రాంగోపాల్‌ వర్మ పిచ్చి వదిలిస్తాం.. | Police complaint against RamGopal Varma over God, Sex and Truth web series | Sakshi
Sakshi News home page

రాంగోపాల్‌ వర్మపై బీజేపీ మహిళా మోర్చ ఫిర్యాదు

Published Fri, Jan 19 2018 1:53 PM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

Police complaint against RamGopal Varma over God, Sex and Truth web series - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మపై బీజేపీ మహిళా మోర్చ నేతలు శుక్రవారం విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీఎస్‌టీ వెబ్‌ సిరీస్‌ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చ నేతలు మాట్లాడుతూ.. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలి వేశారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్‌ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు.

కాగా...
దేవుడూ, సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా అంటూ రాంగోపాల్‌ వర్మ ఓ ప్రెస్‌ నోట్‌ ద్వారా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే..
‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’  సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు...ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’  మొత్తం ఫైనల్  వీడియో  ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి 'మియా మాల్కోవా' పేరుతో ఉన్న అఫీషియల్ విమియో (www.vimeo.com) ఛానల్లో విడుదలవుతోంది. 26న రిలీజ్ అవ్వబోయే ఆ  ఫుల్ వీడియోలో మాల్కోవా సంపూర్ణ నగ్నత్వంలోని అణువణువునీ నా కెమెరాతో ఒక  పెయింటింగ్ లా తీర్చిదిద్దాను.

ఒక  అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే  విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని  యూరోప్ లో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. నా కెమెరా కన్ను ఆమె సుందర  నగ్నశరీరంలోని అంగాంగాన్ని ఆరాధించడమే కాకుండా ఆమె ఆలోచనల్లో వ్యక్తమయ్యే గూఢతని, ఆమెలో నిక్షిప్తమై ఉన్న శృంగార గాఢతని కూడా ఒక  ఆధ్యాత్మిక కోణంలో ప్రకటిస్తుంది.

దేవుడు, సెక్స్ మరియు నిజం లో  మియా మాల్కోవా.. సమాజం అసభ్యం అనుకునే పదజాలాన్ని కూడా  పలుకుతుంది..దానికి  కారణం  ఏది  ఎవరికి సభ్యం, ఏది ఎవరికి అసభ్యం అని అనాది నుంచి  వస్తున్న ప్రశ్నకి  సమాధానమివ్వటానికే. విపరీత  కట్టుబాట్ల సమాజం, ఒక  పద్ధతి  ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన  స్వేఛ్చాలోచనల్ని బహిరంగ  పరచడమే ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’  యొక్క ముఖ్య  ఉద్దేశ్యం .

జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాగాడు తనపై చూపే శృంగారమయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలియాడాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’  అనే ప్రాజెక్టు  ఒక ప్రతినిధి. సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలని, బలవంతపు బంధాలని, కుహనా నైతిక విలువలని అధిగమించడానికి ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’  అనేది ఒక మహోన్నత సాధనం. అప్పటి వరకు ఉన్న ఆలోచనలకి అవతల ఏముందో ఆలోచించినప్పుడే ఏ మనిషికైనా ఒక బలమైన తాత్వికత పుడుతుంది. అదే జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి దోహదపడుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది అనేక అవార్డులను పొందిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’  కి తాను కూర్చిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావప్రకటనల్లోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తివంతంగా వ్యక్తపరచడానికి దోహదపడింది.

సాధారణ స్వరకల్పనలకి అందని మహాద్భుతమైన ‘బాహుబలి’ కి, ఆధ్యాత్మికతని నిలువెల్లా నింపుకున్న ‘అన్నమయ్య’ సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్  విషయంలో కూడా అంతే నిబద్ధతని చూపడం, మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వటం నన్ను అబ్బురపరిచింది. మియా మాల్కోవా మీద నాకున్న అత్యంత గౌరవానికి గల కారణం తాను తనకు నచ్చిన విధంగా జీవించే నిర్ణయం తీసుకోవడం, తనకు తోచిన విధంగా సెక్స్ ని ఎంజాయ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం....అంతే కాకుండా  సెక్స్ ని పవిత్రంగా చూస్తూ అందులో మునిగి తేలడానికి సిగ్గు, అపరాధభావం ఉండకూడదని  చెప్పే తన ఆలోచనల వెనక వున్న లోతుల్ని కూడా నేను చూడగలగడం.

ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’లో మియా మాల్కోవా తన నిజాయితీ లోని శక్తితోటి, తన నమ్మకాలపై ఉన్న పట్టుతోటి,  జగదేక  సుందరిలాంటి తన అందమైన ముఖంలోని అమాయకత్వంతోటి ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుంది. మియాలోని అందం మరియు తాత్వికత, నిజాయితీ కలగలిసిన మాటల మూలాన సెక్స్ లోని అన్ని అంశాలు కళ్ళు, మెదడున్న ఎవరికైన స్వచ్ఛంగా, పవిత్రంగా, అందంగా కనిపిస్తాయి.  మియా మాల్కోవా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే బలమైనది . ఎందుకంటే తాను కేవలం అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి దాపరికాల సరిహద్దులన్నీ దాటి హిపోక్రిటికల్ మానవ సమాజంపై  ధ్వజమెత్తి జయించటానికి  నడుం కట్టుకుంది.

ఏ మాత్రం కల్తీలేని ఆనందాన్ని ఎన్నో లక్షల మంది ప్రజలకి ఇవ్వడంలో మియా మాల్కోవా ఒక చారిటీ క్వీన్. అందుకనే ఆమె ఆలోచనలని అర్థం చేసుకునే బుర్ర వున్న ప్రతి ఒక్కరు ఆమెకు మనసారా కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేస్తారు. పేరుకుపోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్న స్త్రీ నుంచి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడమే ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’  వెనుక ఉన్న ఒక తాత్వికత. ఒక్క మాటలో చెప్పాలంటే, “‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ లో మియా మాల్కోవాని చూసి, విని అర్ధం చేసుకున్న వారందరి మనస్సులో సెక్స్ కి అర్ధమే మారిపోతుంది!! అని వర్మ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement