‘కేంద్ర పనులకు’ మోదీ పేరు పెట్టాలి | "The work" should be the name of Modi | Sakshi
Sakshi News home page

‘కేంద్ర పనులకు’ మోదీ పేరు పెట్టాలి

Published Wed, Mar 16 2016 2:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘కేంద్ర పనులకు’ మోదీ పేరు పెట్టాలి - Sakshi

‘కేంద్ర పనులకు’ మోదీ పేరు పెట్టాలి

బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు

 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టే విషయాన్ని పరిశీలించాలని సర్కారును శాసన మండలిలో బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు కోరారు. మండలిలో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో కరువు నివారణకు, పంటలకు సాగునీటిని అందించేందుకు ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్ కింద (2015-16) రూ.3,197.60 కోట్లతో 3,84,018 నీటి కుంటలను మంజూరు చేసినట్లు తెలిపారు.

మంత్రి ప్రసంగం మధ్యలో సోము వీర్రాజు కలుగజేసుకొని రాష్ర్టంలో సంక్షేమ పథకాలకు ‘చంద్రన్న బాట’, ‘చంద్రన్న కానుక’ వంటి పేర్లు పెడుతున్న తరహాలోనే కేంద్ర నిధులతో చేపట్టే పనులకు మోదీ పేరును పెట్టే విషయమై పరిశీలించాలన్నారు. దీనిపై మంత్రి పుల్లారావు స్పందిస్తూ.. దీనిపై సీఎంతో చర్చిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement