ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం | rift in prakasam TDP | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం

Published Tue, Apr 26 2016 7:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం

ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం

విజయవాడ: ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. వైఎస్సార్ సీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టీడీపీలో చేరతారన్న వార్తలు కరణం బలరాం వర్గంలో కలకలం రేపాయి. గొట్టిపాటి రవికుమార్ ను బలరాం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

కుమారుడు, అనుచరులతో కలిసి కరణం బలరాం మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. వీరంతా కాసేపట్లో సీఎం చంద్రబాబును కలవనున్నారు. గొట్టిపాటి రవికుమార్ ను పార్టీలోకి తీసుకోవద్దని ఫిర్యాదు చేయనున్నారు. గొట్టిపాటి కుటుంబంతో తమకున్న రాజకీయ విభేదాల గురించి, రాజకీయంగా వ్యతిరేకిస్తున్న గొట్టిపాటిని పార్టీలో చేర్చుకుంటే జిల్లాలో టీడీపీకి ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించారు. ఆయన చేరితే పార్టీకి ఏ రకమైన నష్టం జరుగుతుందో అధినేతకు తెలిపాలని కరణం బలరాం భావిస్తున్నారు.

అధికార పార్టీలోకి వస్తున్నామని టీడీపీ కార్యకర్తలను గొట్టిపాటి బెదిరిస్తున్నారని, కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై వుందని కరణం బలరాం అన్నారు. అక్రమ సంపాదన రక్షణ కోసం పార్టీలు మారుతున్నారని, చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే పిల్లిమొగ్గలు ఉండవని చెప్పారు. గొట్టిపాటి రాకపై తమ మనోభావాలను సీఎంకు వివరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement