ప్రతి రైతుకు యూరియా అందించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున
కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో యూ రియా కొరతను అరికట్టి ప్రతి రైతుకు అందేలా చూడాలని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ వి.శ్రీధర్‌ను కోరారు. పలు సొసైటీల అధ్యక్షులు, రైతులతో కలిసి శుక్రవారం ఆయన జేడీని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరతలేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
టీడీపీ వారికి చెందిన సొసైటీలకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని సొసైటీలకు సరఫరా చేసి రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. జేడీఏ శ్రీధర్ మాట్లాడుతూ అన్ని సొసైటీలకు యూరియాను సరఫరా చేస్తామని చెప్పారు. యూరియాను అధిక ధరలకు అమ్మే సొసైటీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.