risitesvari
-
నవంబర్‌లో ‘పోలీసు’ నోటిఫికేషన్!
5 కి.మీ. పరుగుకు స్వస్తి.. ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు: డీజీపీ చిత్తూరు అర్బన్/ తిరుపతి క్రైం/ సాక్షి,తిరుమల : పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని డీజీపీ జేవీ.రాముడు తెలిపారు. శనివారం ఆయన చిత్తూరు, తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పోలీసుశాఖలో 5 కి.మీ. పరుగును రద్దు చేసి, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. అభ్యర్థుల శారీరక సామర్థ్యంతో పనిలేకుండా వారి ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు నిర్వహిస్తామన్నారు. హోంగార్డులకు జీతాలు పెంచుతామని, మెడికల్ అలవెన్స్ మొదలగు వాటి గురించి ప్రతిపాదనలు పెట్టామన్నారు. నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ప్రిన్సిపల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయలేదని చిత్తూరులో విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిచ్చారు. ‘ఎవరో ఏదో మాట్లాడితే అరెస్టు చేయలేం. రిషితేశ్వరి మృతిలో ప్రిన్సిపల్ ప్రమేయం ఉందని ఎవరివద్దయినా ఆధారాలున్నాయా..? ’ అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎంతటివారైనా నేరం రుజువైతే శిక్ష తప్పదన్నారు. కాగా శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. -
ప్రాణస్నేహం
ఆత్మహత్య ఆపడానికి ఒక్క ఫ్రెండూ ఉండడు... కాటికి మోసుకెళ్లడానికి నలుగురు అవసరమా? స్నేహం చెయ్యాల్సింది బాటలో ముళ్లు తీయడానికి... అంతిమయాత్రలో పూలు చల్లడానికి కాదు! స్నేహం నిలబడాల్సింది భారం మోయడానికి... కాయాన్ని మోయడానికి కాదు! స్నేహం కావల్సింది కన్నీటిని తుడవడానికి... నీటి కుండ పగలేయడానికి కాదు! స్నేహం ఉండాల్సింది జీవాగ్ని నింపడానికి... చితికి మంట పెట్టడానికి కాదు! వృథా... వృథా... వృథా... స్నేహం వృథా... ఫ్రెండ్ ప్రాణం కాపాడలేని స్నేహం వ్యథ! ఏడవకండి... ఏడుస్తూ కూర్చోకండి. మీ స్నేహంలో దమ్ముంటే... స్నేహం ప్రాణాన్ని నిలబెట్టండి. ఆత్మీయ స్నేహితుల్లారా... ఆత్మహత్యల్ని ఆపండి. ఎదుటి వారి మాటలను మనం ఎప్పుడైనా వింటున్నామా..? కనీసం ‘ప్రాణ’స్నేహితుల్ల మాటలను మనసుపెట్టి ఆలకిస్తున్నామా..? గజి‘బిజీ‘ జీవితాలతో గిడసబారిపోయి, మనం వినే అలవాటును ఎప్పుడో పోగొట్టుకున్నాం. బతుకుపోరు సాగించలేని ప్రాణస్నేహితులు... జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకున్నాక... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిండు జీవితమే ముగిసిపోయాక వగచి విలపిస్తున్నాం. అలా కాకుండా, నిరాశలో కూరుకుపోయిన మిత్రుల మాటలను కాస్త ఓపికగా విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగేవా? ఒక రవళి, ఒక రిషితేశ్వరి, ఒక నందిని, ఒక మనీషా... ఇంకా ఇలాంటి చాలామంది...అర్ధంతరంగా తమ బతుకుకు చరమగీతం పాడేవారా..? మొన్న కడప నారాయణ కాలేజీలో నందిని, మనీషాలు, అటుమొన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, నిన్న నెల్లూరు డిగ్రీ కాలేజీలో రవళి... ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు... ఈ ఏడాది ఇప్పటివరకు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పదకొండు మంది ఒక విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లోని విద్యార్థులే! తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక... ఒకవేళ చెప్పుకుందామని ఆశగా ప్రయత్నించినా, వినేవాళ్లు ఎవరూ లేక... ఒంటరిపక్షుల్లా అల్లాడి అల్లాడి... చాలామంది నిరాశలో కూరుకుపోయి, అర్ధంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారు. అనర్థాలు జరిగిపోయాక అందరూ తీరికగా ఆవేదన చెందుతున్నారు. మిత్రుల బలవన్మరణాలను జీర్ణించుకోలేక. ఆవేశంతో బంద్‌లు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిత్రుల మరణాలను మరవలేకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయతతో కాలగమనంలో పడి కొట్టుకుపోతున్నారు. మనసుపెట్టి గమనించండి ‘ప్రాణ’స్నేహితులుగా ఉండేవారు మనసుపెట్టి గమనిస్తే, తమ స్నేహితుల్లోని ఆత్మహత్యా ధోరణులను ముందుగానే కనిపెట్టి జాగ్రత్తపడవచ్చు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయిన వారు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మనోవేదనను అనుభవించేవారు, ర్యాగింగ్ వంటి వేధింపుల కారణంగా మనస్తాపం చెందిన వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. వాళ్లలో కొందరు ఇదివరకు ఆత్మహత్యకు విఫలయత్నాలు చేసిన వారూ ఉండే ఉంటారు. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఒంటరిగా కుమిలిపోతున్న వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ల పట్ల కాస్త శ్రద్ధపెట్టండి. ఒంటరిగా మిగిలిపోయామని భావించి, బాధపడుతున్న వారికి ఆసరాగా ఉన్నామంటూ భరోసా ఇవ్వండి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. బతుకుపోరులో తోడుగా మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పి, వాళ్లకు బతుకు మీద ఆశ కల్పించండి. ఈ కాస్త మిత్రధర్మాన్ని పాటించినట్లయితే, మీరు మీ మిత్రుల నిండుప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. మీ మిత్రుల్లో డేంజర్ సిగ్నల్స్ ఏవి కనిపించినా, వెంటనే అలెర్ట్ కావాల్సిందే. అలాంటి మిత్రుల వద్ద ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు మళ్లించడానికి, ధైర్యం చెప్పడానికి మీ వంతు ప్రయత్నాలు చేయడంతో పాటు, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారికి నిపుణుల సలహా సూచనలు అందేలా సాయం చేయడం మీ మిత్రధర్మంగా గుర్తెరగండి. అవసరమైతే ఢిల్లీలోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్- 88888 17666, హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థ 040-27848584, 66202000. ముంబైలోని ఆస్రా స్వచ్ఛంద సంస్థ 91-22-27546669 నంబర్లకు సంప్రదించి, సలహా సూచనలు కోరండి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: మోపూరు బాలకృష్ణారెడ్డి, సాక్షి, కడప పోలు అశోక్ కుమార్, సాక్షి, నెల్లూరు, సాక్షి ఇవీ... డేంజర్ సిగ్నల్స్ ఆత్మహత్యలకు సిద్ధపడే వారు ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. వాటిని గుర్తించి, సకాలంలో అలర్ట్ అయితే చాలు... నిండుప్రాణాలు బలికాకుండా కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఆత్మహత్యలకు సిద్ధపడేవారు ఇచ్చే కొన్ని ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్... తిండి, నిద్ర అలవాట్లలో విపరీతమైన మార్పులు కనపరుస్తారు. నిత్యం ఉల్లాసంగా ఉండేవారు అకస్మాత్తుగా ముభావంగా మారిపోతారు. లేదంటే, ఎప్పుడు మౌనంగా ఉండేవారు హఠాత్తుగా ఉత్సాహం ఉరకలేస్తూ కనిపిస్తారు. మిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరదూరంగా ఉంటారు. కొందరు హింసాత్మక ధోరణిని కూడా ప్రదర్శిస్తారు. ఏకాగ్రత లోపంతో కనిపిస్తారు. తరచు కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉన్నట్లు చెబుతారు. కత్తి, బ్లేడు, తాడు, విషం, నిద్రమాత్రలు... వంటి ఆత్మహత్యా సాధనాల గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆత్మహత్యా పద్ధతుల గురించి చదవడం వంటివి చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉంటారు. ఏ పని మీదా ఆసక్తి చూపరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు.అపరాధ భావనలో ఉంటారు. ‘నాకు బతికే అర్హత లేదు’, ‘నన్ను పట్టించుకునే వారే లేరు’, ‘ఈ జీవితంతో విసిగిపోయాను’... అంటూ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడే వెళ్లి ఉంటే... రవళిది, మాది ఒకే ఊరు. ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ‘హాస్టల్లో ఉండలేకపోతున్నాను. మా నాన్నకు ఫోన్‌చేసి రమ్మంటాను. రాగానే ఇంటికి వెళ్లిపోతాను’ అని చెప్పింది. బట్టలు కూడా బ్యాగులో సర్దుకుంది. గురువారం ఎప్పట్లాగే క్లాసుకు బయల్దేరాం. కిందకు రాగానే ‘నోట్స్ మర్చిపోయాను’ అంటూ తన బుక్స్ నా చేతికిచ్చి, మేడమీద గదిలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో మేం క్లాస్‌కు బయల్దేరాం. రవళి బుక్స్‌ను ఆమె క్లాస్‌రూమ్‌లో ఇచ్చి వెళ్లాం. కొంతసేపటి తర్వాత రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అప్పుడే అనుమానించి, మేమూ రూమ్‌కి వెళ్లి ఉంటే ఆమె బతికేదనిపిస్తోంది. - ఎర్రబల్లి గంగాభవాని, రాపూరు మండలం,పెనుబర్తి, నెల్లూరు తెలుసుకోలేకపోయాం... మేమిద్దరం ఒకే ఊరు వాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే హాస్టల్లో ఉండటంతో నాతో చనువుగానే ఉండేది. అయితే, తన కష్టమేంటో ఎప్పుడూ చెప్పేది కాదు. నేనూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను మా మధ్య లేదంటే బాధగా ఉంది. - మాదమాల శ్రీలక్ష్మి, రాపూరు మండలం, పెనుబర్తి మంచి స్నేహితులు... మాకు ఇక్కడ మార్కులు ఆధారంగా సెక్షన్స్ కేటాయిస్తారు. తక్కువ మార్కులు వస్తే అటు పేరెంట్స్ నుంచి, ఇటు కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పటి వరకూ మేం మా పేరెంట్స్ వద్దే పెరిగి ఒక్కసారిగా హాస్టల్ పరిస్థితులకు అలవాటు కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో త్వరగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాం. అదే విషయాన్ని కొన్ని సార్లు మనీషా, నందిని మాటల్లోనూ దొర్లాయి. మేమంత సీరియస్ తీసుకోలేదు. మంచి స్నేహితులు దూరమైపోయారు. - జి.గీతారెడ్డి, ద్వితీయ సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఊహించలేదు.. మనీషా, నందిని ఇద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హుషారుగా ఉండేవారు. హాస్టల్లోని మిగతావారితోనూ బాగా మాట్లాడేవారు. అలాంటి వారు ఒక్కసారిగా చనిపోయారంటే చాలా భయపడ్డాం. కళాశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువే. బాగా ఒత్తిడి ఉంటుంది. అమ్మనాన్నలు ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ ఒత్తిడి గురించి మా మాటల్లో దొర్లినా ఇదంతా మామూలేకదా అనుకున్నాం. కానీ, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. - పి.శివబిందు, మొదటి సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఒక్క ఆత్మహత్య ఆపడానికి ఎంతోమంది స్నేహితులు కావాలి. ఉన్న స్నేహితులే కాదు... తల్లిదండ్రులూ స్నేహితులు కావాలి. గురువులూ స్నేహితులు కావాలి.ఇరుగు పొరుగు వారూ స్నేహితులు కావాలి. నాయకుడనేవాడూ స్నేహితుడు కావాలి. కాపాడగలవారందరూ స్నేహితులు కావాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం. కడపలో ఆత్మహత్య చేసుకున్న కాలేజీ స్టూడెంట్ (మనీషా) తల్లిని ఓదార్చుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి (ఫైల్‌ఫొటో) -
నేడు ర్యాగింగ్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం
♦ సమాజంలో మార్పు కోసం సాక్షి, సాక్షి టీవీ ప్రయత్నం ♦ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించే అవకాశం సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ర్యాగింగ్ సంఘటనలు వరసగా జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మానసిక ఎదుగుదల లేక కొందరు, చట్టాలపై అవగాహన లేక మరికొందరు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువై ఇంకొందరు.. ర్యాగింగ్‌కు పాల్పడుతూ ఎదుటివారి జీవితాలతోపాటు తమ జీవితాలనూ బలి చేసు కొంటున్నారు. దీనికి జిల్లాలో ఇటీవల జరిగిన విద్యార్థినులు రిషితేశ్వరి, సునీత ఘటనలే ప్రత్యక్ష ఉదహరణలు. ర్యాగింగ్ మహమ్మారికి రిషితేశ్వరి బలై తల్లిదండ్రులకు కడుపుకోతను మిగల్చగా.. తానే ర్యాగింగ్‌కు పాల్పడి ప్రిన్సిపల్ మందలించారనే మనస్థాపంతో సునీత బలవన్మరణానికి పాల్పడి తన తల్లిని ఒంటరిని చేసింది. ర్యాగింగ్‌కు ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇద్దరు విద్యార్థినులు బలికాగా, మరో ముగ్గురు కటకటాల పాలై తమ జీవితాలను అంధకారం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తన వంతుగా ‘సాక్షి’ స్పందించింది.ర్యాగింగ్‌పై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, సమాజంలో కూడా మార్పు రావాలనే తలంపుతో సాక్షి, సాక్షి టీవీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాగింగ్‌పై రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నది. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి సారధ్యంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరుగుతుంది. గుంటూరు రూరల్ సీసీఎస్ ఏఎస్పీ శోభామంజరి, ఏఎన్‌యూ మాజీ వీసీ వియన్నరావు, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే), జీజీహెచ్ మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణ, పీడీఎస్ఓ రాష్ట్ర కమిటీ నాయకురాలు వెన్నెల, ఐద్వా నాయకురాలు వరలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు, అన్ని వర్గాల ఔత్సాహికులు హాజరై తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. -
నిర్లక్ష్యమే నిజం!
ఏఎన్‌యూ : ‘యూనివర్సిటీ కళాశాలలు, వసతి గృహాల్లో పరిస్థితులపై పలుమార్లు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే రిషితేశ్వరి మరణానికి కారణమైంది..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం ఆరోపించింది. తప్పులు చేసిన కొందరిని రక్షించేందుకు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులు వర్సిటీ వ్యవస్థను, సమాజాన్ని బదనాం చేస్తున్నారని మండిపడింది. రిషితేశ్వరి మృతి ఘటనలో వాస్తవాలు వెలికి తీసేందుకు ఆ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులతో కూడిన బృందం గురువారం ఏఎన్‌యూలో పర్యటించింది. పరిపాలనా భవన్‌లోని వీసీ కార్యాలయంలో ఇన్చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌తో వైఎస్సార్ సీపీ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆర్కే రోజా, కె.పార్థసారధి మాట్లాడుతూ వర్సిటీలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మృతురాలు రాసుకున్న డైరీ చదివితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. డైరీ మొత్తాన్ని యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారం ప్రిన్సిపాల్‌ను ఎందుకు అరెస్టు చేయించలేదని మండిపడ్డారు. ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. వర్సిటీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రిషితేశ్వరి ఘటనలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ తప్పులు ఉన్నాయని ఆయన్నెందుకు ఏ1 ముద్దాయిగా చేర్చలేదని ప్రశ్నించారు. బాపట్ల, మాచర్ల ఎమ్మెల్యేలు కోనరఘపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థిని మృతికి కారకులైన వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిం చటం దురదృష్టకరమన్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ బాబురావు అరాచకాలను ప్రశ్నించినందుకే దళిత అధ్యాపకుడు డేవిడ్‌రాజును విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అధికారులు కులాలవారీగా వివక్ష కనబరచటం సరికాదన్నారు. ఏఎన్‌యూ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ ఆచార్య సి.రాంబాబును విచారణకు సంబంధించిన పలు అంశాలపై వైఎస్సార్ సీపీ బృందం ప్రశ్నించింది. విద్యార్థులకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని చూపాలని డిమాండ్ చేశారు. ఆయన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని తెప్పించి వైఎస్సార్ సీపీ బృందానికి ఇచ్చారు. బృందం పట్టు వీడక పోవటంతో రిషితేశ్వరి మృతికి పరోక్షంగా కారణమైన బాబురావుపై యాంటీ ర్యాగింగ్ చట్టం కింద చర్యలు తీసు కోవాలని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అందరి సమక్షంలో లేఖ రాశారు. అనంతరం రోజా, వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు యూనివర్సిటీలోని బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థినులతో చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తఫా, ఉప్పలేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప అప్పారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, కళావతి, పుష్పశ్రీవాణి, రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల నియోకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్ సీపీ యువజన, మహిళా, విద్యార్థి, మైనార్టీ, ఎస్టీ విభాగాల జిల్లా అధ్యక్షులు కావటి మనోహర్ నాయుడు, యేళ్ల జయలక్ష్మి, పానుగంటి చైతన్య, సయ్యద్‌మాబు, మొగిలి మధు, వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవెళ్ల రేవతి, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కత్తెర సురేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై ధ్వజం.. సాక్షి, గుంటూరు : అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ ఎంఎల్ఏ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కనీసం వర్సిటీకి వచ్చి రిషితేశ్వరి వ్యవహారంపై ఆరా తీయలేదంటే టీడీపీ నేతలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. హోం శాఖ నిద్ర పోతోందని ఆరోపించారు. బాబు పవర్ తన వద్ద పెట్టుకుని పదవి చిన్నరాజప్పకు ఇచ్చారనారు. కఠినంగా శిక్షించాలి.. ప్రిన్సిపాల్ బాబురావు లాంటి వ్యక్తుల వల్ల విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు యూనివర్సిటీ విలువలు దిగజారుతున్నాయి. ప్రెషర్స్‌డే పార్టీని యూనివర్సిటీలో కాకుండా హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసి మందేసి, చిందు వేయించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లనే రిషితేశ్వరి మృతి చెందింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలి. - కొలుసు పార్థసారధి, మాజీమంత్రి ప్రిన్సిపాల్‌పై చర్యలేవీ.. కళాశాల ప్రారంభమైన నెల రోజుల్లో ప్రెషర్స్ డే ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఐదు నెలల తర్వాత ఎక్కడో బయట ఏర్పాటు చేసి చిందులు వేస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , ఎమ్మెల్సీ నివేదిక దారుణం.. రిషితేశ్వరి డైరీలోని పేజీలన్నీ మీడియాలో ప్రదర్శించినప్పటికీ వర్సిటీ నిజనిర్ధారణ కమిటీ దాన్ని చూడకుండా నివేదిక ఇవ్వడం దారుణం. - వంగవీటి రాధా, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాలున్నాయి.. బాబురావు తప్పు చేశాడని నిర్ధారించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కలుగుతున్నాయి. - గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎంఎల్ఏ -
ర్యాగింగ్‌ను నిరోధిద్దాం
జడలు విప్పుతున్న భూతం ఆందోళనలో తల్లిదండ్రులు కట్టడిలో కళాశాలల పాత్ర కీలకం త్వరలో ఇంజినీరింగ్ కాలేజీలు షురూ.. పరిచయ కార్యక్రమాలు పక్కదారి పడుతున్నారుు.. అండగా ఉండాల్సిన వారే అఘాతంలోకి తోస్తున్నారు. వికృతక్రీడతో విషాన్ని చిమ్ముతున్నారు. ఇలా.. విద్యా సమూపార్జన దశలో కొందరు విగతజీవులవుతున్నారు. అవమానభారంతో చనిపోయే విద్యార్థి ప్రాణాన్ని కోల్పోతుండగా, దీనికి బాధ్యులు ఉజ్వల భవిష్యత్‌ను పణంగా పెట్టాల్సివస్తోంది. ర్యాగింగ్ భూతం దుష్పరిణామాలివీ. మొన్న హన్మకొండకు చెందిన రిషితేశ్వరి నాగార్జున యూనివర్సిటీలో బలవన్మరణం.. నెల్లూరులో ఇంటర్ విద్యార్థి కె. మధువర్ధన్‌రెడ్డి మృతి నేపథ్యంలో అందరూ గుణపాఠాలు నేర్చుకోవాలి. పోచమ్మమైదాన్: మొదట్లో కళాశాలలకు కొత్తగా వచ్చే విద్యార్థులను సీనియర్లు పరిచయం చేసుకునేందుకు ఫ్రెషర్స్ పార్టీలు జరిగేవి. ఇవి రానురాను ర్యాగింగ్‌గా మారారుు. కొందరి వ్యవహార శైలి అందరికీ చేటు తెస్తోంది. సామరస్య పూర్వక వాతావరణంలో జరగాల్సిన పరిచయ కార్యక్రమాలు రాత్రివేళల్లో గదుల్లో.. అమాయకులను భయపెట్టేలా, బాధపెట్టేలా వికృతరూపం దాల్చుతున్నారుు. ఈ కారణంగా పలువురు ఆత్మన్యూనతభావంతో కళాశాలలను వీడుతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ నెల 6న ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉంది. మరేం చేయాలి? కళాశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పుడే యాంటీ ర్యాగింగ్ కమిటీలను నియమించాలి. ఇందులో అధ్యాపకులతో పాటు సీనియర్లు, జూనియర్ విద్యార్థులను భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుంది. ర్యాగింగ్ చేస్తే విధించే జరిమానా, పడే శిక్షలు, విద్యాసంవత్సరం నష్టపోయే తీరు.. తల్లిదండ్రులకు కలిగే దుఖం తదితర అంశాలు అందరికీ తెలిసేలా తరగతి గదులు, హాస్టళ్ల ఆవరణల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి. పోలీసు అధికారులు, మానసిక నిపుణులు, గతంలో ర్యాగింగ్ వల్ల నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పలు సమావేశాల్లో చెప్పించాలి. విద్యార్థులు కళాశాలలో చేరినప్పుడే స్టాంప్ పేపర్‌పై బాండ్లు రాయించుకోవాలి. ర్యాగింగ్ బాధ్యులుగా తేలితే ఫీజు వాపస్ ఇవ్వబోమని, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేయూలి. కళాశాల నుంచి డిబార్ తదితర చర్యలు తీసుకున్నా ఒప్పుకుంటామని తల్లిదండ్రులు, విద్యార్థులతో సంతకాలు చేయించుకుంటే కొంత వరకు కట్టడి చేయొచ్చు. ఈ విధానాన్ని నగరంలోని చాలా కళాశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లోనే మార్పు రావాలి తాము గతంలో జూనియర్లమేననే స్పృహ సీనియర్లకు ఉండాలి. తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వారసత్వంగా జూనియర్లకు ఆపాదించొద్దు. అజమారుుషీకి ప్రయత్నించొద్దు. పెద్ద మనిషి తరహాలో, మార్గదర్శిగా మాత్రే ఉంటేనే హుందాతనం. ఎక్కువగా మహిళ హాస్టళ్లలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ మాత్రం క్షేమకరం కాదు. ఇబ్బంది ఎదురైతే.. ర్యాగింగ్‌కు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాంపస్‌లో కానీ హాస్టళ్లలో కానీ ఒంటరిగా కాకుండా తోటి వారితో కలిసి ఉండాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు లేదా తల్లిదండ్రులకు సమాచారమివ్వాలి. ప్రతి కళాశాలలో సమీప పోలీస్ స్టేషన్ వారు హెల్ప్‌లైన్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి. నిత్యం అందులో విద్యార్థులు వేసే విజ్ఞాపన పత్రాలను పరిశీలించాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందడమేనా? ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు పెరిగిపోవడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందడమూ కారణమని పలువురి అభిప్రాయం. ఇప్పుడంతా ఇంటర్నెట్ హల్చల్ చేస్తున్న రోజులు. ర్యాగింగ్ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి సామాజిక వెబ్సైట్లలోకి పంపడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యా సంస్థల బాధ్యత విద్యా సంస్థలలో తెలంగాణ ప్రొబిషన్ యాక్ట్ 1997/26 ప్రకారం కి ంది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.విద్యాసంస్థలో ఏ రూపంలో ర్యాగింగ్ జరిగినట్లు దృష్టికి వస్తే విస్మరించొద్దు. ర్యాగింగ్ చేస్తూ దొరికిన,ర్యాగింగ్‌ను ప్రో త్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. యూజమాన్యం వారు ఆడియో విజువల్ ద్వారా ర్యాగింగ్ నిషేధిత, బాధ్యులపై తీసుకునే చర్యలను ప్రసారం చేయూలి. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో సీనియర్లు, జూనియర్లు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌ను చేర్చాలి. వారి ఫోన్ నంబర్లు, సమీప ఠాణా సీఐ, ఎస్సై ఫోన్ నంబర్లు రాసి ఉంచాలి.అడ్మిషన్ తీసుకునే సమయంలోనే విద్యార్థితో వాంగ్మూల పత్రం తీసుకోవాలి. మరోక వాంగ్ముల పత్రం తల్లితండ్రుల నుంచి సైతం తీసుకోవాలి. విద్యార్థి ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారమివ్వాలి. ర్యాగింగ్ చేస్తే శిక్షలు తోటి విద్యార్థిని వేధించినా, ఆత్మన్యూనతకు గురిచే సినా ఆర్నెల్ల జైలు, రూ. వెరుు్య జరిమానా.దాడి , క్రిమినల్ చర్యలకు ఏడాది జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా.అక్రమ నిర్బంధం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా. తీవ్రంగా గాయపరచడం, లైంగికదాడి, కిడ్నాప్ వంటి అసాధారణ చర్యలకు పాల్పడితే ఐదేళ్ల జైలు, రూ. 10 వేల జరిమానా. హత్య చే సినా, ఆత్మహత్యకు పురిగొల్పినా పదేళ్ల జైలు, రూ. 50 వేల వరకు జరిమానా. రెండూ విధించవచ్చు. అకడమిక్ చర్యలు చట్టం నిర్దేశించిన శిక్షలే కాదు.. మరికొన్ని శిక్షలూ పడతారుు.ర్యాగింగ్ చేసిన విద్యార్థి తరగతులకు రానివ్వకుండా నిషేధించాలి. అడ్మిషన్ రద్దు చేయాలి. బాధ్యుడు పరీక్ష రాసి ఉంటే ఫలితాలను ఆపివేయాలి. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం వరంగల్‌లోని అన్ని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, మెడికల్ కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ర్యాగింగ్ చేస్తే తీసుకునే చర్యల తీవ్రత ఏ స్థారుులో ఉంటుందో సీనియర్ విద్యార్థులకు వివరిస్తాం. ఆయూ కళాశాలల్లో ర్యాగింగ్ వ్యతిరేక బ్యానర్లు కట్టిస్తాం. కుటుంబం నుంచే విద్యార్థులపై ర్యాగింగ్ వ్యతిరేక భావన అలవర్చాలి. -సురేంద్రనాథ్, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీనియర్లకు అవగాహన కల్పిస్తున్నాం ఏటా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్ చేస్తే ఊరుకునేది లేదు. తరచూ సీనియర్లకు ఈ మేరకు అవగహన కల్పిస్తున్నాం. త్వరలో మా కళాశాలకు జూనియర్లు రానున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే సీనియర్లను మోటివేట్ చేస్తున్నాం. కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా చుస్తున్నాం. -డాక్టర్ శ్యామల, అనంతలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల కఠినంగా శిక్షించాలి ర్యాగింగ్ చేస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారినైనా కఠినంగా శిక్షించాలి. కళాశాలల యూజమాన్యాలు ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలి. పోలీసులు సైతం నిఘా పెట్టాలి. విద్యార్థులకు అవగహన సదస్సులు ఏర్పాటు చేయాలి. పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు కదా! -కూనురు శ్రీమతి- శేఖర్ గౌడ్ ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి ర్యాగింగ్ భూతాన్ని విద్యార్థులు తరిమికొట్టాలి. కేయూలో క్యాష్(కమిటీ అగెనెస్ట్ సెక్స్‌వల్ హరాస్మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలి. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి అందులో విద్యార్థులు, అధ్యాపకులను, విద్యార్థి సంఘాలను సభ్యులుగా చేర్చాలి. కళాశాలల యూజమాన్యాలు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేయూలి. - చిలువేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అలాంటి వారితో జాగ్రత్త విద్యార్థుల్లో 3 నుంచి 5 శాతం మంది సంఘ వ్యతిరేక విధానాలకు పాల్పడే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారే ర్యాగింగ్‌కు పాల్పడుతుంటారు. యుక్త వయస్సులో కీజోఫియా అనే వ్యాధి కూడా వీరిని అలా ప్రేరేపిస్తుంది. వీళ్లు వ్యక్తిత్వం, సంబంధాలను అర్థం చేసుకోలేరు. కొత్త ఫ్రెండ్స్‌ను పరిచయం చేసుకోలేరు. మద్యం, డ్రగ్స్‌కు బానిసవుతారు. ఇలాంటి వారితో జూనియర్లు జాగ్రత్తగా ఉండాలి. -డాక్టర్ యైశ్రీధర్ రాజు, సైక్రియూట్రిస్టు -
బాబు ముఖం చాటేస్తున్నారెందుకు?
రిషితేశ్వరి మరణంపై రోజా ప్రశ్న మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో ఆదుకుంటామన్నారుగా.. ఇపుడు నోరెందుకు మెదపలేదు? హైదరాబాద్: ప్రతిదానికీ మీడియా ముందుకొచ్చి ప్రచారంకోసం తాపత్రయపడే ఏపీ సీఎం చంద్రబాబు నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి విషయంలో ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా నిలదీ శారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థిని ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడాల్సిందిపోయి నిందితులైన విద్యార్థులకు అధికారపక్షం అండగా ఉందన్నారు. మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో వచ్చి ఆదుకుంటామని ఎన్నికల ముందు బాబు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని, అలాంటిదిపుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నిం చారు. రిషితేశ్వరి కేసులో నిందితుల్ని శిక్షించేలా చర్యలు తీసుకునేలా కోరడానికి ఆమె తల్లిదండ్రులు ఏపీ సీఎం వద్దకు వెళితే ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. న్యాయం చేయాలని కోరుతూ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవడానికి వెళ్లిన విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం దారుణమన్నారు. అసలిలాంటి విద్యా మంత్రి, సీఎం రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వర్సిటీకి వెళ్లిన విచారణ కమిటీ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడిస్తున్నారని ఆమె తప్పుపట్టారు. అక్కడ వ్యవహారమంతా కులాల కుంపటిగా చేశారని దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిని నిందితులుగా చేశారని, వాస్తవానికి వర్సిటీ వైస్‌చాన్సలర్‌ను తొలి ముద్దాయిగా, ప్రిన్సిపల్‌ను రెండో ముద్దాయిగా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోరాడుతున్న మహిళాసంఘాలు, విద్యార్థులపై టీడీపీ మద్దతుదారులు దాడులు చేసి ఉద్రిక్తతలకు కారణమైనందునే ఆ పార్టీ ప్రమేయముందని తాము చెబుతున్నామన్నారు. ర్యాగింగ్‌ను నివారించడానికి 2009, మే 8న సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిందని, వాటిని వర్సిటీ అధికారులు పాటించలేదన్నారు. నిజనిర్ధారణ చేసి రిషితేశ్వరి కుటుంబం తరఫున పోరాడేందుకు వైఎస్సార్సీపీ మహిళా, విద్యార్థి విభాగం, ఎమ్మెల్యేలు ఆగస్టు 6న నాగార్జున వర్సిటీకి వెళుతున్నామని వెల్లడించారు. జర్నలిజానికే మచ్చ..: పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన అనని మాటల్ని అన్నట్లుగా ఓ పత్రిక రాయడం జర్నలిజానికే మచ్చని రోజా దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణ వంటి అంశాల్ని చర్చించాంగానీ ఆ పత్రికలో రాసినట్లుగా మరే చర్చా జరగలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ హైదరాబాద్: నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై నిగ్గు తేల్చడానికి వైఎస్సార్సీపీ ఆరుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కె.పార్థసారథి, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్.కె.రోజా, మేరుగు నాగార్జున, వంగవీటి రాధాకృష్ణ, గొట్టిపాటి రవికుమార్ ఇందులో ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ప్రిన్సిపల్, ఇతర నిందితుల ప్రమేయం, కులవివక్ష, దర్యాప్తులో ప్రభుత్వ వైఫల్యం, వర్సిటీలో బోధన సిబ్బంది కొరత తదితర అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరిపి పార్టీ అధ్యక్షునికి నివేదిక సమర్పిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
'కీలక సమాచారం సేకరించాం'
-
'కీలక సమాచారం సేకరించాం'
గుంటూరు: ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సమాచారం సేకరిస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం యూనివర్సిటీ లో విచారణ ప్రారంభించింది. ఈ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశం అయింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విచారణను అవసరమైతే మరో 2 రెండు రోజులు పొడిగించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు.బుధవారం అధికారులతో మాట్లాడినపుడు కొంత కీలక సమాచారం సేకరించామన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రిషతేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చన్నారు. కాగా రెండోరోజు జరుగుతున్న విచారణకు పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి...విద్యార్థులు ఎవరూ లేకుండానే విచారణ పేరుతో అధికారులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని విద్యార్థి సంఘాలు విచారణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. -
‘‘నాన్నా ప్లీజ్ ఏడవకండి!’’
పోగొట్టుకున్న ఈ బంగారుతల్లి కోసం మనం... పోరాటం చేయలేమా! ► పువ్వులా, అప్పుడే విరిసిన హరివిల్లులా సప్త వర్ణాలను విరజిమ్మే నవ్వును హత్య చేశారు! ► విశ్వవిద్యాలయం అంటే సరస్వతి గుడి, చదువుల ఒడి అనే నమ్మకాన్ని హత్య చేశారు! ► ఆచార్యులు అంటే విద్యాబుద్దులనే కాదు, జాగ్రత్తల్నీ చెప్తారనే భరోసాను హత్య చేశారు! ► సీనియర్లంతా జూనియర్లను చేరదీసి, స్నేహం కలుపుకుంటారనే ఆశను హత్య చేశారు! ► క్యాంపస్‌లో, క్యాంటీన్లో, హాస్టల్లో స్నేహం గుబాళిస్తుందన్న అమాయకత్వాన్ని హత్య చేశారు! ► ఫ్రెషర్ అనే కైండ్‌నెస్ కూడా లేకుండా ర్యాగింగ్ చేసీ చేసీ మానవత్వాన్ని హత్య చేశారు! ► కనిపెంచిన అమ్మపై, నాన్నపై, చదువుతున్న చదువుపై పెంచుకున్న ప్రేమను హత్య చేశారు! ► బాగా చదివి, అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలన్న ఆశయాన్ని హత్య చేశారు! ► ప్రేమదారిలోకి రానందుకు... తిరిగిరానిలోకాలకు తరలిపోయేలా వ్యక్తిత్వాన్ని హత్య చేశారు! ► కష్టమొస్తే చెప్పుకోలేనంతగా, కన్నీళ్లొస్తే మనసు విప్పుకోలేనంతగా ధైర్యాన్ని హత్య చేశారు! ► యూనివర్శిటీ అంటే నరకం తప్ప ఇంకోటి కాదు అనిపించేలా ఆత్మవిశ్వాసాన్ని హత్య చేశారు! ► ఉసురు తీసుకుంటూ కూడా సీనియర్స్‌ని ఒక్క మాటా అనని మంచితనాన్నీ హత్య చేశారు! ► రిషితేశ్వరిని ఇన్ని విధాలుగా హత్య చేశారు! నవ్వు!!! నవ్వు!!! నవ్వు!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఇలా వచ్చిన నన్ను నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయం అయిపోయేది. ఏడుపు కూడా వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది. చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తుంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తుంది.సీనియర్స్‌లో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్ వీళ్లు చేసిన హెల్ప్స్ నేను ఎప్పటికీ మరిచిపోలేను. నాన్నా వీళ్లకి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్‌లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే... నా చావుకి కారణం ఎవరో వాళ్లకి తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంక ఎవ్వర్నీ ఇలా (నాలా) బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక, వాళ్లకి నరకం కనిపిస్తుంది. అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న ప్లీస్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త డిప్రెషన్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్. ఇట్ మీన్స్ యు స్టేయ్డ్ స్ట్రాంగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ లవ్ యు మామ్. ఐ లవ్ యు డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్... ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్. డాడ్! నేను చేయవలసిన పనులు ఉన్నాయి. కొన్ని మీరు చేసేయండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి. రాజుకి రూ.350 ఇవ్వండి టి స్కేల్‌కి.. ప్రసాద్ సార్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి. బై... ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ర్యాగింగ్ ఉరి బిగించింది! నిర్జీవమైన చదువుల తల్లి రిషితేశ్వరి గళ్ల చొక్కాలో ఉన్న ఆ అమ్మాయి కళ్లు పూర్తిగా మూత పడలేదు. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని, అద్భుతంగా ఉండబోయే తన భవిష్యత్తును దర్శించాలని ఆశ పడుతున్న వాటిలా సగం సగంగా తెరుచుకునే ఉన్నాయి. ముగ్ధంగా అమాయకంగా ఉన్న ముఖం... కన్నవారు అపురూపంగా పెంచుకోవడం వల్ల వచ్చిన లావణ్యమైన రూపం... అవన్నీ జీవాన్ని కోల్పోయి కదలికను మానేసి తమ అచేతన నుంచి ఒక చేతనను లేవదీయడానికి సిద్ధమైనట్టుగా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల విద్యార్థిని రిషితేశ్వరి తను ప్రాణాలు కోల్పోయి... లక్ష ప్రాణాలతో వికటాట్టహాసం చేస్తున్న ఒక దుష్ట సంస్కృతి సంహారానికి పిలుపునిస్తూ ఉంది. దీనిని ఇంతటితో ఆఖరు చేయండి అని విన్నవిస్తూ ఉంది. చనిపోయే చివరి క్షణాలలో కూడా... తనకు అన్యాయం జరిగిందని తెలిసీ కూడా... ఆ పిలుపులో ద్వేషం లేదు. ప్రేమ ఉంది. సంస్కారం ఉంది. మనసులు, మనుషులు మారాలి అన్న కన్సర్న్ ఉంది. రిషితేశ్వరి మరణం ఈ వ్యవస్థను బోనులో నిలబెట్టింది. కుప్ప కూలిన పునాది! ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే నిర్మాణ శాస్త్రం. తన భవిష్యత్తును ఆ చదువుతో నిర్మించుకుందామని నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో చేరింది రిషితేశ్వరి. యూనివర్సిటీ అంటే చదువుల ఆలయం అనీ అక్కడ అందరూ చదువులో నిమగ్నమై ఉంటారని అనుకుంది. కాని మొదటి రోజే చేదు అనుభవం! హాస్టల్లో చేరిన రోజు రాత్రే కొంత మంది అమ్మాయిలు వచ్చి రూమ్ ఖాళీ చేయాలని అన్నారు. ఇది తమ రూమ్ అనీ తెల్లారే సరికల్లా ఖాళీ చేయకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని భయపెట్టారు. ‘వాళ్లు బెదిరించిన రోజే రిషి మాకు ఫోన్ చేస్తే తెల్లారే సరికల్లా వరంగల్ నుంచి గుంటూరు (పెదకాకాని)కి చేరుకున్నా’ అని చెప్పారు తండ్రి మురళీకృష్ణ. ‘ఇక్కడ ప్రిన్సిపాల్ తాము చెప్పిందే చేస్తాడు. స్టూడెంట్స్ తమ వర్గం వారే ఉంటారు. తమని కాదని ఎవరూ ఏమి చేయలేరు అని సీనియర్లు మా అమ్మాయిని భయపెట్టారు’ అని కూడా చెప్పారు. అయితే ఆ తండ్రి అప్రమత్తమైనట్టుగా ఆ యాజమాన్యం అప్రమత్తం కాలేదు. ఇలాంటి ర్యాగింగ్ పద్ధతులను నివారించడానికి ప్రయత్నించలేదు. ‘నేను మౌఖికంగా ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపాల్‌గారు చూస్తామండీ అన్నారు. ఆయన దృష్టిలో చూస్తాను అంటే మీడియాలో రాకుండా చూస్తాను అని అర్థం. లోపల ఏం జరిగినా ఆయనకు పట్టదు. బయట గోల జరక్కుండా మీరు ఏదైనా చేసుకోండి అని ఒక వర్గం విద్యార్థులను ఇతర విద్యార్థుల మీదకు వదిలేసినట్టుగా అనిపించింది’ అని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదనగా అన్నారు. పేరెంట్స్ మీటింగ్ లేదు! ఫ్రెషర్స్ వచ్చాక కాలేజ్‌లో అధికారికంగా ప్రెషర్స్ మీటింగ్ జరగాలి. రిషితేశ్వరి చేరాక అలాంటిదేమీ జరగలేదు. రిషితేశ్వరి చనిపోయాక ప్రిన్సిపాల్ హడావిడిగా కొంతమంది పేరెంట్స్‌నీ టెంపరరీ ఫ్యాకల్టీని పిలిపించి ఏదో అయ్యిందంటే అయ్యింది అనిపించారు. ‘ఆ మీటింగ్ గురించి నాకు చెప్పకపోయినా నేను వెళ్లాను. యూనివర్సిటీలో ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో, మా అమ్మాయి ఎలా ఆ నరకం అనుభవించిందో చెప్పాను. టెంపరరీ ఫ్యాకల్టీ దీనిని ఖండించారు. అయితే నేను పర్మినెంట్ ఫ్యాకల్టీలో ఉన్న ఒక అధ్యాపకుణ్ణి పిలుచుకువస్తే ఆయన నా వాదనను సమర్థించి తన ఉద్యోగం పోయినా సరే రిషితేశ్వరికి న్యాయం జరగాలని అందరి ముందూ ప్రకటించారు. ఆ తర్వాత ఆ అధ్యాపకుణ్ణి టెర్మినేట్ చేసినట్టు పేపర్లో చదివాను. ఇంత దారుణంగా సత్యాన్ని తొక్కేయడం ఎక్కడా చూడలేదు’ అని మురళీకృష్ణ అన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు ఉంది... భోజనానికి లేదు... మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతులకు రిషితేశ్వరి ఒక్కర్తే అమ్మాయి. పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరితో ఎక్కువగా చనువుగా ఉంటారు. అలా రిషితేశ్వరికి తండ్రి దగ్గర చనువు ఎక్కువ. ప్రతిదీ తండ్రితో పంచుకునేది. ఆయన గొంతు వినకుండా ఏ రోజూ రిషితేశ్వరికి గడవలేదు. జూలై 14న ఉదయం కూడా తండ్రికి కాల్ చేసింది. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా... అని చెప్పింది. అవే ఆమె ఆఖరి మాటలు అని తండ్రి ఊహించలేదు. ఆయన ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఒంటిగంట ప్రాంతంలో వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. కూతురి నుంచే. అలా ఎప్పుడూ ఆ టైమ్‌లో రిషితేశ్వరి మెసేజ్ పెట్టి ఎరగలేదు. ఓపెన్ చేస్తే ‘ఐ లవ్ యూ నాన్నా’... అని ఉంది. మరికొద్ది సేపటికే యూనివర్సిటీ నుంచి ఫోన్. రిషితేశ్వరి చనిపోయిందని. రోజూ భోజనానికి మెస్‌లో కనిపించాల్సిన రిషితేశ్వరి కనిపించకపోయేసరికి రూమ్మేట్స్ రూమ్‌కి వెళ్లి చూశారు. అప్పటికే ఆ నిండు ప్రాణం... స్నేహం, సామరస్యం, సమభావన అనే క్షుద్బాధను అనుభవిస్తూ లోకం నుంచి వీడ్కోలు తీసుకుంది. ఏం జరిగింది? ఒక స్నేహితురాలు ఇద్దరు అబ్బాయిలను పరిచయం చేసింది. పరిచయం చేసిన ఆ అబ్బాయిలు ఎప్పుడూ ప్రిన్సిపల్ వెంట కనిపించేవారని తెలుస్తోంది. వారితో స్నేహం రానురాను ఇబ్బందిగా భారంగా మారిందని, ఆ ఒత్తిడి భరించలేకే రిషితేశ్వరి ప్రాణం తీసుకుందని స్నేహితుల ద్వారా తెలుస్తోంది. చివరి క్షణాలు రిషితేశ్వరికి డైరీ రాయడం అలవాటు. ఆమె తనకు నచ్చిన, నచ్చని విషయాలు డైరీ రాసుకుంటుంది. చనిపోయే ముందు కూడా ‘మై లాస్ట్ నోట్స్’ పేరుతో ఆ డైరీలోనే మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ‘నవ్వడం నాకు ఇష్టం. నవ్వుతూ ఉండటం నాకు ఇష్టం’ అని మొదలయ్యే ఆ నోట్... యూనివర్సిటీ జీవితం నరకప్రాయం అయ్యి నవ్వాలంటే భయపడే స్థితికి ఆమె ఎలా చేరుకుందో తెలుపుతోంది. తల్లినీ తండ్రినీ ఉద్దేశిస్తూ వాళ్లేమేం పనులు చేయాలో రాసిన రిషితేశ్వరి... తండ్రి తన ముగ్గురు ప్రాణమిత్రులకు చేయవలసిన సాయాన్ని కూడా తెలిపింది. అయితే ఆమె తన చావుకు కారణమైనవారి పేర్లను రాయలేదు. ‘ఈ పరిస్థితికి కారకులెవరో వారికి నా చావు కనువిప్పు కావాలి’ అని రాసింది. పాఠ్యాంశాలను రాయాల్సిన చేతులు మరణవాంగ్మూలాన్ని రాయాల్సి రావడమే అతి పెద్ద విషాదం. ఆత్మహత్య... కాదు హత్య... ఇది ఆత్మహత్య అని భావిస్తున్నవారు ఎందరున్నారో, హత్య అని అనుమానపడుతున్నవారు కూడా అంతేమంది ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించినవారు అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదనీ, గది ఎత్తునూ, ఫ్యాన్ వేలాడుతున్న ఎత్తునూ పరిశీలిస్తే అంత ఎత్తున ఉన్న ఫ్యాన్‌కు చున్నీని వేలాడగట్టుకోవడం చాలా కష్టమనీ అభిప్రాయపడుతున్నారు. మెడపై చున్నీ నలిగిన గుర్తులు కూడా లేవని చెబుతున్నారు. రిషితేశ్వరి రాసే డైరీ తప్ప ఆమె పుస్తకాలు కూడా అదృశ్యమయ్యాయి. ‘సూసైడ్ నోట్లో ఉన్న రాత మా అమ్మాయిదే. అయితే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’ అని తండ్రి మురళీకృష్ణ అంటున్నారు. ‘హత్య అయినా ఆత్మహత్య అయినా నా కూతురి ప్రాణం పోయింది మాత్రం ర్యాగింగ్ వల్లనే. ముందు అది చావాలి. తర్వాత నా కూతురి చావుకు కారణమైనవారికి శిక్ష పడాలి’ అని ఆయన అన్నారు. ఆ మాట అన్నప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. అయితే అవి పోయిన తన కూతురి కోసం మాత్రమే అనిపించలేదు. ఇప్పుడు చదువుతున్న లక్షలాదిమంది ఆడపిల్లల కోసం కూడా అనిపించాయి. కలిసిన గొంతులు రిషితేశ్వరి మరణం అప్పటికప్పుడు దావానలంలా వ్యాపించలేదు. కార్చిచ్చులా సమస్తాన్ని దహించేయలేదు. కానీ అది మెల్లమెల్లగా రాజుకున్న మహా అగ్నిధారలా ఇవాళ సమస్త సమాజిక అంతరాల్లో ప్రశ్నను లేవదీస్తోంది. ‘ఇవాళ రిషితేశ్వరి... రేపు మన ఇంటి ఆడపిల్లే కావచ్చు’ అనే నినాదంతో ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో విపరీతమైన నిరసన కొనసాగుతూ ఉంది. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ రిషితేశ్వరి మరణానికి జవాబు అడిగేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. - సాక్షి ఫ్యామిలీ టీమ్ మిస్ పర్ఫెక్ట్: ‘‘రిషితేశ్వరి మంచి స్టూడెంట్. తన పనేదో తాను చూసుకొనేది. ప్రతిభ, నిజాయతీ లాంటి గుణాలను ఆమెలో చూసిన సీనియర్లు రిషితేశ్వరికి ఈ ఏడాది ‘మిస్ పర్ఫెక్ట్’ టైటిల్ కూడా ఇచ్చారు.’’ - జి. సాయిదీప, బీఆర్క్ సెకండియర్, రాజమండ్రి ఆ అమ్మాయికి నాన్నే సర్వస్వం: ‘‘రిషితేశ్వరిది ఫ్రెండ్లీ నేచర్. ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ నాన్నకు చెప్పుకొనేది. ఎవర్నీ హర్ట్ చేయదు. ఏదన్నా అంటే, గట్టిగా జవాబిచ్చే ఆమె ఆత్మహత్య చేసుకుందంటే, నమ్మశక్యం కావడం లేదు.’’ - పి. అవినాశ్, బీఆర్క్ థర్డ్ ఇయర్, రాజంపేట చాలా సెన్సిటివ్: ‘‘రిషితేశ్వరి చాలా సెన్సిటివ్. ర్యాగింగ్‌తో ఇబ్బంది పడుతున్నానని మాతో అన్నప్పుడు చాలా సింపుల్‌గా తీసుకున్నాం. ఇలా అవుతుందనుకోలేదు. క్యాంటీన్‌కు వెళ్ళినప్పుడు తాను తినకుండా మా కోసం ఎదురుచూసిన రోజులు గుర్తొస్తున్నాయి.’’ - దుర్గాప్రసాద్, బీఆర్క్ సెకండ్ ఇయర్, కర్లంపూడి భయమే ఈ ప్రభుత్వ సందేశమా? రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ ఉన్నా కేసును అటకెక్కించారు: జగన్ హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లితండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తం చేశారు. బాబుగారూ... ఎక్కడున్నారు? నాడు ఇదే నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో భారీగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నవ్యాంధ్రను నిర్మిస్తానని నారా చంద్రబాబు నాయుడు ప్రతిన చేశారు. నేడు అదే నాగార్జున యూనివర్సిటీలో భవిష్యత్తును నిర్మించుకోడానికి ఆర్కిటెక్చర్ కోర్సులో చేరి, ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషితేశ్వరి మరణంపై స్పందించకపోగా, ఆమె తల్లితండ్రులకు కనీస సానుభూతిని కూడా ప్రకటించలేకపోయారు చంద్రబాబు! ⇔ఆమె డైరీ వెల్లడిస్తున్న గుండెను పిండేసే అంశాలు... రిషితేశ్వరి డైరీ అందరి గుండెలను పిండి వేసే అంశాలను వెల్లడించింది. పోలీసులు ఆ డైరీని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. పాఠకులకు ‘ది హిందూ’ దినపత్రిక ఈ విషయాలను ప్రత్యేకంగా అందించింది. రిషితేశ్వరి రాసిన ప్రకారం విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న పార్టీలో ఫైనల్ ఇయర్ విద్యార్థి మద్యం తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థి ధోరణి ఎంతగా బాధించిందంటే ‘‘అప్పుడే నాకు చచ్చిపోవాలనిపించింది’’ అని ఆమె రాసుకుంది. - ‘ది హిందూ’ కథనం, 25 జూలై 2015 ⇔ఆత్మహత్య కేసుపై ఆగని నిరసనలు... రిషితేశ్వరి ఆత్మహత్యతో సంబంధం ఉందనే ఆరోపణపై కాలేజ్ ప్రిన్సిపాల్ జి. బాబూరావు సస్పెండ్ అయినా క్యాంపస్‌లో నిరసనల వెల్లువ ఆగలేదు.ఆత్మహత్యకు కారకులైన వారి మీద ఇంకా చర్యలు తీసుకోనందుకు యూనివర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ శుక్రవారం నాడు స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు వైస్ చాన్సలర్ చాంబర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్చేస్తేనో.. అతని రాజీనామా అంగీకరిస్తేనో సరిపోదని... ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన అతనిని జైలుకి పంపాలని డిమాండ్ చేశారు. - ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం, 25 జూలై 2015 ⇔ర్యాగింగ్ శక్తులపై నిరసన... ‘‘...నిరసనలు పెరగడంతో, పరిస్థితిని అదుపులో ఉంచడం కోసం నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు పది రోజులు సెలవులు నిర్ణయించారు. ...ర్యాగింగ్ కేసులో నిందితులైన విద్యార్థులనూ, అధికారులనూ కాపాడడం కోసమే తరగతులు రద్దు చేసి, సెలవులు ప్రకటించారని పి.డి.ఎస్.ఒ. రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా, ఎస్.ఎఫ్.ఐ. నాగార్జున యూనివర్సిటీ కమిటీ ప్రెసిడెంట్ డి.ఏసురాజు తదితర నేతలు ఆరోపించారు...’’ - ‘దక్కన్ క్రానికల్’ కథనం, 26 జూలై 2015 ⇔ రిషితేశ్వరి మరణం: ఆత్మహత్యా? హత్యా? ‘‘రిషితేశ్వరి డైరీని బట్టి... సీనియర్లు రెగ్యులర్‌గా రిషితేశ్వరిని హింసించేవారని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ...విద్యార్థుల నుంచి డబ్బులు పోగుచేసి, ప్రిన్సిపాల్ క్రమం తప్పకుండా పార్టీలు నిర్వహిస్తుంటారని యూనివర్సిటీ స్టూడెంట్లు ఆరోపించారు. విద్యార్థినులతో కలసి ప్రిన్సిపాల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాల వీడియోను వారు అందించారు. రిషితేశ్వరి వ్యవహారం గురించి చాలాసార్లు ఆయనకు చెప్పినా, స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు.’’ - ‘మెట్రో ఇండియా’ కథనం, 26 జూలై 2015 విద్యార్థులు లేకుండా విచారణలా? రిషితేశ్వరి చనిపోయాక విద్యార్థులకు పదిరోజులు సెలవులిచ్చి ఆ తరువాత కమిటీలు వేశారు. విద్యార్థులు లేకుండా కమిటీ ఎవరిని విచారిస్తుంది? కళాశాలలు మళ్లీ మొదల య్యాక విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక అందించాలి. గతంలోనూ యూనివర్సిటీలో అనేక కమిటీలేశారు. ఏ కమిటీ ద్వారా సక్రమంగా న్యాయం జరిగిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. - పవన్, ఎస్ఎఫ్ఐ నాయకుడు ప్రిన్సిపాల్‌ను రక్షించే ప్రయత్నం రిషితేశ్వరిది ఆత్మహత్యేనని యూనివర్సిటీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఘటన వెనుక కారణాలను కప్పిపుచ్చేందుకే కమిటీ ఇలా నివేదికలు ఇస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీ ప్రక్షాళన పేరుతో ఈ కేసులో వాస్తవాలు చెబుతున్నవారిని బెదిరిస్తున్నారు. సస్పెండ్ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. - వెన్నెల, విద్యార్థి జేఏసీ నాయకురాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు ప్రభుత్వం నియమించిన కమిటీ తనకు అనుకూల వర్గాల వాదనను విని, అదే ప్రభుత్వానికి నివేదించే కుట్ర జరుగుతోంది. ఈ కమిటీతో మృతురాలికీ, న్యాయం కోసం పోరాడుతున్న స్టూడెంట్స్‌కూ ఎలాంటి న్యాయమూ జరగదు. కమిటీ ముందు ఎవరైనా మాట్లాడుతుంటే వారిని వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయరో చెప్పాలి. బహిరంగంగా న్యాయ విచారణ జరపాలి. - షేక్ బాజీసైదా, విద్యార్థి జేఏసీ కన్వీనర్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నాతోపాటు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించి, క్షుణ్ణంగా విచారణ జరిపి ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రెవెన్యూ, పోలీసు, యూనివర్సిటీ అధికారులతో సమావేశమై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం. - బాలసుబ్రహ్మణ్యం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ -
భయమే ఈ ప్రభుత్వ సందేశమా?
రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ ఉన్నా కేసును అటకెక్కించారు: జగన్ హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తంచేశారు. -
రిషితేశ్వరి కేసులో నిందితులను ఉపేక్షించం
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు వెస్ట్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి పై నియమించిన న్యాయ విచారణ కమిటీ నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. స్థానిక ఇ న్స్పెక్షన్ బంగళాలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడే వారిని వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా, వారిని రైతులు నమ్మరని తెలిపారు. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. పుష్కరాలలో అధికార యంత్రాంగం సేవలను మంత్రి కొనియాడారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చిట్టిబాబు, జీడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి ఉద్యమం
-
ర్యాగింగ్ అంతంతోనే ఆమె ఆత్మకు శాంతి
ఏఎన్‌యూ (గుంటూరు జిల్లా): విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్న ర్యాగింగ్, వేధింపులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వారు భారీ ర్యాలీ నిర్వహించారు. రిషితేశ్వరి ఆత్మహత్యనూ, తమలో ఒకరిగా ఆ విద్యార్థిని గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యార్థి జేఏసీగా ఏర్పడి తరగతులను బహిష్కరించారు. యూనివర్సిటీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, రిషితేశ్వరి మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ర్యాగింగ్‌ను అంతమొందిస్తామని, అలా రిషితేశ్వరికి ఆత్మకు శాంతి కలిగిస్తామని నినదించారు. ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేయాలని, వసతి గృహాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల డిమాండ్ మేరకు వారి వద్దకు వచ్చిన ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ.. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి పూర్తిగా తప్పించామని తెలిపారు. ఘటనపై న్యాయవిచారణ జరపడం, ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయటంపై ప్రభుత్వాన్ని సంప్రదించి వచ్చే సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. దీనికి సంతృప్తి చెందిన విద్యార్థులు వీసీ వీటిపై నిర్ణయం చెప్పిన తరువాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి వెనుదిరిగారు. స్పందించిన న్యాయసేవాసాధికార సంస్థ.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై న్యాయసేవా సాధికార సంస్థ స్పందించింది. సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి ఈ కేసును సుమోటోగా తీసుకొని విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగం ప్రిన్సిపాల్, వార్డెన్లకు నోటీసులు జారీ చేశారు. రిషితేశ్వరి మృతిపై వివరణ ఇచ్చేందుకు వారిద్దరూ ఆగస్టు 1న సంస్థ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిజనిర్ధారణ కమిటీతో మాట్లాడటానికి ఇష్టపడని రిషితేశ్వరి తల్లిదండ్రులు.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై నాగార్జున యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీతో మాట్లాడటానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. కూతురిని కోల్పోయిన ఆవేదనలో ఉన్నవారికి వర్సిటీ కమిటీపై విశ్వాసం లేనట్టుగా తెలుస్తోంది. ఇలాంటి కమిటీలతో ప్రయోజనం ఉండదని తమ కుమార్తె మృతిపై న్యాయ విచారణ జరగాలని వారు కోరుతున్నారు. వర్సిటీ ఏర్పాటు చేసే కమిటీలు నిజాలను నీరుగారుస్తాయి తప్ప వాటితో మరో ప్రయోజనం ఉండదని ఏఎన్‌యూ పోకడలను పరిశీలిస్తున్న వారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.