంది రైతులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. మీ-సేవ కేంద్రంలో తీసుకున్న పత్రంలో డేటా నాట్ ఫౌండ్ అనే రిమార్కుతో కొంత మంది రైతులకు రుణమాఫీ నిలిచిపోయింది. డేటా నాట్ ఫౌండ్ అనే రిమార్కుతో ఉన్న ఫిర్యాదులను అధికారులు స్వీకరించలేదు. ఈ తరహాలో 2,300లకు పైగా ఫిర్యాదులను అధికారులు తిరస్కరించారు. పూర్తి వివరాల నమోదు రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో తీసుకున్న దరఖాస్తులను ఎనిమిది బృందాల అధికారులు స్వీకరించారు. అధికారులు స్వీకరించిన రుణమాఫీ ఫిర్యాదుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన నమూనా ఆధారంగా నింపి వివరాలను హైదరాబాద్‌కు పంపారు. రైతు పేరు, బ్యాంకు ఖాతా నంబరు, ఎంత రుణం తీసుకున్నారు, ఎంత మేర రుణమాఫీ జరిగింది, రిమార్కులో ఏం రాసి ఉంది తదితర వివరాలను నమోదు చేశారు. ఇందుకోసం 15 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ చేయకుండా రిజిస్టర్ పోస్టు ద్వారా హైదరాబాద్‌లోని ప్రణాళికా విభాగానికి పంపుతున్నారు. సోమవారం ఆఖరు రోజు కావడంతో అధికంగా దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మీ-కోసం కార్యక్రమాన్ని రద్దు చేసినప్పటికీ రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణను కొనసాగిస్తున్నారు. -
మినీ మహానాడును విజయవంతం చేయాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ కొరిటెపాడు(గుంటూరు) : జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ జీవవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా మినీ మహానాడు సోమవారం(నేడు) ఉదయం 9.30 గంటలకు శ్రీ వవేంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రాంభమవుతుందన్నారు. రాష్ట్ర పార్టీ ప్రతినిధుల మహాసభ(మహానాడు)లో ప్రవేశపెట్టబోయే ముసాయిదా తీర్మానాల అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జిల్లాలో మౌలిక వసతుల కల్పన-ప్రధాన సమస్యలపై తగిన విధంగా చర్చించి, అవసరమైన మార్పులు, కూర్పులతో రాష్ట్ర మహాననాడుకు పంపుతామన్నారు. పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, రాయపాటి శ్రీనివాస మద్ధాళి గిరిధర్, బోనబోయిన శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం వ్యాపారి అరెస్టు
చిలకలూరిపేట : రాష్ట్రమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు తన సెల్‌ఫోన్ ద్వారా అసభ్య సంక్షిప్త సందేశాలను పంపిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కేసీ వెంకటయ్య వివరాలను వెల్లడించారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఎలాంటి సంబంధం లేదని ఆ వ్యాపారంలో తలెత్తిన విభేదాల కారణంగా వినుకొండ నియోజవర్గంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బెజ్జం వేణుగోపాలరెడ్డి మంత్రి, అధికారులు, ఎమ్మెల్యేలకు అసభ్య సంక్షిప్త సందేశాలను పంపినట్లు డీఎస్పీ వివరించారు. వేణుగోపాలరెడ్డికి ఆంజనేయులు వ్యాపారికి మధ్య విభేదాలు ఉన్నాయని, ఆంజనేయులు వ్యాపారంలో ముందుకు వెళ్తాడని భావించి వేరే వారి పేర్లతో సిమ్‌లు కొనుగోలు చేసి హైదారాబాద్‌కు చెందిన ప్రసాదరెడ్డి అనే న్యాయవాది సహాయంతో అసభ్య సందేశాలను పంపినట్లు తెలిపారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసినట్లు వివరించారు.. ఈ కేసులో మరో నిందితుడు ప్రసాదరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అర్బన్, రూరల్ సీఐలు బి. సురేష్‌బాబు, టి. దిలీప్‌కుమార్, పట్టణ ఎస్ఐ కోటేశ్వరరావులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు సముచిత స్థానం
టీడీపీ జిల్లా ఇన్చార్జి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆనందపేట (గుంటూరు) : కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ప్రతి కా ర్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వినుకొండ ఎమ్మెల్జే జి.వి.ఆంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించగా, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులు బలపరుస్తూ తమ మద్దతు ప్రకటించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. జీవీ ఆంజనేయులును సత్కరించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపీ లు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, మాజీ మంత్రి జె.ఆర్.పుష్పరాజ్, నాయకులు మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాసయాదవ్, చుక్కా ఏసురత్నం, గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలో.. రణం
► భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ ► జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన ఆ పార్టీ సభ్యులు ► ల్యాండ్ పూలింగ్‌కు మాత్రమే వ్యతిరేకమని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టీకరణ ► ఇష్టంలేని రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం దారుణం ► కౌలు రైతులు, రైతుల కూలీలకు ఏం న్యాయం చేస్తున్నారో చెప్పలేదు ► రాజధాని ప్రాంత రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేయలేకపోయారు ► భూసేకరణ ఆర్డినెన్స్, నూతన జీవోను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టు ► తిరస్కరించిన మంత్రి ప్రత్తిపాటి,జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ ► రైతుల పక్షాన పోరాటం చేస్తామని, జీవో కాపీలను చింపివేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన వైఎస్సార్ సీపీ సభ్యులు పాత గుంటూరు : భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఇందుకు గుంటూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వేదికగా చేసుకుంది. ఆ సమావేశాన్ని బహిష్కరించింది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి ఇంకా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ, భూ సేకరణలపైనే చర్చ సాగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ తాము రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ల్యాండ్ పూలింగ్ విధానానికి మాత్రమేనని స్పష్టం చేశారు. ఇష్టం ఉన్న రైతులు మాత్రమే భూములు ఇచ్చారని, ఇష్టం లేని రైతుల వద్ద నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవాలని చూడడం దారుణమన్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో నష్టపోతామని భావించి రైతులు కోర్టును ఆశ్రయిస్తే వారిని బెదిరించేందుకు ప్రభుత్వం 166 జీవోను విడుదల చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 33,400 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పుకోవడం కాదని, పాలకుల బెదిరింపులకు భయపడి ఇచ్చారనేది కౌలు చెక్కుల పంపిణీలో తేటతెల్లమైందన్నారు. రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలకు, వ్యవసాయ వృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో ఇప్పటివరకు ప్రకటన చేయలేదన్నారు. ఏ స్థితిలో రైతులకు నష్టం జరిగినా వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా అని ఆర్కే ప్రశ్నించారు. శాసనసభలో ల్యాండ్‌పూలింగ్ విధానంపై ఓటింగ్ నిర్వహించాలని ైవె ఎస్సార్ సీపీ పట్టుపట్టినా, భయపడిన సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానాన్నే ఎంపిక చేసుకున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసివేయండి, తాము రాజధానికి సహకరిస్తామని ఆయన స్పష్టచేశారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించినా ఇప్పటికీ మాఫీ చేయకపోవడాన్ని ప్రశ్నించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పుకుంటున్న ప్రాంతంలో రాజధాని నిర్మించుకుంటే బాగుంటుందన్నారు. సర్వసభ్య సమావేశంలో భూసేకరణ ఆర్డినెన్స్, నూతన జీవోను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీనిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్లు వ్యతిరేకించారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులంతా 166 జీవో కాపీలను చింపిచేసి సమావేశాన్ని బహిష్కరించారు. చిరునవ్వుల మధ్యే చర్చ .... మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సర్వసభ్య సమావేశంలో భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని కోరగా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తాము రైతులకు న్యాయం చేస్తున్నామనీ, ల్యాండ్ పూలింగ్‌లో రైతులు స్వచ్ఛందంగా 33,400 ఎకరాలు ఇచ్చారనీ, ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే చిరునవ్వుతో మంత్రి పదవి కోసం పాట్లు ఎందుకన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, రాజేంద్రప్రసాద్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో కెల్లా సుందరమైన రాజధానిని నిర్మించాలని కృషి చేస్తున్నారన్నారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఎమ్మెల్యే ఆర్కే మరోసారి భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేక తీర్మానం చేయాలని డిమాండ్ చేయడంతో మంత్రి పుల్లారావు సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులంతా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
రుణమాఫీపై దుష్ర్పచారం: ప్రత్తిపాటి
హైదరాబాద్: రుణమాఫీని ప్రశంసించడానికి బదులు ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని, రైతు మనసుల్లో ప్రభుత్వ వ్యతిరేక భావన కల్పిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. వెల్లువెత్తుతున్న రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారం కోసం రెండు రోజులుగా వివిధ స్థాయిల్లో కసరత్తు చేస్తున్నామన్నారు. రుణమాఫీ, క్షేత్రస్థాయి పరిస్థితిని ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో మంత్రి ప్రత్తిపాటి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు గురువారమిక్కడ సమీక్షించారు. కుటుంబరావు రాజకీయ విమర్శలు..: రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయగా, ఎలా చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. రుణమాఫీ వ్యవహారానికి తాను బాధ్యుడినని, అందుకే జగన్ విమర్శలకు స్పందిస్తున్నానని చెప్పారు. పత్తి కుంభకోణంలో దోషుల్ని వదలం: రైతులకు దక్కాల్సిన రూ.221 కోట్ల భారత పత్తి సంస్థ (సీసీఐ) నిధుల్ని బయ్యర్లు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై బొక్కేసిన వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో చెప్పారు. పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారిస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ విజయయాత్ర వాయిదా: ఏపీ ప్రభుత్వం శుక్రవారం నుంచి చేపట్టదలిచిన రైతు రుణమాఫీ విజయయాత్ర వాయిదా పడింది. గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సీహెచ్ కుటుంబరావులు నిర్ణయం తీసుకున్నారు. -
ఎయిమ్స్ 2 ఏళ్ళల్లో పూర్తి
14న శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి జె.పి.నడ్డా వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శానిటోరియంలో ఏర్పాట్ల పరిశీలన మంగళగిరి : ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) ఆస్పత్రి నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎయిమ్స్ నిర్మించనున్న శానిటోరియంలో శంకుస్థాపన కోసం చేపట్టిన ఏర్పాట్లను మంత్రి ప్రత్తిపాటి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి హాజరవుతారని పేర్కొన్నారు. వారి రాకకోసం హెలిప్యాడ్, బహిరంగ సభాస్థలం, పార్కింగ్ సౌకర్యాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపాదికన పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎయిమ్స్ వంటి సంస్థ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వైద్య విద్య అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అడిగిన మేరకు 193 ఎకరాల భూమిని అందజేస్తామని, అందుకు శానిటోరియంలో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ను తరలించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ను రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. అన్ని సంస్థలు రాజధాని ప్రాంతంలోనే ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతమని, అందుకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ వంటి మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌వో పద్మజారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ సంతోషరావు, ఆర్ అండ్ బీ డీఈ మహేష్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మిలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కొండవీడుకు మహర్దశ
యడ్లపాడు: నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో చారిత్రక కొండవీడుకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఆలోచనతో ప్రయత్నాలు చేస్తోంది. కొండవీడు ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలోనే కొండవీడు ఘాట్‌రోడ్డు పనులకు ప్రభుత్వం రూ. 35 కోట్ల నిధులను మంజూరు చేసింది. వీటితోపాటు ఇంకా అనేక ప్రాజెక్టులను తీసుకువస్తే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చనే అలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని జూపార్కు మాదిరిగా ఇక్కడ నెలకొల్పాలని భావిస్తోంది. ఎకో, పోర్టు, మరో మూడు ప్రధాన దేవాలయాల అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కొండవీడు అభివృద్ధికి ఆనాడే బీజం వేసిన వైఎస్... కొండవీడు కోట ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపొందించాలంటూ అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. కొండవీడు ప్రాధాన్యతను నాడే గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొండపైకి ఘాట్‌రోడ్డు చేయాలని రూ. 5 కోట్లు నిధులను 2007 లో ఆర్అండ్బి శాఖకు విడుదల చేశారు. ఆ తర్వాత ఏడుశాఖలకు చెందిన మంత్రులు వచ్చి కొండవీడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సీఎం రోశయ్య పలు శాఖల మంత్రులతో వచ్చి ఈ అభివృద్ధి పనుల్లో భాగమైన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్)ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటులో హంసా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కొత్తపాలెం నుంచి ఘాట్‌రోడ్డు వరకు అప్రొచ్‌రోడ్డు, ఘాట్‌రోడ్డు మూడు దశల సర్వే, ట్రాక్ రోడ్డు ఏర్పాటు, కేంద్ర అటవీ శాఖనుంచి రెండు దశల అనుమతి, ఏపీ టూరిజం ఆధ్వర్యంలో కోట గ్రామంలో స్వాగత ద్వారం, కొండ మెట్లమార్గం వద్ద గెస్ట్‌హౌస్ నిర్మాణం చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల నిర్మాణం జరిగింది. తాజాగా పురాతన మసీదు పునరుద్ధరణ ప్రక్రియను పురావస్తు శాఖ చేపట్టింది. -
ఉత్తుత్తే!
►ఖరీఫ్, రబీ ముగిసినా దిక్కులేని యాంత్రీకరణ ►రూ.10 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గిన బడ్జెట్ ►‘మీ-సేవ’ నుంచి దరఖాస్తు చేసుకోవాలని కొర్రీలు ►పూర్తి ధర చెల్లిస్తే రాయితీ జమ చేస్తామని మెలిక ►వ్యవసాయ, ఉద్యాన శాఖలో అమలు కాని పథకం ►నేడు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అటకెక్కింది. ఖరీఫ్, రబీ పంట కాలాలు ముగిశాయి. ఒకటిన్నర నెలలో ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ తక్కువ సమయంలో జిల్లాకు కేటాయించిన యాంత్రీకరణ బడ్జెట్ ద్వారా ఎంతవరకు ప్రయోజనం చేకూర్చిపెడతారో అంతుచిక్కడం లేదు. జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాల ప్రగతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టి సారించి న్యాయం చేస్తారా.. లేక చూసీచూడనట్లు వెళతారా అనేది మంగళవారం జిల్లా పర్యటనలో తెలియనుంది. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కారు కొలువుతీరి తొమ్మిది నెలలు కావస్తున్నా పథకాల అమలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోరుుంది. మిగతా జిల్లాల పరిస్థితి ఎలాగున్నా కరవు పరిస్థితులు నెలకొన్న ‘అనంత’లో మాత్రం రైతుల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రోత్సహిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలను పరిష్కరించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రైతులకు రూ.10 కోట్లు వెచ్చించి అన్ని రకాల యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ సామగ్రి 50 శాతం రాయితీతో అందజేస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ధరలు, రాయితీలు ఖరారు చేయడానికి కాలమంతా వెచ్చించారు. చివరకు గత డిసెంబర్లో రూ.10 కోట్ల బడ్జెట్‌ను రూ.5 కోట్లకు కుదించారు. అదైనా సకాలంలో వ్యయం చేసి అమలు చేశారా అంటే అదీ లేదు. కనీసం స్ప్రేయర్ కూడా పంపిణీ చేయని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో యాంత్రీకరణ పనిముట్లు అవసరమైన రైతులు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలు పెట్టడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వివిధ సాంకేతిక కారణాలతో మీ-సేవా కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో పాటు అధికారులు, రైతులు, మీ-సేవా కేంద్రాల నిర్వాహకులకే సరైన అవగాహన లేక దరఖాస్తుల అప్లోడ్ కష్టంగా మారింది. మూడు నెలలు కావస్తున్నా 30 దరఖాస్తులు కూడా అప్లోడ్ కాకపోవడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మీ-సేవా కేంద్రాల ద్వారా పెలైట్‌గా తీసుకుని ఒక మండలం లేదా ఒక వ్యవసాయ సబ్‌డివిజన్‌లో అమలు చేసివుంటే కొంత ఫలితం ఉండేది. అలా ఒకట్రెండు సంవత్సరాల్లో విస్తరిస్తే పథకం అమలు సాఫీగా సాగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముందూ వెనుకా ఆలోచించకుండా ఒక్కసారిగా మీ-సేవాలో ఆన్లైన్ చేసుకోవాలనే నిబంధన పెట్టి బడ్జెట్ ఖర్చు కాకుండా యంత్ర పరికరాలు రైతులకు అందకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతోంది. జిల్లాకు కేటాయించిన రూ.5 కోట్లు ఖర్చు చేసి సుమారు 2,500 యంత్రోపకరణాలు ఎపుడిస్తారో అధికారులకే తెలియడం లేదు. ఉద్యానశాఖదీ అదే పరిస్థితి ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న యాంత్రీకరణ పరిస్థితి అలాగే ఉంది. ఉన్నఫలంగా నిబంధనలు మార్పు చేయడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. స్ప్రేయర్ కావాలన్నా మొదట పూర్తి ధర చెల్లిస్తే తరువాత.. రాయితీ రైతు ఖాతాలో జమ చేస్తామని మెలికపెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఉద్యాన శాఖకు ఇపుడు కొత్త నిబంధన జారీ చేయడంతో అధికారుల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తంమ్మీద అటు వ్యవసాయ, ఇటు ఉద్యాన శాఖ యాంత్రీకరణ పథకం అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. యాంత్రీకరణ పథకం కింద కేటాయింపులిలా... ►ఎద్దులతో లాగే పరికరాలు 120 యూనిట్లకు రూ.30 లక్షలు ►ట్రాక్టర్‌తో లాగే యంత్రపరికరాలకు రూ.1.20 కోట్లు ►ఇంప్రూవ్డ్ ఫార్మ్ పరికరాలు 20 యూనిట్లకు రూ.40 లక్షలు ►250 రోటోవీటర్స్కు రూ.1.25 కోట్లు ►10 హార్వెస్టర్లకు రూ. 