కార్యకర్తలకు సముచిత స్థానం | Niche for Activists | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు సముచిత స్థానం

Published Sun, May 17 2015 4:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

Niche for Activists

టీడీపీ జిల్లా ఇన్‌చార్జి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

 ఆనందపేట (గుంటూరు) : కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ప్రతి కా ర్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వినుకొండ ఎమ్మెల్జే జి.వి.ఆంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించగా, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులు బలపరుస్తూ తమ మద్దతు ప్రకటించారు.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. జీవీ ఆంజనేయులును  సత్కరించారు.  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపీ లు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, మాజీ మంత్రి జె.ఆర్.పుష్పరాజ్, నాయకులు మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాసయాదవ్, చుక్కా ఏసురత్నం, గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement