Suryaraopeta
-
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ఫిర్యాదు..
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ నిమ్మగడ్డపై ఏపీ ప్రజా న్యాయవేదిక అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఉంటూ విజయవాడలో ఉన్నట్లుగా ఇంటి అద్దె తీసుకున్నందుకు నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా...
సాక్షి, విజయవాడ: ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నేరంలో బీజేపీ నేత అడ్డంగా బుక్కయ్యారు. నగరానికి చెందిన వ్యాపారవేత్త, బీజేపీ నేత లాకా వెంగళ్ రావు యాదవ్ శనివారం రాత్రి ఎంజీరోడ్‌లో వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులకు పాస్‌పోర్ట్ కార్యాలయం పక్కన పార్క్ చేసిన ఉన్న వెంగళ్ రావు సఫారీ వాహనం కనిపించింది. దానిని తొలగించాల్సిందిగా కోరగా ఆయన పట్టించుకోలేదు. దీంతో టోయింగ్ వాహనాన్ని తీసుకొచ్చి వాహనాన్ని తొలగించేందుకు యత్నించారు. అది గమనించిన వెంగళ్ రావు ఆగ్రహంతో ఊగిపోయారు. ట్రాఫిక్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ సీఐ సుబ్బరాజుతో దురుసుగా ప్రవర్తించటమే కాకుండా.. అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై కారు ఎక్కించేందుకు యత్నించారు. ఆపై అక్కడి నుంచి కారుతో వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ట్రాఫిక్ సీఐ.. సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదకరంగా వాహనం నడపటంతో పాటు, అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు వెంగళరావు యాదవ్‌పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే 2009 ఎన్నికల్లో ఇతను విజయవాడ ఎంపీగా, బీజేపీ తరుపున పోటీ చేసాడు కూడా. -
బెజవాడలో రెచ్చిపోయిన బీజేపీ నేత
-
రాంగోపాల్ వర్మ పిచ్చి వదిలిస్తాం..
సాక్షి, విజయవాడ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై బీజేపీ మహిళా మోర్చ నేతలు శుక్రవారం విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీఎస్టీ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చ నేతలు మాట్లాడుతూ.. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలి వేశారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు. కాగా... దేవుడూ, సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా అంటూ రాంగోపాల్ వర్మ ఓ ప్రెస్ నోట్ ద్వారా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు...ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మొత్తం ఫైనల్ వీడియో ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి 'మియా మాల్కోవా' పేరుతో ఉన్న అఫీషియల్ విమియో (www.vimeo.com) ఛానల్లో విడుదలవుతోంది. 26న రిలీజ్ అవ్వబోయే ఆ ఫుల్ వీడియోలో మాల్కోవా సంపూర్ణ నగ్నత్వంలోని అణువణువునీ నా కెమెరాతో ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దాను. ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని యూరోప్ లో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. నా కెమెరా కన్ను ఆమె సుందర నగ్నశరీరంలోని అంగాంగాన్ని ఆరాధించడమే కాకుండా ఆమె ఆలోచనల్లో వ్యక్తమయ్యే గూఢతని, ఆమెలో నిక్షిప్తమై ఉన్న శృంగార గాఢతని కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలో ప్రకటిస్తుంది. దేవుడు, సెక్స్ మరియు నిజం లో మియా మాల్కోవా.. సమాజం అసభ్యం అనుకునే పదజాలాన్ని కూడా పలుకుతుంది..దానికి కారణం ఏది ఎవరికి సభ్యం, ఏది ఎవరికి అసభ్యం అని అనాది నుంచి వస్తున్న ప్రశ్నకి సమాధానమివ్వటానికే. విపరీత కట్టుబాట్ల సమాజం, ఒక పద్ధతి ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన స్వేఛ్చాలోచనల్ని బహిరంగ పరచడమే ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ యొక్క ముఖ్య ఉద్దేశ్యం . జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాగాడు తనపై చూపే శృంగారమయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలియాడాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే ప్రాజెక్టు ఒక ప్రతినిధి. సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలని, బలవంతపు బంధాలని, కుహనా నైతిక విలువలని అధిగమించడానికి ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనేది ఒక మహోన్నత సాధనం. అప్పటి వరకు ఉన్న ఆలోచనలకి అవతల ఏముందో ఆలోచించినప్పుడే ఏ మనిషికైనా ఒక బలమైన తాత్వికత పుడుతుంది. అదే జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి దోహదపడుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది అనేక అవార్డులను పొందిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ కి తాను కూర్చిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావప్రకటనల్లోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తివంతంగా వ్యక్తపరచడానికి దోహదపడింది. సాధారణ స్వరకల్పనలకి అందని మహాద్భుతమైన ‘బాహుబలి’ కి, ఆధ్యాత్మికతని నిలువెల్లా నింపుకున్న ‘అన్నమయ్య’ సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్ విషయంలో కూడా అంతే నిబద్ధతని చూపడం, మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వటం నన్ను అబ్బురపరిచింది. మియా మాల్కోవా మీద నాకున్న అత్యంత గౌరవానికి గల కారణం తాను తనకు నచ్చిన విధంగా జీవించే నిర్ణయం తీసుకోవడం, తనకు తోచిన విధంగా సెక్స్ ని ఎంజాయ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం....అంతే కాకుండా సెక్స్ ని పవిత్రంగా చూస్తూ అందులో మునిగి తేలడానికి సిగ్గు, అపరాధభావం ఉండకూడదని చెప్పే తన ఆలోచనల వెనక వున్న లోతుల్ని కూడా నేను చూడగలగడం. ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’లో మియా మాల్కోవా తన నిజాయితీ లోని శక్తితోటి, తన నమ్మకాలపై ఉన్న పట్టుతోటి, జగదేక సుందరిలాంటి తన అందమైన ముఖంలోని అమాయకత్వంతోటి ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుంది. మియాలోని అందం మరియు తాత్వికత, నిజాయితీ కలగలిసిన మాటల మూలాన సెక్స్ లోని అన్ని అంశాలు కళ్ళు, మెదడున్న ఎవరికైన స్వచ్ఛంగా, పవిత్రంగా, అందంగా కనిపిస్తాయి. మియా మాల్కోవా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే బలమైనది . ఎందుకంటే తాను కేవలం అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి దాపరికాల సరిహద్దులన్నీ దాటి హిపోక్రిటికల్ మానవ సమాజంపై ధ్వజమెత్తి జయించటానికి నడుం కట్టుకుంది. ఏ మాత్రం కల్తీలేని ఆనందాన్ని ఎన్నో లక్షల మంది ప్రజలకి ఇవ్వడంలో మియా మాల్కోవా ఒక చారిటీ క్వీన్. అందుకనే ఆమె ఆలోచనలని అర్థం చేసుకునే బుర్ర వున్న ప్రతి ఒక్కరు ఆమెకు మనసారా కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేస్తారు. పేరుకుపోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్న స్త్రీ నుంచి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడమే ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ వెనుక ఉన్న ఒక తాత్వికత. ఒక్క మాటలో చెప్పాలంటే, “‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ లో మియా మాల్కోవాని చూసి, విని అర్ధం చేసుకున్న వారందరి మనస్సులో సెక్స్ కి అర్ధమే మారిపోతుంది!! అని వర్మ పేర్కొన్నాడు. -
నడిసంద్రంలో..
సూర్యారావుపేట (కాకినాడ రూరల్), న్యూస్‌లైన్ :కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట నుంచి వేటకు వెళ్లిన బోటు సముద్రంలో చిక్కుకోవడంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళనలో కొట్టుమిట్టాడాయి. సోమవారం ఉదయం సూర్యారావుపేట నుంచి ఏడుగురి సభ్యులతో వేటకు బయలుదేరిన బోటు హెలెన్ తుపానులో చిక్కుకుంది. మెత్తని వల వేట కావడంతో మూడురోజుల్లో అంటే బుధవారం సాయంత్రానికే తిరిగి రావాలి, అయితే బుధవారం నాటికే తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. వేటకు వెళ్లిన మిగతావారందరూ తిరిగి వచ్చినా, ఒక బోటుతో సహా ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. రాత్రి 12 గంటల వరకు పనిచేసిన ఫోన్లు ఆ తరువాత ఆగిపోవడంతో తమవారి సమాచారం తెలియడంలేదని ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. బాధితులు మెరైన్, సీ పోర్టు అధికారులకు సమాచారం తెలిపారు. అమలాపురంలో ఫిర్యాదు చేయాలని సీపోర్ట్ అధికారులు చెప్పారని, చిన్న బోటు మాత్రమే ఉండడంతో తుపానులో సముద్రంలోకి వెళ్లడం కుదరదని మెరైన్ అధికారులు చెప్పారని మత్స్యకారులు వాపోయారు. కాగా సర్పంచ్ యజ్జల బాబ్జీ, గ్రామ కార్యదర్శి ఎస్వీవీ శ్రీనివాసరావు జిల్లా అధికారులతో చర్చిం చారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ఓడలరేవు సమీపంలోని రిలయన్స్ రిగ్ వద్ద మత్స్యకారులతో కనిపించిన ఒక బోట్‌ను తొలుత సూర్యారావుపేట బోట్‌గా మెరైన్ సిబ్బంది భావించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వీరు అద్దరిపేట మత్స్యకారులని తేలింది. ఏడుగురు ఇంకా ప్రమాదంలోనే... ఓడలరేవు(అల్లవరం) : సూర్యారావు పేటకు చెందిన ఏడుగురు మత్సకారులు బోటు ఇంజన్ చెడిపోవటంతో తీరానికి చేరుకోలేక, రక్షించేవారు లేక అగచాట్లు పడుతున్నా రు. రెండు రోజులుగా వీరు తమవారికి ఫోన్లో వారు సమాచారం అందిస్తూ వచ్చారు. దూడా తాతారావుకు చెందిన ఫైబర్ బోట్లో తిక్కాడ అప్పారావు, కొండబాబు, సత్తిబాబు,దూడా జగన్నాథం, అప్పన్న, ఎరుపల్లి సామేలు, కర్రి చిన్నలు 18న సముద్రంలో వేటకు వెళ్లారు. తుపాను పట్టిందని బోటు ఓనర్ తాతారావు సమాచారం ఇవ్వటంతో తీరానికి బుధవారం బయలుదేరారు. భైరవపాలెం రిలయన్స్ రిగ్గుల వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంటకు బోటు ఇంజన్ చెడిపోయి వారు సముద్రంలో చిక్కుకున్నారు. లంగరు వేసి బోట్‌ను నిలిపి తాతారావుకు సమాచారం ఇచ్చారు. ఈదురు గాలులు, సముద్రపు ఉధృతికి బోట్ కొట్టుకు పోతున్నదంటూ సెల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపుతూనే ఉన్నారు. బోటును కదలకుండా ఆపేందుకు రూ. 50 వేల వలను సముద్రంలో వేసినప్పటికీ ఫలించలేదు. వల తెగిపోయి, లంగరు ఇనుప రాడ్లు విరిగిపోవటంతో బోటు ఓడలరేవు వైపు కదులుతూ ఉందని తీరానికి సమాచారం అందించారు. బోటు బోల్తాపడుతుందని, తమను రక్షించాలని వారు వేడుకున్నారు. బోటు ఓనర్ తాతారావు కోస్టల్ సెక్యూరిటీ, కోస్టుగార్డు, కలెక్టర్, మత్స్యశాఖ అధికారులకు ఈవిషయం బుధవారమే తెలిపారు. తగిన బోట్లు లేవని అధికారులు చెప్పడం తగ దని దీనిపై తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కోస్టల్ సెక్యూరిటీ, కోస్టుగార్డు, నావీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాగా గురువారం సాయంత్రం నుంచి రెండు రెస్క్యూ టీమ్‌లు ఈ మత్స్యకారుల కోసం గాలిస్తున్నా యి. ఇదిలా ఉండగా ఓడలరేవు సమీపంలో సముద్రంలో చుక్కాని విరిగిపోయి నిలిచిన మరో బోటులోని ఆరుగురిని కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు రక్షించారు. గురువారం మరో బోటు పంపి వీరిని రప్పించారు. ఉప్పాడ కొత్తపల్లి మైనాబాద్కు చెందిన దూల జోతిబాబు, సొది పులుసు, జెల్లా యాదవయ్య, చెక్కా కాశియ్య, నక్కా రాజు, కుచ్చి సూరిబాబు సురక్షితంగా ఓడలరేవు తీరానికి చేరిన వారిలో ఉన్నారు.