50 లక్షలు ►వివిధ రకాల స్ప్రేయర్లు 80 యూనిట్లకు రూ.60 లక్షలు ►300 డీజిల్ ఇంజన్ల పంపిణీకి రూ.30 లక్షలు ►పవర్ టిల్లర్స్‌కు 10 యూనిట్లకు రూ.6 లక్షలు కేటాయింపు ► ఆర్కేవీవై (రాష్టీయ కృషి వికాస్ యోజన) కింద కేటాయింపులు ఇలా.. ►వేరుశనగ సీహెచ్‌సీ కింద 12 యూనిట్లకు రూ.90 లక్షలు ►పోస్ట్ హార్వెస్టింగ్ పరికరాలు 25 యూనిట్లకు రూ.80 లక్షలు ►హయరింగ్ స్టేషన్స్ (యంత్ర పరికాల అద్దె కేంద్రాలు) 40 యూనిట్లకు రూ.60 లక్షలు ►అగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ 1000 యూనిట్లకు రూ.15 లక్షలు ►సోలార్ ఫెన్సింగ్ 30 యూనిట్లకు రూ.15 లక్షలు ►ట్రైనింగ్ అండ్ కెపాసిటీ రెండింటికి రూ.50 వేలు ► సీడ్ అండ్ ఫర్టిలైజర్స్ డ్రిల్లర్లు 90 యూనిట్లకు రూ.15 లక్షలు ►మొక్కజొన్న షెల్లర్స్ 10 యూనిట్లకు రూ. రెండు లక్షలు. ►మల్టీక్రాప్ త్రెషర్స్ 50 యూనిట్లకు రూ.44 లక్షలు ►రోటోవీటర్స్ 54 యూనిట్లకు రూ.27 లక్షలు ►పవర్వీడర్స్ 24 యూనిట్లకు రూ.12 లక్షలు కేటాయింపు ►ఇంప్రూవ్డ్ ఫార్మ్ మెషిషనరీస్ 106 యూనిట్లకు రూ.50 లక్షలు ► తైవాన్ స్ప్రేయర్స్ 300 యూనిట్లకు రూ.30 లక్షలు నేడు మంత్రి పత్తిపాటి రాక అనంతపురం అర్బన్: రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం జిల్లాకు రానున్నారు. పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సోమవారం వెల్లడించారు. మంత్రి ఉదయం 9.00 గంటలకు రామగిరి మండలం వెంకటాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని.. మధ్యాహ్నం 2.15 నుండి 3.00 పెనుకొండ అతిథి గృహం లంచ్, 3.15 నుండి 3.30 పెనుకొండలో సెరికల్చర్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొని బెంగళూరుకి బయలుదేరి వెళ్లనున్నారు. -
ప్రతి రైతుకు యూరియా అందించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో యూ రియా కొరతను అరికట్టి ప్రతి రైతుకు అందేలా చూడాలని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ వి.శ్రీధర్‌ను కోరారు. పలు సొసైటీల అధ్యక్షులు, రైతులతో కలిసి శుక్రవారం ఆయన జేడీని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరతలేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ వారికి చెందిన సొసైటీలకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని సొసైటీలకు సరఫరా చేసి రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. జేడీఏ శ్రీధర్ మాట్లాడుతూ అన్ని సొసైటీలకు యూరియాను సరఫరా చేస్తామని చెప్పారు. యూరియాను అధిక ధరలకు అమ్మే సొసైటీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
- గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబు - ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి గుంటూరు క్రైం : స్వాతంత్య్ర వేడుకలకు గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబయింది. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వేదికతోపాటు, పోలీస్ గౌరవ వందనం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు, అతిథులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్మించిన శకటాలను మైదానంలో సిద్ధంగా ఉంచారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్యెల్యేలు, కలెక్టర్,ఎస్పీలు, వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజలు, విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చే శారు. వీఐపీల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.ఏర్పాట్లను అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ బి.సత్యనారాయణ, తహశీల్దారు టి. మోహన్‌రావు వున్నారు.