తాగుబోతు భర్తపై మంత్రికి ఫిర్యాదు
ఇంద్రకీలాద్రి: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును అకస్మాత్తుగా ఓ మహిళ అడ్డుకుంది. విజయవాడలో ఉండే దుర్గ(32) అనే మహిళ రోజూ తన భర్త తాగేసి వేధింపులకు పాల్పడుతున్నాడని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వివరాలు.. కొత్తపేట ఏరియా వాగు సెంటర్‌కు చెందిన దుర్గ రోజులానే ఈ రోజు కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది.
పోలీసులు సరిగా స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను అడ్డుకుంది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భీష్మించుకు కూర్చుంది. దీంతో మంత్రి పోలీసులను పిలిపించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పడంతోఆందోళన విరమించింది.