వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు వెస్ట్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి పై నియమించిన న్యాయ విచారణ కమిటీ నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. స్థానిక ఇ న్‌స్పెక్షన్ బంగళాలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడే వారిని వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా, వారిని రైతులు నమ్మరని తెలిపారు. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. పుష్కరాలలో అధికార యంత్రాంగం సేవలను మంత్రి కొనియాడారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చిట్టిబాబు, జీడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిషితేశ్వరి కేసులో నిందితులను ఉపేక్షించం
Published Tue, Jul 28 2015 1:30 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM