మళ్లీ పడగ విప్పిన తమ్ముళ్ల వర్గపోరు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. బల్లికురవ మండలం వేమవరంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుడిపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన దాడిలో గాయాలపాలైన వెంకటేశ్వర్లుపై గొట్టిపాటి వర్గీయులు మరోసారి దాడి చేశారు.
తన ఇంటి ముందు బైక్‌పై వెంకటేశ్వర్లు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో గొట్టిపాటి శ్రీను అనే వ్యక్తి మరికొందరితో కలిసి బైక్ పై అక్కడికి వచ్చి దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును వెంటనే గ్రామస్తులు చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.