
సాక్షి, విజయవాడ: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ నిమ్మగడ్డపై ఏపీ ప్రజా న్యాయవేదిక అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఉంటూ విజయవాడలో ఉన్నట్లుగా ఇంటి అద్దె తీసుకున్నందుకు నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీనివాసరావు పేర్కొన్నారు.