Gottipati Ravi Kumar
-
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్’పై ..శాప్ నెట్ చైర్మన్ కృష్ణ చైతన్య ఫైర్ అయ్యారు
-
అద్దంకిలో టీడీపీ బరితెగింపు..
అద్దంకి: అద్దంకిలో టీడీపీ బరితెగించింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు అదే రోజున స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ను ఉపసంహరణ చేయించారు. ఆధారాలున్నాయి, సీరియస్‌గా తీసుకుంటాం.. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచు గరటయ్య ఖండించారు. 8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించడం దారుణమని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇంట్లో కూర్చోని ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే రవికుమార్..ఇప్పుడు చంద్రబాబు వద్ద షో చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8వ వార్డుకు నామినేషన్లు వేసిన మీ అభ్యర్థులు వారే వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవడం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మా దగ్గరున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి చంద్రబాబు మాట.. అబద్ధాల మూట కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. -
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహం.. కార్మికుడు బలి
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహానికి ఓ నిండు ప్రాణం బలైంది.. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బ్లాస్టింగ్ ఓ కార్మికుడి ప్రాణాలు బలిగొంది. అక్రమాలు జరిగాయంటూ సీజ్ చేసిన గ్రానైట్ క్వారీలో వక్రమార్గంలో తవ్వకాలు జరిపారు. పక్కనే ఉన్న మరో క్వారీ నుంచి మూతపడ్డ క్వారీకి దారి వేసి మరీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బినామి పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. సీజ్ చేసిన క్వారీలో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వచ్చి కష్టం చేసుకుంటున్న అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బల్లికురవ మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అక్రమ దందా వెలుగు చూసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోని రాగానే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిల్లో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చారు. ఇందులో భాగంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబ సభ్యుల పేరుతో, తన అనుయాయుల పేర్లతో నడుపుతున్న క్వారీల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి వందల కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. తన గనుల్లో తవ్విన గ్రానైట్‌కు సంబంధించి జీఎస్టీ, రాయల్టీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా తన జేబులు నింపుకున్న వైనం విజిలెన్స్ విచారణలో బయటపడింది. అయినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో అధికారులు గొట్టిపాటికి చెందిన క్వారీలను సీజ్ చేశారు. అయితే అక్రమాలకు అలవాటు పడ్డ ఎమ్మెల్యే సీజ్ చేసిన క్వారీల్లో సైతం రాత్రిపూట దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ పక్కనే ఉన్న తన బినామీలకు చెందిన క్వారీల్లో నుంచి గ్రానైట్‌ను అక్రమ రవాణా చేస్తూ భారీస్థాయి దోపిడీకి పాల్పడుతున్నారు. మూతపడ్డ క్వారీలో ఆదివారం జరిగిన బ్లాస్టింగ్‌లో కార్మికుడు మృతి చెందిన ఘటనతో గొట్టిపాటి అక్రమాలు బట్టబయలయ్యాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా నడుస్తుందనే విషయం జిల్లాలో అందరికీ తెలిసిందే. శ్రీ రాఘవవేంద్ర గ్రానైట్స్ క్వారీ టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ అక్రమ తవ్వకాలకు తెరతీశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని గాని, జీఎస్టీని గాని చెల్లించకుండా అసలు బిల్లులే లేకుండా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడిన వైనం విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. తాను చేసిన అక్రమ వ్యవహారాలను కప్పి పుచ్చుకునేందుకు తనను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తూ తిరుగుతున్నారు.(చదవండి: ఇబ్బంది లేకుండా 'ఇసుక') అంతటితో ఆగకుండా మూతపడ్డ క్వారీల్లో సైతం దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దందాకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మూతపడ్డ గంగాభవాని క్వారీలోనే సుమారు 100 మంది కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి ఉంచుతున్నారంటే అక్రమ దందా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం తన క్వారీలో నిబంధనలకు విరుద్దంగా బ్లాస్టింగ్లు చేయడంతో తమిళనాడుకు చెందిన ఎం.అర్ముగం (40) అనే కార్మికుని తలపై బండ రాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్వారీలోకి వెళ్లి చూసిన పోలీసు, మైనింగ్ అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు కనిపించాయి. మూతపడిన ఎమ్మెల్యే గొట్టిపాటి క్వారీలో కూలీలను ఉంచిన గదులు గత 8 నెలల క్రితం మూతపడిన గంగాభవాని క్వారీలో సైతం అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు బయటపడింది. పక్కనే తన బినామీకి చెందిన సాయి రాఘవేంద్ర క్వారీలో నుంచి దారి వేసుకుని యథేచ్చగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అంతా అవాక్కయ్యారు. ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ బయట ప్రచారాలు చేస్తూ చీకట్లో మాత్రం అక్రమ దందా నిర్వహించడం ఆ ఎమ్మెల్యే నైజాన్ని తేటతెల్లం చేస్తోంది. అక్రమ గ్రానైట్ దందా మాట అటుంచితే నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేసి ఓ కూలీ ప్రాణాలను బలిగొన్న వైనంపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గొట్టిపాటి గ్రానైట్ దందాపై చర్యలు తీసుకోవడంతో పాటు, మైనింగ్ మాఫియా దాష్టీకానికి బలైన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. ఈర్లకొండలో క్వారీ పరిశీలన బల్లికురవ: ఈర్లకొండ ఇంపీరియల్ క్వారీలో కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో సోమవారం డీఎస్పీ క్వారీని పరిశీలించారు. ఈ క్వారీకి ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న శ్రీరాఘవేంద్ర, గిరిరాజ్ క్వారీల్లో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేపట్టగా అక్కడ నుంచి రాయి ఎగిరిపడి ఆర్ముగం తలపై పడి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయినట్టు డీఎస్పీ దృష్టికి తెచ్చారు. విచారణ తదుపరి మైనింగ్ అధికారులకు నివేదించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. క్వారీ పరిశీలనలో అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్ఐ శివనాంచారయ్య పాల్గొన్నారు. మృతుని సోదరుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో ఆర్ముగం భౌతికకాయాన్ని పోస్టుమార్టూమ్ నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 30 లక్షల పరిహారానికి డిమాండ్.. గ్రానైట్ క్వారీల్లో వేళాపాళలేని బ్లాస్టింగ్లు రాళ్లు దొర్లిపడి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పట్టించుకోవాల్సిన మైన్స్ అండ్ సేప్టీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని క్వారీ వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీ యూ నాయకుడు కాలం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇంపీరియల్ క్వారీలో రాయిపడి చనిపోయిన ఆర్ముగం భౌతిక కాయానికి నివాళులతో కుటుంబ సభ్యులను ఓదార్చారు. బ్రతుకు దెరువుకు వలసవచ్చి విగత జీవిగా మా రిన ఆర్ముగం కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కారి్మక సంఘం అధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సై అంటే సై
కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇరువురు నేతలు కుర్చీలు తీసుకొని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ బాహాబాహీకి సిద్ధపడ్డారు. రాయలేని పదజాలంతో బండబూతులు తిట్టుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షీభూతులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పతాక స్థాయికి చేరాయనడానికి ఇదే ఉదాహరణ. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అమరావతిలోని సచివాలయంలో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్లో ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి శిద్దాతో పాటు ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి మంత్రులు నారాయణ, పరిటాల సునీతలు ఈ సమావేశానికి హాజరుకాగా టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, ఎమ్మెల్యేలు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, పోతుల రామారా>వు, కదిరి బాబూరావు, నియోజకవర్గ ఇన్చార్జులు కందుల నారాయణరెడ్డి, దివి శివరాం తదితరులు హాజరయ్యారు. జిల్లాలో అధికార పార్టీకి తలనొప్పిగా పరిణమించిన పీడీసీసీబీ, ఒంగోలు డెయిరీతో పాటు పలు సమస్యలను చర్చించేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జిల్లాలో మార్కెట్ కమిటీల నియామకాలను పూర్తి చేయటం లేదని మార్టూరు మార్కెట్ కమిటీకి సంబంధించి పేర్లు ఇచ్చి చాలా కాలమైన ఎందుకు భర్తీ చేయలేదంటూ తొలుత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశంలో లేవనెత్తారు. దీంతో ఒక్కసారిగా స్పందించిన ఎమ్మెల్సీ కరణం బలరాం.. ‘ఏం ఫైనల్ అయితది... పార్టీలోకి కొత్తగా వచ్చినోళ్లు కామ్‌గా కూర్చుంటే కదా..’ అన్ని కెలుకుతున్నారు. ఏ పని కానివ్వటం లేదు. పార్టీని నమ్ముకొని 30 ఏళ్లుగా ఉన్న వాళ్లేమో నష్టపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా ఎమ్మెల్యే రవికుమార్ సైతం తానేమీ అడ్డుకోవడం లేదంటూ ఎదురుదాడికి దిగారు. గొట్టిపాటి ఒక్కసారిగా ఆగ్రహంగా లేచి బలరాం మాటలకు అడ్డుతగిలారు. ఎవరు అడ్డుకుంటున్నారంటూ ప్రతి సమాధానమిచ్చారు. శింగరకొండ దేవస్థానం కమిటీని మొదలుకొని అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ కమిటీ పదవులు భర్తీ కాకుండా అడ్డుకుంటున్నావంటూ కరణం బలరాం రవికుమార్‌పై మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. పింఛన్లు, పక్కా గృహాలు సైతం పాత కార్యకర్తలకు అందకుండా చేస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. రవికుమార్ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇరువురు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటు ఎమ్మెల్సీ కరణం.. కుర్చీ తీసుకొని గొట్టిపాటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి కూడా బలరాంపై కుర్చీ ఎత్తారు. నువ్వెంతంటే... నువ్వెంత అంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకున్నారు. పత్రికల్లో రాయలేని పదజాలంతో బూతులు తిట్టుకున్నారు. ఇరువురు కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నానికి దిగడంతో బెంబేలెత్తిన మంత్రులు శిద్దా, నారాయణ, పరిటాల సునీతలతో పాటు ఎమ్మెల్యేలు మధ్యన దూరి ఇరువురిని పక్కకు నెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపు దూరంగా తీసుకెళ్లి శాంతింపజేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభను ప్రారంభించారు. పీడీసీసీబీ పంచాయితీ సీఎం వద్దకు... పీడీసీసీబీ చైర్మన్ ఎంపిక విషయం చర్చకు వచ్చింది. అందరూ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి నివేదించామని, ఇక ముఖ్యమంత్రే చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉందని మంత్రులు అభ్యర్థులకు చెప్పారు. అనంతరం ఒంగోలు డెయిరీపై వాడివేడిగా చర్చ సాగింది. ఒంగోలు డెయిరీని మూడేళ్లల్లోనే పాలకవర్గం కోట్లాది రూపాయలు అప్పుల్లోకి నెట్టిందని అసలు అంత అప్పు ఎందుకయిందో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మంత్రుల ముందు వాదించారు. ఏ గ్రామానికి వెళ్లినా పాల డబ్బులివ్వలేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. వాస్తవాలు ముఖ్యమంత్రికి చెప్పకుండా కొందరు నేతలు పాలకవర్గానికి మద్ధతుగా నిలవడం సరికాదని శివరాం విమర్శించారు. ఇప్పటికైనా సీఎంకు వాస్తవాలు చెప్పాలన్నారు. డెయిరీ డబ్బులను అధికార పార్టీ కోసమే ఖర్చు చేశానంటూ పాలకవర్గం బయట ప్రచారం చేస్తుందని, ఈ విషయం బయట పత్రికల్లో సైతం వస్తుందని కరణం మంత్రుల దృష్టికి తెచ్చారు. అసలు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారు.. డెయిరీ అప్పెంత అన్న విషయం తేల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలను సీఎం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ఆ తర్వాత 7.30 గంటలకు సమావేశం ముగించుకొని నేతలు వెళ్లిపోయారు. -
అద్దంకిలో ఉద్రిక్తత
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఓ సీసీ రోడ్డు ప్రారంభోత్సవం వ్యవహారంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంలు ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యే తో ప్రారంభోత్సవం జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు శిలాఫలకం కూడా వేశారు. అయితే కరణం బలరాం వర్గం కూడా దాని పక్కనే మరో శిలాఫలకం ఏర్పాటుచేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు నేతలు పోటీగా ప్రారంభోత్సవం చేసేందుకు రెడీ కావడంతో పోలీస్ లు భారీగా మోహరించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా తన్నుకున్న రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. -
ఒంగోలులో తెలుగుదేశం స్ట్రీట్ ఫైట్
-
తెలుగుదేశం స్ట్రీట్ ఫైట్
ప్రకాశం టీడీపీ అధ్యక్ష ఎన్నిక రణరంగం - కరణం, గొట్టిపాటి వర్గాల బాహాబాహీ - గొట్టిపాటిపై చేయి చేసుకున్న కరణం బలరాం - గొట్టిపాటి గన్‌మెన్‌ను చితకబాదిన కరణం అనుచరులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం రణరంగాన్ని తలపించింది. మంగళవారం ఒంగోలులో జరిగిన ఈ సమావేశం వేదికగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన జంట హత్యలకు గొట్టిపాటే కారణమని ఆగ్రహంతో రగిలిపోతున్న కరణం వర్గం ఆయనపై దాడికి దిగింది. దీనిని గొట్టిపాటి వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. గొట్టిపాటి చొక్కా చిరిగి కిందపడిపోయారు. టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్‌లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణతో పాటు మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావు సమావేశానికి హాజరయ్యారు. పాత నేతలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశానికి వచ్చారు. 11 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్ తమ వర్గీయులతో సమావేశానికి హాజరయ్యారు. 11.15 గంటలకు అనుచరులతో కలసి ఎమ్మెల్యే గొట్టిపాటి సమావేశానికి వచ్చారు. సమావేశ మందిరం గడపలోనే గొట్టిపాటి, కరణం ఎదురుపడ్డారు. గొట్టిపాటి గన్‌మేన్ కరణం గన్‌మేన్‌ను నెట్టబోగా కరణం ఆగ్రహంతో రగిలిపోయి దాడికి పాల్పడ్డారు. గొట్టిపాటిపై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. కరణం వర్గీయులు ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగారు. గొట్టిపాటి వర్గీయులు సైతం ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. సర్దుబాటుకు మంత్రుల ప్రయత్నం... ఇరు వర్గాల తోపులాట, కేకలతో సమావేశ మందిరం దద్దరిల్లింది. పరిస్థితి అదుపు తప్పుతున్న విషయం గమనించిన మంత్రులు నారాయణ, పరిటాల సునీత, రాఘవరావు ఇరువర్గాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. వేమవరంలో టీడీపీ నేతలను హత్య చేయించిన గొట్టిపాటిని సమావేశానికి ఎలా అనుమతిస్తారంటూ కరణం మంత్రులను నిలదీశారు. గొట్టిపాటిని వెంటనే సమావేశం నుంచి పంపించాలని సూచించారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో మంత్రులు, జిల్లా అధ్యక్షుడి ఎన్నికల విషయంలో అభిప్రాయం తీసుకొని గొట్టిపాటిని బయటకు పంపించారు. సమావేశంలో రసాభాసగా మారడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, ఆమంచి కృష్ణమోహన్ సైతం పది నిమిషాల్లోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దేనికైనా సిద్ధం: కరణం బలరాం కింద నుంచి పై స్థాయి వరకు పార్టీ కార్యకర్తలను రక్షించుకునే విషయంలో దేనికైనా సిద్ధపడతా. వెనుకడుగు వేయబోను. కొందరు ఫిరాయింపు నాయకులు దిగజారి ప్రవర్తించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నాలుగు రోజుల క్రితం హత్యలు చేయించి నాయన ఏం ముఖం పెట్టుకొని సమావేశానికి వస్తారు? ప్రభుత్వ గన్మెన్లను సైతం తన స్వార్థానికి వాడుకునేంతగా గొట్టిపాటి దిగజారారు. ఆర్థికంగా లబ్ధి పొందేందుకే పార్టీ మారారు తప్ప పార్టీకి మేలు చేద్దామని కాదు. నా కార్యకర్తలను రక్షించుకునే విషయంలో ఎంతవరకైనా వెళ్తా. -
చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు
ఒంగోలు: ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక రణరంగాన్ని తలపించింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం బాహాబాహీకి దిగడంతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గొట్టిపాటి, కరణం పరస్పరం తన్నుకోవడంతో ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నారాయణ, పరిటాల సునీత, శిద్ధా రాఘవరావు అవాక్కయ్యారు. కరణం వర్గీయులు గొట్టిపాటి చొక్కా పట్టుకుని లాగడంతో గొడవ ప్రారంభమైంది. తన చొక్కా చించడంతో గొట్టిపాటి ఎదురుతిరిగారు. దీంతో కరణం స్వయంగా రంగంలోకి దిగారు. పరస్పరం చొక్కాలు పట్టుకుని తలపడ్డారు. ఈ క్రమంలో గొట్టిపాటి రవికుమార్ కింద పడిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు. బందోబస్తు మధ్య ఆయనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇరువర్గాల తోపులాటలు, అరుపులతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. బల్లికురవ మండలం వేమవరంలో ఈ నెల 19వ తేదీ రాత్రి జరిగిన జంటహత్యలకు గొట్టిపాటి, కరణం వర్గాల ఆధిపత్యపోరు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గొట్టిపాటి, కరణం పరస్పరం బాహాబాహీకి దిగడం అధికార టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. గొట్టిపాటి వర్గీయులే తమను రెచ్చగొట్టారని కరణం బలరాం అన్నారు. ఎవరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. గొట్టిపాటి తన పని తాను చూసుకోవాలని హితవు పలికారు. మరోవైపు గొట్టిపాటి రవికుమార్ సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. కరణం వర్గీయుల దాడిపై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. -
కలకలం:ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫైటింగ్
-
పోలీసుల అదుపులో వేమవరం నిందితులు
బల్లికురవ(ప్రకాశం జిల్లా): బల్లికురవ మండలం వేమవరంలో హత్యకు గురైన కరణం వర్గీయుల కేసులో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం కొంత మంది నిందితులను సంతమాగులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో 17 మంది నిందితులు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 19న బల్లికురవ మండలం కె.రాజుపాలెంలో ఓ పెళ్లికి హాజరైన కరణం బలరాం వర్గీయులు పెదఅంజయ్య, రామకోటయ్యలను కళ్లలో కారం కొట్టి గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య అనంతరం నిందితులంతా పరారయ్యారు. -
అద్దంకి రక్తచరిత్రలో కొత్త కోణం
♦ వేమవరం జంట హత్యలకు ముందస్తు ప్రణాళిక ♦ అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్ కూడా ఏర్పాటు ♦ ఆపై కళ్లలో కారం కొట్టిన మహిళ..అనంతరం దాడి ♦ హతులను ముందుగా వెంబడించి సమాచారం అందించిన ఓ వ్యక్తి ♦ హత్యకు వాడిన కత్తులు, కర్రలు, కారం డబ్బాలు స్వాధీనం ♦ కారుల్లో పరారైన 24 కుటుంబాలకు చెందిన నిందితులు బల్లికురవ: ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అద్దంకి నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ పంజా విసిరిందా? జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యలు ఈ సందేహానికి బలం చేకూర్చినట్లవుతోంది. ఇదిలా ఉంటే వేమవరంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ హత్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజుల ముందుగానే ప్లాన్ వేసి, ప్రత్యర్థులను అడ్డుకొనేందుకు వీలుగా స్పీడ్ బ్రేకరు వేయడంతోపాటు, పెళ్లికి వెళ్లిన వారిని ఒక వ్యక్తి వెంబడిస్తూ వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిందితులకు చేరవేసినట్లు తెలిసింది. పెళ్లి బృందం స్పీడు బ్రేకరు వద్దకు రాగానే ఒక మహిళ వారి కళ్లలో కారం కొట్టగా, మిగిలిన వారు కర్రలు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. 1989 నాటి దాడిలోనే పెద్ద అంజయ్యకు కత్తిపోట్లు.. పత్తిపాటి సాంబయ్య అనే వ్యక్తిని గొట్టిపాటి వర్గీయులు (గొట్టిపాటి హనుమంతరావు)1989లో హతమార్చారు. ఇదే దాడిలో పెద అంజయ్య కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి 20 రోజులు గుంటూరు వైద్యశాలలో చికత్స పొందాడు. నాడు మరణించిన వ్యక్తి కూడా బలరాం వర్గీయుడే కావడం గమనార్హం. 24 కుటుంబాల్లో ఒక్కరూ లేరు.. నిందితులుగా భావిస్తున్న 24 మంది కుటుంబాల్లోని వారు ఒక్కరు కూడా ప్రస్తుతం గృహాల్లో లేరు. వీరంతా రెండు మూడు కార్లలో పరారయ్యారు. వీరిలో 20 కుటుంబాల వారు గొట్టిపాటి ఇంటి పేరిట వారని తెలుస్తోంది. గతంలో వేరే రాష్ట్రాలకు బతకడానికి వెళ్లిన కొంతమంది మళ్లీ గ్రామానికి చేరుకోవడం వల్లే ఇలాంటి సంఘటన జరుగుతున్నాయిన ప్రజలంటున్నారు. మృతుల కుమారులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందిన గోరంట్ల పెద అంజయ్యకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు సురేశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా మరో కుమారుడు అనీల్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. మరో మృతుడు యేగినాటి కోటేశ్వరరావుకు భార్య ఉంది. కుమారుడు వెంకటేశ్వర్లు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మృతులది వ్యవసాయ నేపథ్యం. గ్రామంలో భయాందోళనలు.. హత్యల నేపథ్యంలో గ్రామంలో ఆందోళన నెలకొంది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.మృతుల ఇళ్ల వద్దకు అధిక సంఖ్యలో జనం చేరకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గ్రామాన్ని కరణం బలరాం సందర్శించారు. కరణం వర్గానికి చెందిన ఐదు మండలాల నాయకులు కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లారు. పోలీసు వలయంలో.. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల ఇళ్ల వద్ద 50 మందితో పది పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మూడు వ్యానుల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. శనివారం సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ ప్రేమ కాజల్, బల్లికురవ డీటీ సింగయ్య పరిశీలించారు. హత్యా స్థలిలో దొరికన కర్రలు, కత్తులు, కారం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించారు. ప్రధాన నిందితుల గుర్తింపు.. ఫొటోల విడుదల - గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ వేమవరంలో శుక్రవారం జరిగిన జంట హత్యల అనంతరం నియోజకవర్గంలో భారీబందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సమావేశమందిరంలో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. హత్యలు రాజకీయ కోణంలో జరిగాయా.. లేక పాత కక్షల నేపథ్యంలో జరిగాయా అని లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో 17 మందిపై కేసునమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల ఫొటోలను విడుదల చేశారు. ఒకటో నిందితుడిగా మాలెంపాటి వెంకటేశ్వర్లు, రెండో నిందితుడిగా గొట్టిపాటి మారుతి, మూడో నిందితుడిగా మాలెంపాటి లక్ష్మీనారాయణలతో పాటు మరో 14 మంది నిందితులుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆరు ప్లటూన్ల ప్రత్యేక పోలీస్ బలగాలతో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో మండలానికి ఒక్కో డీఎస్పీ చొప్పున శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గుంటూరు, చిలకలూరిపేట, నర్సరావుపేట ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిందితులకు ఆశ్రయం కల్పించినవారిపై ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. హత్యలకు సంబంధించి పోలీసుల వద్ద సమాచారం ఉన్నా పట్టించుకోలేదని, మైనింగ్‌కు సంబంధించి ఇరువర్గాల మధ్య ఇటీవల ఘర్షణలు జరుగుతున్న పట్టీపట్టన్నట్లు వ్యవహరించారని వెల్లడించారు. ప్రత్యేకంగా మైనింగ్ విషయంలో అధికార ఎమ్మెల్యేకు సంబంధించి.. హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయన్నారు. -
బాబుల బంతాట!
జిల్లా నేతలతో అధిష్టానం గేమ్ షో ఫిరాయింపు నేతల వైపు చినబాబు లోకేష్ పాత నేతలకు మద్దతుగా సీఎం చంద్రబాబు ఒక రోజు బదిలీ.. మరుసటి రోజుకు రద్దు ఎటూ తేల్చక ఆటాడుకుంటున్న అధిష్టానం సీఐల బదిలీల్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన పైచేయి ఎవరిదనే అంశంపై పార్టీ కేడర్‌లో ఉత్కంఠ.. ఆధిపత్యం కోసం పోరాడుతున్న టీడీపీ జిల్లా నేతలతో బాబూ కొడుకులు బంతాట ఆడుతున్నారా..? ఒక వర్గానికి చంద్రబాబు, మరో వర్గానికి చినబాబు మద్దతుగా నిలిచి నాటకం రక్తికట్టిస్తున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు కర్ర విరగ కూడదు.. పాము చావకూడదు అన్నట్లు వ్యవహరిస్తుండటంతో జిల్లాకు చెందిన ఇరువర్గాల నేతలు లోలోన రగిలిపోతున్నారు. వీరి ఆధిపత్య పోరులో చివరకు ఏ వర్గం పైచేయి సాధిస్తుందో తెలియని పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒంగోలు : జిల్లాలోని అధికార పార్టీ పాత నేతలు, ఇటీవల అధికార పార్టీలో చేరిన కొత్త ఎమ్మెల్యేలతో అధిష్టానం ఆడుకుంటోంది. గొట్టిపాటి నేతృత్వంలోని ఫిరాయింపు నేతలతో కూడిన త్రిసభ్య కమిటీ(గొట్టిపాటి, ముత్తుముల, పోతుల)కి చినబాబు లోకేష్ మద్ధతు పలుకుతుండగా, కరణం నేతృత్వంలోని పాత నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల నేతలు పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక వర్గం అధికారులను బదిలీ చేయిస్తే.. మరొక వర్గం దాన్ని అడ్డుకుంటోంది. ఏ వర్గాన్ని నిరుత్సాహపడనీయకుండా అదే సమయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించకుండా ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ అటు చంద్రబాబు, ఇటు చినబాబు బంతాట ఆడుకుంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. అద్దంకి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో పాటు ఆయా నియోజకవర్గాల టీడీపీ కేడర్ వ్యతిరేకించినా... చంద్రబాబు, చినబాబు లు ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావులను పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఓడించటమే లక్ష్యంగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పాత నేతలకు చెప్పారు. పైగా ఎమ్మెల్యేలకు భారీ ప్యాకేజీలిచ్చి పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారంతో వారిని అంత వరకే పరిమితం చేస్తారని పాత నేతలు భావించారు. చంద్రబాబు స్వభావం తెలిసిన వారు కావడంతో ఎమ్మెల్యేలను రెంటికీ చెడ్డ రేవడిలా చేసేందుకేనన్న ధీమాతో ఉన్నారు. కొత్తగా పచ్చ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు అధికారం కోసం తహతహలాడారు. దశాబ్దాలుగా జెండాలు మోసిన పాత నేతలను పక్కకు నెట్టి ఆధిపత్యం చలాయించేందుకు పావులు కదిపారు. ఫిర్యాదుల వెనుక జనార్దన్ వ్యూహం.. గొట్టిపాటి సీఎంకు ఫిర్యాదు చేయడం వెనుక కరణంను వ్యతిరేకిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యూహం ఉందన్న ప్రచారం ఉంది. గొట్టిపాటి సీఎంను కలిసిన నేపథ్యంలో రమణమూర్తి బదిలీ ఆగిపోయిందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. మరుసటి రోజే రమణమూర్తి స్థానంలో కొత్త ఎస్ఈగా నెల్లూరు నుండి బదిలీ అయిన రెడ్డయ్య బాధ్యతలు స్వీకరించారు. దీంతో గొట్టిపాటి వర్గానికి భంగపాటు తప్పలేదు. దీన్ని బట్టి చూస్తే మరోమారు కరణంకే అధిష్టానం మద్దతు పలికినట్లు అయింది. ఇదిలా ఉండగా గొట్టిపాటి వర్గం అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌తో పాటు గిద్దలూరు, కందుకూరు, చీరాల, ఒంగోలు, కనిగిరి సీఐలను అటాచ్మెంట్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. లోకేష్ ఆదేశాల మేరకే ఈ బదిలీలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరుసటి రోజుకే ఆరుగురు సీఐల బదిలీలు నిలిచిపోయాయి. సీనియర్ నేత కరణం ఏకంగా ముఖ్యమంత్రి, డీజీపీలతోనే మాట్లాడి బదిలీలు నిలిపివేయించారన్న ప్రచారం జరిగింది. దీంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 2,500 చొప్పున పింఛన్లు మంజూరు చేయాలంటూ లోకేష్‌కు నెల క్రితమే జాబితా ఇచ్చినట్లు తెలుస్తోంది. కరణం ఆ జాబితాను కూడా నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ద్వారా లోకేష్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో పింఛన్ల జాబితా సైతం రాత్రికి రాత్రే నిలిచిపోయింది. సత్తా చాటేందుకు ప్రయత్నాలు.. వచ్చి రావడంతోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేయించి సత్తా చాటే ప్రయత్నం చేశారు. దీన్ని సహించని మొండిఘటం కరణం సాయంత్రానికే సీఐ బదిలీని నిలిపివేయించి పట్టు నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తిని కరణం బదిలీ చేయించారన్న ప్రచారం జరిగింది. దీంతో కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు గొట్టిపాటి రంగంలోకి దిగారు. ఈ సారి తానొక్కడే కాకుండా త్రిసభ్య కమిటీ సభ్యులుగా ముద్ర వేసుకున్న అశోక్‌రెడ్డి, పోతుల రామారావులతో కలిసి ఎస్ఈ బదిలీని నిలపాలంటూ ఏకంగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కరణంపై పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. గొట్టిపాటి వాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. నొప్పించక తానొవ్వక.. గొట్టిపాటి నేతృత్వంలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలు లోకేష్ ద్వారా తమ పనులు చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగుతుంటే... కరణం నేతృత్వంలోని పాత నేతల వర్గం ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఒత్తిడి తెస్తూ దాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. కొత్త ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో లోకేష్ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆయన కొత్త ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నట్లు పైకి కనబడుతుంది. అదే సమయంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాత నేతలను సైతం నొప్పించక ఎప్పటికప్పుడు కొత్త ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేస్తున్నారు. మొత్తంగా కొత్త నేతలకు మద్ధతు పలుకుతున్నట్లు లోకేష్ నటిస్తుండగా, పాత నేతలకు మద్ధతు పలుకుతూ బాబు నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. -
గొట్టిపాటి యాక్షన్.. కరణం రియాక్షన్
► అద్దంకి సీఐని బదిలీ చేయించిన రవికుమార్ ► రాత్రికి రాత్రే బదిలీని నిలిపివేయించిన బలరాం ► పతాకస్థాయికి టీడీపీ వర్గ విభేదాలు ఒంగోలు: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఆదివారం ఉదయానికి బదిలీ చేయించి యాక్షన్‌కు దిగితే.... అదే రోజు సాయంత్రానికే ఆ బదిలీ నిలిపివేయించి కరణం తన రియాక్షన్ చూపించారు. అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం తలకు చుట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే... అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇటీవలే అధికార పార్టీలో చేరారు.గొట్టిపాటి రాకను కరణం బలరామకృష్ణమూర్తి,ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి అద్దంకిలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గొట్టిపాటిని కరణం వర్గీయులు అడుగడుగునే అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే గొట్టిపాటి చాప కింద నీరులా తన పని చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగా ఏడాదిన్నరగా అద్దంకి సీఐగా పని చేస్తున్న బేతపూడి ప్రసాద్‌ను గొట్టిపాటి పట్టుపట్టి డీఐజీ ద్వారా బదిలీ చేయించారు. ఆదివారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును అద్దంకి సిఐగా బదిలీ చేయించారు. బేతపూడి ప్రసాద్ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపారు.ఐజీతో పాటు ఏకం గా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అంతే..! ఆదివారం సాయంత్రానికి సీఐ బదిలీ ఆగిపోయింది. ప్రసాద్ బదిలీని నిలిపివేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద వాపోయినట్లు సమాచారం. తొలి డిమాండే నెరవేరకపోతే మిగిలిన హామీలు ఏం నెరవేరుస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఐని బదిలీ చేస్తే చేతకాని వాళ్లలా కూర్చోలేమని అటు చంద్రబాబుకు ఇటు లోకేష్‌లకు కరణం తేల్చి చెప్పినట్లు సమాచారం. అవసరమైతే అమీతుమీకి సిద్ధమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పదేళ్లు జెండాలు మోసి కార్యకర్తలు అష్టకష్టాలు పడ్డారని విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని కరణం తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య పోరు పతాకస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అటు పార్టీ అధిష్టానం గొట్టిపాటికిచ్చిన హామీలను నెరవేర్చుకుం టుందా...? లేక పాత తరం సీనియర్ నేత కరణంకే ప్రాధాన్యతనిస్తుందా...? అన్నది వేచి చూడాల్సి ఉంది.....! -
ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం
విజయవాడ: ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. వైఎస్సార్ సీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టీడీపీలో చేరతారన్న వార్తలు కరణం బలరాం వర్గంలో కలకలం రేపాయి. గొట్టిపాటి రవికుమార్ ను బలరాం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కుమారుడు, అనుచరులతో కలిసి కరణం బలరాం మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. వీరంతా కాసేపట్లో సీఎం చంద్రబాబును కలవనున్నారు. గొట్టిపాటి రవికుమార్ ను పార్టీలోకి తీసుకోవద్దని ఫిర్యాదు చేయనున్నారు. గొట్టిపాటి కుటుంబంతో తమకున్న రాజకీయ విభేదాల గురించి, రాజకీయంగా వ్యతిరేకిస్తున్న గొట్టిపాటిని పార్టీలో చేర్చుకుంటే జిల్లాలో టీడీపీకి ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించారు. ఆయన చేరితే పార్టీకి ఏ రకమైన నష్టం జరుగుతుందో అధినేతకు తెలిపాలని కరణం బలరాం భావిస్తున్నారు. అధికార పార్టీలోకి వస్తున్నామని టీడీపీ కార్యకర్తలను గొట్టిపాటి బెదిరిస్తున్నారని, కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై వుందని కరణం బలరాం అన్నారు. అక్రమ సంపాదన రక్షణ కోసం పార్టీలు మారుతున్నారని, చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే పిల్లిమొగ్గలు ఉండవని చెప్పారు. గొట్టిపాటి రాకపై తమ మనోభావాలను సీఎంకు వివరిస్తామన్నారు. -
రైతుల తరఫున పోరాటానికి సిద్ధం
రైతులకు సాగునీరు అందించే వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కనీసం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 30 శాతం పంటలకు చుక్క నీరు కూడా అందించలేదు. జిల్లా రైతులకు నీటి విషయంలో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ప్రశ్నించడంతో మంత్రి పర్యటనకు వచ్చారు. సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగడం లేదు. ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా, ప్రజా సమస్యలు వినకుండా మంత్రి వెళ్లిపోవడం బాధాకరం. దాడులకు తెగబడితే వెనక్కు తగ్గేది లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం. రైతులు కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంత్రి వాస్తవ పరిస్థితి గమనించి జిల్లా రైతులకు న్యాయం చేయాలి. గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే -
సా...గరం గరం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వ ఆధునికీకరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీశారు. ప్రపంచబ్యాంకు నిధులతో జరుగుతున్న ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనివల్ల శివారు భూములకు నీరు అందడం లేదని నిలదీశారు. అసెంబ్లీలో నాలుగు రోజులుగా జరిగిన చర్చల్లో జిల్లా ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై అద్దంకి, సంతనూతలపాడు, కందుకూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్ఎస్పీ ఆధునికీకరణ పనుల భౌతిక, ఆర్థిక పరిస్థితిపై నివేదిక కావాలని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ వేసిన ప్రశ్నపై చర్చ జరిగింది. మెయిన్ కాల్వ పనులు 80 శాతం, బ్రాంచి కాల్వల పనులు 47 శాతం, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పనులు 40 శాతం జరిగాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సుమారు 20 పేజీల సమాధానమిచ్చారు. అంకెలన్నీ వాస్తవ విరుద్ధం గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 0- 18 మైలురాయి వరకూ లైనింగ్ చేయాలని ప్రతిపాదించగా అందులో ఒక్క పైసా పని కూడా ప్రారంభం కాలేదు. జిల్లా పరిధిలో నాలుగు కిలోమీటర్ల మేర లైనింగ్‌కు ప్రతిపాదిస్తే అందులో 59.36 శాతం పూర్తయినట్లు ప్రభుత్వ నివేదికలో ఉందని, వాస్తవానికి 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారుల లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గం విషయానికి వస్తే 18 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉంటే అందులో సగటున 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారులు ఇచ్చిన లెక్కల్లోనే 2.6 శాతం, ఏడు శాతం, 36 శాతం అని ఉన్నాయి. అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారనడానికి ఈ ఉదాహరణలు. 2008లో లైనింగ్ పనులు చేస్తామని ప్రకటించినపుడు వేలాది మంది రైతులు గుప్పెడు మెతుకులు తినవచ్చని ఆశపడ్డారు, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంది. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై ఏ చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి దేవినేని ఉమా సమాధానమిస్తూ పనుల జాప్యంపై నోటీసులు ఇచ్చాం అని సమాధానమివ్వడంతో ఏడేళ్ల నుంచి పనులు చేయని ఏజెన్సీలను మార్చే ఆలోచన ఎందుకు చేయడం లేదని రవికుమార్ ప్రశ్నించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పనులు తాము చేయకుండా, అనుభవం, అర్హతలేని సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల కాల్వల వ్యవస్థ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నాటికి ఈ పనులు ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలను కాపాడేందుకు అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని రవికుమార్ విమర్శించారు. ప్రపంచబ్యాంకు నిబంధనల ప్రకారం వాటర్ రీడింగ్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇప్పటికీ అవి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎక్కడ ఎంత నీరు వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. 30 ఏళ్లక్రితం కట్టిన సింగిల్‌లైన్ బ్రిడ్జిలను మార్చాల్సి ఉన్నా ఇంతవరకూ ఆ పనులు మొదలు పెట్టకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రవికుమార్ చెప్పారు. షటర్లు కూడా సక్రమంగా లేకపోవడంతో ఎవరికి అవసరం ఉంటే వారు వాటిని పీకేస్తున్నారని, దీనిపై నియంత్రణ లేదన్నారు. ఈ పనులు సక్రమంగా అందించేందుకుగాను అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, రైతుసంఘాల నాయకులతో కమిటీ వేయాలని రవికుమార్ సూచించారు. ఆధునికీకరణ పనులకు ఎంత ఖర్చుపెట్టారు? ఆదిమూలపు సురేష్ : ఇప్పటి వరకూ ఎన్ఎస్పీ ఆధునికీకరణకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఏ మేరకు పనులు పూర్తయ్యాయి? పనులు జరగకపోతే ప్రపంచబ్యాంకు నుంచి రావల్సిన నిధులకు గండిపడే ప్రమాదం ఉంది? ఇందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? భారీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని: మొత్తం 2639 కోట్ల రూపాయల విలువైన ఈ పనులకు 48 శాతం ప్రపంచ బ్యాంకు, 52 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకూ 801 కోట్లు అంటే 28.6 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు జరగకపోతే 2016 నాటికి ప్రపంచబ్యాంకు నుంచి రావాల్సిన రూ.1359 కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది. అసలు కాల్వల పనులను పరిశీలించేందుకు తగిన యంత్రాంగం లేదు. అధికారుల నుంచి లస్కర్ల వరకూ అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరత ఉంది. ఎన్ని టీఎంసీల నీరు ఆదా అవుతుంది కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు: ప్రస్తుతం జరుగుతున్న ఎన్ఎస్పీ ఆధునికీకరణ పనులు పూర్తయితే ఎన్ని టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఎన్ఎస్పీ పేజ్ -2 పనులు ప్రారంభించే అవకాశం ఉందా. ఈ పనులు పూర్తి స్థాయిలో జరిగితే మూడు జిల్లాల రైతాంగానికి లబ్థి చేకూరుతుంది. అందువల్ల ఈ పనులపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. మంత్రి దేవినేని ఉమా : సాగర్ పనులు పూర్తి స్థాయిలో చేయడం కోసం అధికారులతో సమీక్షిస్తాను. రెండు రోజుల తర్వాత స్వయంగా వచ్చి కాల్వల్లో జరిగిన పనులను పరిశీలిస్తా. 2016 నాటికి పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటా. స్పీకర్ కోడేల శివప్రసాద్ చర్చలో జోక్యం చేసుకొని ఈ పనుల ఆవశ్యకతను వివరిస్తూ పూర్తి దృష్టి పెట్టాలి. -
నీరిచ్చే వరకూ పోరాటం
సంతమాగులూరు: సాగునీటి ఎద్దడిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అధికారుల అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు బాసటగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వివిధ మండలాల రైతులు వందలాది మంది అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం బైఠాయించారు. మక్కెనవారిపాలెం వద్ద రెండు గంటల పాటు రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాకు రావాల్సిన నీటి వాటాను విడుదల చేసి సాగునీటి సమస్య తీర్చాలని రైతులు నినాదాలు చేశారు. రాస్తారోకో విరమించాలని ఎన్నెస్పీ సంతమాగులూరు డీఈఈ అప్పారావు, ఎస్సై ఎ.శివనాగరాజు కోరగా..ఎమ్మెల్యే తిరస్కరించారు. ఉన్నతాధికారులు వచ్చి రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఫోన్ సంభాషణలతో సమస్యలకు పరిష్కారం లభించకనే..రైతులతో కలిసి తానూ రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. ఆందోళన విరమించకపోవడంతో ఎస్సై ఎ.శివనాగరాజు ఎమ్మెల్యే రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసుల కదలికలు గమనించిన రైతులు రవికుమార్ చుట్టూ వలయంలా ఏర్పడి అడ్డుకున్నారు. రైతులు, నాయకులతో అర్ధగంటపాటు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు ఎమ్మెల్యే రవికుమార్ సహా 30 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై అందరినీ విడుదల చేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడిన మంత్రి ఉమా: ఎమ్మెల్యే రవికుమార్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన తరువాత రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఏబీసీ పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రవికుమార్ మంత్రికి వివరించారు. వెంటనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సీఈ వీర్రాజును కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నమంత్రి ప్రకాశం జిల్లా రైతులకు నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అద్దంకి బ్రాంచి కెనాల్‌కు 0/0 వద్ద 2400 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచి ప్రకాశం జిల్లా (18/0)కు 1400 క్యూసెక్కులకు తగ్గకుండా అందించాలని ఆదేశించారు. ఈ మేరకు నీటి విడుదలను తక్షణమే పెంచుతున్నామని, సోమవారం ఉదయానికి 18/0కు 1400 క్యూసెక్కులు అందిస్తామని తాను కూడా కాలువపై పర్యటించి పర్యవేక్షిస్తానని సీఈ వీర్రాజు రవికుమార్‌కు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళన బాటే.. కాలువకు పుష్కలంగా నీటిని విడుదల చేసి జిల్లా పరిధిలోని సాగర్ కాలువల ఆయకట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రవికుమార్ డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో కాకమ్మ కబుర్లు చెప్పి నీటి సమస్య పరిష్కరించకుంటే ఆందోళను మరింత ఉధృతం చేసి కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసుల అరెస్ట్‌కు సహకరించామన్నారు. ఈ ఆందోళనలో ఎంపీపీ సన్నెబొయిన ఏడుకొండలు, సర్పంచ్ల సంఘ మండల అధ్యక్షుడు సంతమాగులూరు సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతారామారావు, కరిపరమేష్, సింగరయ్య, సంతమాగులూరు, బల్లికురవ, పంగులూరు, అద్దంకి మండలాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
మోసపు బాబును ఎండగడదాం
చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, డ్వాక్రా మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాట్లాడారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే... మాయమాటలు చెబితే ప్రకృతి కూడా సహకరించదు గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే ప్రజలకు మంచి చేద్దామని మంచి మనసుతో అధికారంలోకి వస్తే అదే తరహాలో వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అలా కాకుండా మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించేలా అధికారంలోకి వచ్చినందు వల్లనే వాతావరణం కూడా అనుకూలించలేదు. అందుకే వర్షాలు లేవు, సాగు నీటి కాలువల్లో నీరు లేదు, విత్తనాలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి 2004 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అధికారంలోకి రాగానే అమలు చేశారు. అయితే 2014 ఎన్నికల్లో హామీలిచ్చిన చంద్రబాబునాయుడు వాటన్నింటి నీ గాలికొదిలేశాడు. మాటలు కోటలు దాటాయి.. చేతలు లేవు పాలపర్తి డేవిడ్ రాజు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటాయి. పెద్ద ఎకనమిస్ట్నని, ఆర్థిక రంగంలో మంచి ప్రావీణ్యం ఉందని, పాలన ఎలా చేయాలో తనకు బాగా తెలుసునని ఊదరగొట్టాడు. చంద్రబాబు చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకోవాల్సింది పోయి ప్రజలను ఏ విధంగా మోసపు మాటలు చెప్పి మాయచేయచ్చో తెలుసుకున్నారు. కేవలం ఆ కుర్చీమీద ప్రేమతోటే ప్రజలకు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం మొదలుకొని వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో పోరు బాటలోనే నడిచింది. రైతుల పక్షాన పోరాటం పోతుల రామారావు, కందుకూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపించేలా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. తనకున్న అనుభవం రాష్ట్రంలోనే ఎవరికీ లేదంటూ ప్రజలను వంచించిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పటికైనా ఆయన నిజాల్ని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే ప్రజల ఆగ్రహం కొంతలో కొంతైనా తగ్గుతుంది. రుణాలు మొత్తం లక్షా ఇరవై వేల కోట్లకి పైగా ఉంటే రూ.5 వేల కోట్లు రైతుల రుణాలకి కేటాయించానని చెప్పి తిరిగి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాలు చేపడుతున్నారని తెలియడంతో ఏవో మాయ లెక్కలు చెప్తూ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నాడు. రాజధాని పేరుతో 60 నుంచి 70 వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని రైతుల వద్ద నుంచి బలవంతంగా పంటపొలాల్ని లాక్కోవాలని చూడటం సహించరానిది. ఓడిపోయిన వారితో కమిటీలా? ఆదిమూలపు సురేష్, సంతనూతపాడు ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలు, నాయకులను సమాజసేవ చేసే సామాజిక కార్యకర్తలుగా అభివర్ణించి మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల్లో వారిని వేసి గ్రామాల్లో ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. ఎంపీటీ పీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసి ప్రజల చేత ఛీ కొట్టించుకొని ఓడిపోయినవారిని కమిటీలో వేయడం ద్వారా ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయలేదని సామాజిక కార్యకర్తల ముసుగులో ఉన్న టీడీ పీ నాయకులు పింఛన్లు, రేషన్ కార్డులు ఇలా అనేక సంక్షేమ పథకాల నుంచి వాళ్ల పేర్లు పీకేయిస్తున్నారు. ఫించన్ల సొమ్ము పెంచుతామని ప్రకటించి 10 లక్షల ఫించన్లు తీసేశారు. 20 లక్షల రేషన్ కార్డులు పీకేశారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమైన చంద్రబాబు విదేశీ పెట్టుబడిదారులను ఏవిధంగా నమ్మిస్తారో ఎవరికీ అంతుబడట్టడం లేదు. ఆరు నెలల్లోనే నిజస్వరూపం బయటపడింది జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే మాట చెప్పి.. తప్పిన మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన చెప్పేదొకటి చేసేది మరొకటి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది. చెప్పింది చెప్పినట్లు చేయాలంటే ఒక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి మాత్రమే చెల్లింది. రాజన్నను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 5 హామీలిచ్చి ప్రజలకు ఉరి బిగిస్తున్నాడు. రైతు రుణమాఫీలు, డ్వాక్రా మహిళల రుణమాఫీల విషయంలో చంద్రబాబు చేతులెత్తేసినట్లే. ఇంటికొక ఉద్యోగం.. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల చిట్టా విప్పితే చాంతాడంత ఉంటుంది. ఎన్నికల హామీల విషయాన్ని విస్మరించి ఆయన పార్టీ కార్యకర్తలకి మాత్రం సోషల్ వర్కర్లు అని ముద్రవేసి దోచిపెట్టేందుకు పథకం వేశారు. చంద్రబాబుది నీచపాలన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే చంద్రబాబుది నీచపాలన. వైఎస్ పాలన సువర్ణయుగం. చంద్రబాబు నాయడు నరకాసురుడు లాంటి లక్షణాలు కలవాడు. నాయకుడంటే ఎలా ఉండకూడదో ఆయన్ను చూసి నేర్చుకుంటే సరిపోతుంది. ఎన్నికల సమయంలో అందరికీ బంగారు పాలన ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడేమో నీచంగా పాలిస్తున్నాడు. రైతుల రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి మరి ఇప్పుడు రూ.40 వేల కోట్లు ఇస్తానంటున్నాడు. రైతులు, మహిళలు ఇలా..అన్నీ సమాజిక వర్గాల కోసం పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడిని ఎండకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రుణాలు రద్దు చేసే వరకూ పోరాటం వరికూటి అశోక్ కుమార్, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు రద్దయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. టీడీపీ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దోచిపెట్టాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచనే ఎక్కడా కనపడటం లేదు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇకపై కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటారు. మనందరం ఆయనకు అండదండగా ఉండాలి. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి గొట్టిపాటి భరత్, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఓట్లకోసం, సీట్ల కోసం మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి. అధికారం కోసం నోటికొచ్చిన మాటల్లా చెప్పి ప్రజలను అంధకారంలోకి నెట్టాడు. ఎన్నికలకు ముందు రుణమాఫీపై ఒకరకంగా చెప్పి అధికారం చేతికొచ్చిన తర్వాత మరొక రకంగా చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపై పెడతానని చివరకు రుణమాఫీ చెయ్యడానికి సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు కోటయ్య కమిటీని వేస్తూ సంతకం పెట్టడం అత్యంత దారుణం. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఇచ్చిన ఎన్నికల హామీని అధికారంలోకి రాగానే అమలు చేసి చూపించిన నేతగా ఆయన చరిత్రలోకి ఎక్కారు. చంద్రబాబు కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనే లేదు. దేశం నేతలు పండుగ చేసుకుంటున్నారు బుర్రా మధుసూధన్ యాదవ్, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి కనిగిరిలో టీడీపీ నాయకులు గురువారం బాణసంచా కాల్చారు. ఎందుకు కాలుస్తున్నారు, ఏంటి అని స్థానిక ప్రజలు వాళ్లని అడిగితే నాలుగు రోజుల్లో చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నాడని ఆకాశ సువ్వలు కాలుస్తున్నామని చెప్పారు. అంటే రైతుల పట్ల ప్రజల పట్ల టీడీపి నాయకులకు ఎంత చిన్నచూపు ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒకపక్క రైతులు, డ్వాక్రా మహిళలు నానా అవస్థలు పడుతూ కుటుంబాలు గుల్ల చేసుకుంటుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రం పండగలా ఉన్నట్టుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు. ఈరోజుకు ఈ రోజు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగిస్తుంది. వెనుకా ముందు చూడకుండా అబద్ధాలు వరికూటి అమృతపాణి, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు వ్యతిరేకంగా తన పాలన సాగిస్తున్నాడు. తనకు అనుభవం ఉందని, తనవద్ద చాలా విద్యలున్నాయని ఆయన ఎన్నికల కమిషన్‌కి కూడా లేఖ రాశారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకైనా రుణమాఫీ జరిగిందా? సిగ్గు శరం లేకుండా, వెనకాముందు చూడకుండా అబద్ధాలాడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేకి చంద్రబాబు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎవరైనా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ైవె ఎస్ రాజశేఖరరెడ్డి తర్వాతే. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిరుద్యోగ భృతి కావాలని అడిగితే అలాంటి హామీలు నేనెప్పుడిచ్చానని ఎదురు ప్రశ్న వేయడం చంద్రబాబుకే దక్కింది. -
విఐపి రిపోర్టర్- గొట్టిపాటి రవికుమార్
-
ఘనంగా ఎమ్మెల్యే గొట్టిపాటి జన్మదిన వేడుకలు
అద్దంకి : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన జన్మదిన వేడుకలను కర్నూలు జిల్లా శ్రీశైలంలో నాయకులు, అభిమానుల మధ్య ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రెండురోజుల క్రితం శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించిన ఆయన.. ఆదివారం మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా శ్రీశైలంలోని అతిథి గృహంలో బసచేస్తున్న ఆయనను పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.వారందరి మధ్య బర్త్‌డే కేక్‌ను ఎమ్మెల్యే కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలానికి పాదయాత్ర నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అద్దంకి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవచేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాదయాత్ర, జన్మదిన వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ అద్దంకి పట్టణ కన్వీనర్ కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ మలినేని గోవిందరావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు కొప్పోలు హనుమంతరావు, హుస్సేన్‌బాషా, మహబూబ్‌సుభానీ, ఏజండ్ల ఆంజనేయులు, సుబ్బయ్య, అద్దంకి నియోజకవర్గానికి చెందిన 300 మంది అభిమానులు పాల్గొన్నారు. -
రుణం చెల్లించిన వారికి అన్యాయమా...!
సాక్షి ప్రతినిధి: రుణమాఫీపై ప్రభుత్వం రైతులను మోసపుచ్చేవిధంగా వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ నిమిత్తం తీసుకున్న పంట, వ్యవసాయ, బంగారు రుణాల మాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, జిల్లా వారీగా ఎంత చెల్లించాలి? డ్వాక్రా రుణాల మాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, జిల్లాల వారీగా ఎంత? రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రుణాలు రీషెడ్యూల్ చేస్తారా? దుర్భిక్షపీడిత ప్రాంతాల్లోనే రుణాల రీషెడ్యూల్ చేస్తారా? దీని వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా అని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, ఆదిమూలపు సురేష్ అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఎమ్మెల్యేలు నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ అంశంపై మంత్రి ఇచ్చిన సమాధానంపై అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ 2013 డిసెంబర్ 31 ముందు రుణాలు పొంది, 2014 మార్చి 31 వరకూ చెల్లించని వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తోందని, 2014 జనవరి నుంచి మార్చి వరకు చెల్లించిన వారికి ఈ పథకం వర్తించడం లేదన్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో మంచి రైతుకు మాఫీ వర్తించదు అంటూ వచ్చిన కథనాలను ఆయన సభ దృష్టికి తీసుకువెళ్లారు. బుక్ అడ్జస్ట్మెంట్ విషయంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో పలువేదికలపై సకాలంలో రుణం చెల్లిం చిన వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అశ్వత్థామ అతః కుంజరహా అన్నట్లు నిజాయితీ గల పేద రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది.. షరతులతో అన్నట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సహకార వ్యవస్థలో 80, 90 వేల మంది రైతులు రుణాలు తీసుకున్నారని, వారంతా జనవరి నుంచి మార్చి వరకూ రుణాలు చెల్లించారని చెప్పారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 300 కోట్లు చెల్లిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా 550 కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. రాష్ట్రం మొత్తంమీద 2500 కోట్ల రూపాయలు రైతులు రుణాలు చెల్లించారని, వారంతా 174 జీవో కారణంగా నష్టపోయారన్నారు. అద్దంకి, పరుచూరు నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి లక్షన్నర రుపాయలు రుణమాఫీ చెల్లిస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ చెల్లించలేదని, దీని కారణంగా రైతులు వడ్డీ రాయితీ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలపరిమితి దాటిపోతే 10.5 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్తితి వస్తుందన్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, ఇదే పద్దతిలో చేస్తే ఏడెనిమిది సంవత్సరాలకు గాని రుణాలు మొత్తం మాఫీ కావని చెప్పారు. రీషెడ్యూల్ కూడా అన్ని మండలాలకు వర్తింప చేయాలని రవి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కోనసీమ రైతులతో కలిసి వ్యవసాయ మంత్రిని రుణమాఫీపై చర్చించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అనంతరం మాట్లాడిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశ్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన విమర్శించారు. ఆ ఉద్దేశ్యం ఉంటే కోటయ్య కమిటీని ఎందుకు వేస్తారని ఆయన నిలదీశారు. వ్యవసాయ బడ్జెట్లో రుణమాఫీ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడమే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిరూపిస్తోందని ఆయన అన్నారు. రుణాలను రీషెడ్యూల్ చేసి వాటిని కూడా రుణమాఫీగా ఎలా చూపిస్తారని ఆయన నిలదీశారు. రుణమాఫీ చేస్తామని ఒక పక్కన ప్రకటిస్తూనే అర్హత ఉన్న రైతులకు కూడా బ్యాంకులు ఏ విధంగా నోటీసులు పంపిస్తాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రైతులను మోసపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన తర్వాత కూడా ఇప్పటి వరకూ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వర్తింప చేయకపోవడం వల్ల కొత్త రుణాలు తీసుకునే అవకాశం లేక రైతాంగం పడుతున్న ఇబ్బందులను, బ్యాంకులు ఇస్తున్న నోటీసులను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై అనుబంధ ప్రశ్నలను వేసేందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో సభలో వివాదం నెలకొంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. -
‘రుణ మాఫీ’ ఎంత? ఎప్పటికి?
* స్పష్టత కోసం ప్రతిపక్షం పట్టు.. అధికార పక్షం ఎదురుదాడి... దద్దరిల్లిన అసెంబ్లీ * లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని దానిని రూ. 37 వేల కోట్లకు కుదించారు * డిసెంబర్ 31వ తేదీ లోగా తీసుకున్న రుణాలకే వర్తిస్తాయని షరతులు పెట్టారు * మరి పాత అప్పులు చెల్లించి కొత్త రుణం తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందా? * మాఫీపై ఆశలతో అప్పు చెల్లించని రైతులపై భారీగా వడ్డీ భారం పడుతోంది * లక్షకు ఏడాదికి రూ. 12 వేలు చొప్పున రెండేళ్లకు రూ. 24 వేలు వడ్డీ అవుతోంది * దీనిని ఎవరు చెల్లిస్తారు? రైతులపైనే భారం వేస్తారా? సర్కారు ఆదుకుంటుందా? * శాసనసభలో సర్కారుపై ప్రశ్నల వర్షం సంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు * రుణాల మొత్తం ఎంతో బ్యాంకుల నుంచి సమాచారం రాలేదు : మంత్రి జవాబు * జనవరి నుంచి మార్చి 31 వరకు రుణాలు చెల్లించిన వారికీ మాఫీ వర్తింపచేస్తాం * రుణ మాఫీ - రీషెడ్యూల్ అంటూ రైతులను గందరగోళపరచవద్దన్న విపక్షం * విపక్ష నేత జగన్మోహన్రెడ్డి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన స్పీకర్ * ప్రశ్నలకు ప్రభుత్వం సూటిగా జవాబు చెప్పట్లేదంటూ విపక్షం నిరసన, వాకౌట్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ అంశంపై బుధవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంధించిన ప్రశ్నలకు పాలకపక్షం జవాబులు చెప్పలేక ఎదురు దాడికి దిగింది. అడిగిన ప్రశ్నలతో సంబంధం లేకుండా సమాధానాలు చెప్పి చేతులు దులుపుకునేందుకు యత్నించింది. రుణ మాఫీ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలన్న ప్రశ్నకు పాలకపక్షం నుంచి జవాబు లేకపోవడంతో విపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. వైఎస్సార్ సీపీ సభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ అడిగిన ప్రశ్నపై సభలో ఈ దుమారం చెలరేగింది. రుణ మాఫీపై షరతులేమిటీ? రాష్ట్రంలో 2013 డిసెంబర్ 31కి ముందు రుణా లు పొందిన వారికి మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందంటూ ప్రభుత్వం విడుదల చేసిన 174వ జీవో రైతుల్ని తీవ్రంగా నిరాశపరిచిందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ‘‘మరి పాత అప్పులు చెల్లించి కొత్తగా 2014 జనవరి నుంచి మార్చి 31లోపు రుణాలు తీసుకున్న వారికి రుణ మాఫీ వర్తిస్తుందా? లేదా? సహకార సంఘాల నుంచి పంట రుణాల తీసుకున్న వారి సంగతేమిటి?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులందరికీ రుణ మాఫీ అని ఎన్నికలకు ముందు ప్రకటించి.. ఇప్పుడు షరతులు పెట్టడం సమంజసం కాదని తప్పుపట్టారు. ‘‘లక్ష కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తామని ఆనాడు ప్రకటించి ఇప్పుడు రూ. 37,000 కోట్లకు కుదించారు.. నిజాయితీగా రుణాలు తిరిగి చెల్లించిన రైతుల్ని ఆదుకుంటారో లేదో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘సొసైటీల నుంచి తీసుకున్న రుణాలకు ఈ ఏడాది మార్చి 31లోపు చెల్లించిన వారికే వడ్డీ రాయితీ వస్తుంది. ప్రభుత్వం మీద ఆశతో రైతులు రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు వాటిపై వడ్డీ, అపరాధ వడ్డీ పడుతోంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం కడుతుందో? లేదో? స్పష్టత ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని కోరారు. ఎప్పటిలోగా చెల్లిస్తారు? ‘‘రుణ పరిమాణం ఎంత? ఎన్ని వేల కోట్లు కా వాలి? ఎప్పటిలోగా చెల్లిస్తారు?’’ అని ఆది మూలపు సురేష్ కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల నివేదిక ప్రకారం రాష్ట్రంలో పంట రుణాలు రూ. 87,612 కోట్లు ఉన్నాయని, కోటయ్య నివేదిక ప్రకారం 572 మండలాలకు రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదనలున్నాయన్నారు. రుణాల రీషెడ్యూల్‌ను, రుణ మాఫీని కలిపి రైతుల్ని గందరగోళానికి గురిచేయవద్దన్నారు. ప్రకటించిన మేరకైనా రుణ మాఫీకి నిధులు ఎలా సమీకరిస్తారో చెప్పాలని నిలదీశారు. ఈ దశలో స్పీకర్ ఆయన మైకు ను కట్ చేసి టీడీపీ సభ్యుడు బోండా మహేశ్వరరావును మాట్లాడాల్సిందిగా కోరారు. విపక్షంపై బోండా ఆరోపణలు చేయడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. తాము మాట్లాడుతుండగా మైక్ కట్ చేసి పాలకపక్షానికి ఎలా ఇస్తారంటూ సభాపతిని ప్రశ్నించారు. ఈ దశలో పాలక, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ‘‘వ్యవసాయ మంత్రి చెప్పాల్సిన సమాధానాలను బోండా చెప్తారా?’’ అని విపక్ష సభ్యులు నిలదీశారు. వడ్డీ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు?: జగన్ మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్యల అనంతరం ప్రతి పక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుంటూ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించా రు. అడిగిన ప్రశ్నకు - చెప్తున్న జవాబుకీ పొం తన లేదన్నారు. ‘‘ఎన్ని రుణాలు మాఫీ అవుతున్నాయి? వీటిల్లో పంట రుణాలెన్ని? బం గారు రుణాలెన్ని? జిల్లాల వారీ వివరాలేమి టి? అని అడిగితే మంత్రి ఏవేవో చెప్తున్నారు. రూ. 87 వేల కోట్ల మేర వ్యవసాయ రుణాలు, రూ. 14వేల కోట్ల మేర డ్వాక్రా రుణాలు ఉన్నాయని ఎస్ఎల్బీసీలో చెప్పారు. వాటిని మాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. కేటాయింపులేమో తగ్గించి పరిమితులు విధిం చారు. ఎలా తగ్గించాలో ఆలోచిస్తున్నారు. ఎం త లోపు రుణం మాఫీ అవుతుందో చెప్పడం లేదు. లక్షా 11 వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ పెట్టారు. అందులో రుణ మాఫీకి కేవలం రూ.5వేల కోట్లే కేటాయించారు. బ్యాం కులేమో రుణాలు చెల్లించమంటున్నాయి. లే కుంటే డిఫాల్డర్లుగా ప్రకటిస్తున్నాయి. సకాలం లో అసలు చెల్లించని వారికి వడ్డీ మాఫీ కాదు. ఫలితంగా లక్షకు ఏడాదికి 12 వేల రూపాయల వడ్డీ పడుతుంది. ఆ మరుసటి ఏడాదికి (రుణ మాఫీ చెల్లించేలోగా) మరో 12 వేలు వడ్డీ పడుతుంది. ఈ వడ్డీని ఎవరు కడతారో చెప్పమంటే సమాధానం లేదు. సత్యదూరమైన హామీలు ఇచ్చారు. అన్నదాతను ఆశల్లో ఊరిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామంటున్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి మమ్మల్ని నింది స్తారా?’’ అని జగన్ సర్కారు వైఖరిని ఎండగడుతుండగా.. స్పీకర్ ఆయన మైక్‌ను కట్ చేశా రు. నేరుగా ప్రశ్న అడగాలంటూ అప్పటికే స్పీ కర్ రెండుసార్లు మైక్ కట్ చేయడం, జగన్ మాట్లాడేటప్పుడు టీడీపీ సభ్యులు గొడవ చే స్తుండడంతో జగన్ తీవ్ర నిరసన వ్యక్తంచేశా రు. ఈ వ్యవహారమై వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మాఫీ ఎంతో ఇప్పుడే చెప్పలేం: మంత్రి వైఎస్సార్ సీపీ సభ్యు ల ప్రశ్నలకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం చెప్తూ.. వ్యవసాయ, బంగారు రుణాల మాఫీ కోసం వాస్తవంగా ఎంత నిధులు కావాలన్న సమాచారాన్ని బ్యాంకుల నుంచి రాబడుతున్నామని, వచ్చిన తర్వాతే రుణాల మాఫీకి అవసరమైన మొత్తమెంతో తెలుస్తుందన్నారు. డ్వాక్రా సంఘాలను పటిష్టం చేయడానికి లక్షకు మించకుండా కొత్త మూలధనాన్ని కల్పించాలని మంత్రి మండలి తీర్మానించిందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో విపత్తు ప్రభావితమైనవిగా గుర్తించిన మండలాల్లో లక్ష లోపు స్వల్పకాలిక వ్యవసాయ పంట రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ప్రభుత్వం అనుమ తి ఇచ్చిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న ఖరీఫ్ రుణాలకు, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకు రుణాలు చెల్లించిన వారికి మాఫీ వర్తిస్తుంద ని మంత్రి తెలిపారు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో కొత్తగా రుణాలు తీసుకున్న వారిలో మంచివాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లకూ రుణ మాఫీని వర్తింపజేస్తామని వ్యాఖ్యానించారు. 42,63,000 మం ది రైతులకు రుణమాఫీ వర్తిసుందని చెప్పా రు. బంగారు రుణాలను మాఫీ చేసిన ఘ నత తమదేనని, రుణాలు చెల్లించినా లక్షన్నర రూపాయల మాఫీ వర్తింపజేస్తామని మంత్రి చెప్తుండగా.. ఎప్పటిలోగా మాఫీ చే స్తారో చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు కోరా రు. దీంతో సభలో దుమారం చెలరేగింది. -
అద్దంకి ఎంపీపీ వైఎస్సార్ సీపీ కైవసం
అద్దంకి: అద్దంకి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ పదవులు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ ఎంపీటీసీ సభ్యులున్నా గత నెల 4వ తేదీన జరగాల్సిన ఎన్నిక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కో ఆప్షన్ మెంబర్‌గా పోటీ చేసిన ఎస్కే మస్తాన్ వలి నామినేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లడంతో వాయిదా పడింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ వ్యవహరించారు. ఎమ్మెల్యే గొట్టిపాటితో కలిసి వచ్చిన ఎంపీటీసీ సభ్యులు... కో ఆప్షన్ ఎన్నిక నామినేషన్ దాఖలు సమయానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తమ పార్టీ తరఫున గెలుపొందిన 8 మంది ఎంపీటీసీలను తీసుకుని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. కో ఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మణికేశ్వరం గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్ వలి, టీడీపీ తరఫున ఎస్కే కరిముల్లా నామినేషన్లు వేశారు. అధికారులు పరిశీలన పూర్తిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కో ఆప్షన్ మెంబర్‌గా పోటీ చేసిన ఎస్కే మస్తాన్‌వలి నామినేషన్ చెల్లుబాటైనట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థికరిముల్లా నామినేషన్ ఓటర్ల జాబితాలో నంబరు సరిగా వేయని కారణంగా తిరస్కరించారు. ఒంటి గంట సమయంలో కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్య ఏ పార్టీకి కేటాయించిన సీట్లలో ఆ పార్టీ ఎంపీటీసీలను కూర్చోబెట్టారు. మండలంలోని 14 మంది ఎంపీటీసీ సభ్యుల చేత జేసీ యాకూబ్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. పోటీ లేకపోవడంతో కో ఆప్షన్ సభ్యునిగా ఎస్కే మస్తాన్ వలికి నియామక పత్రం అందజేసి మూడు గంటలకు సభ్యులను సమావేశపరచాలని ఆదేశించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సమావేశం మూడు గంటలకు ప్రారంభమైంది. అక్షరక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మండల పరిషత్ అధ్యక్షురాలిగా గోరంట్ల పద్మావతి, ఉపాధ్యక్షురాలిగా కరి అరుణ పేర్లను మణికేశ్వరం ఎంపీటీసీ ఇస్తర్ల వెంకట్రావు, వెంపరాల ఎంపీటీసీ భైరపునేని రామలింగయ్యలు ప్రతిపాదించి బలపరిచారు. టీడీపీ తరఫున చిన్నకొత్తపల్లి ఎంపీటీసీ మానం సరితను, ధేనువకొండ ఎంపీటీసీ ఉయ్యాల రాములును అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ప్రతిపాదించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా 8 మంది ఎంపీటీసీలు చేతులెత్తారు. టీడీపీ అభ్యర్థులకు ఆరుగురు ఎంపీటీసీల మద్దతు మాత్రమే లభించడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా గోరంట్ల పద్మావతి, కరి అరుణ ఎన్నికైనట్లు జేసీ ప్రకటించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో స్టెప్ సీఈవో బీ రవి, ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణమోహన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ వీవీ రమణకుమార్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 250 మంది సిబ్బందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జగన్‌తోనే రాజన్న స్వర్ణయుగం
మేదరమెట్ల, న్యూస్‌లైన్: వైఎస్ జగన్మోహనరెడ్డితోనే రాజన్న కోరుకున్న స్వర్ణయుగం వస్తుందని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని బొడ్డువానిపాలెంలో గతంలో పీఆర్పీ, టీడీపీల్లో ఉన్న 600 మందిని శుక్రవారం పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేయాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని, రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ముందుగా బొడ్డువానిపాలెంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి కార్యకర్తలు, అభిమానులు బైకులపై ర్యాలీగా అద్దంకి రోడ్డులోని సీతారామస్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీలో చేరిన వారిలో తిరుమల శెట్టి నాగేశ్వరరావు, చింతం అంజయ్య, నేరెళ్ల వెంకటేశ్వర్లు, నేరెళ్ల జానకీరామయ్య, ధర్మవరపు దుర్గారావు, పీ హనుమంతరావు, మందలపు అంకారావు, నేరెళ్ల సుబ్బయ్య, పెద్దిరెడ్డి శివారెడ్డి, అన్నెం అంజిరెడ్డి, ఎం హనుమారెడ్డిల ఆధ్వర్యంలో 600 మంది కార్యకర్తలు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు . కార్యక్రమంలో మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, ఎస్సీ సెల్ నాయకులు రంపతోటి సాంబయ్య, ముత్తవరపు రమణయ్య, అన్నెం అంజిరెడ్డి, కోట శ్రీనివాసరావు, శానం చిన్న వెంకటేశ్వర్లు, జంపు ఆదిశేషు, ఈవూరి సోమారెడ్డి, ఆరుమళ్ల సామియేలు, రామిరెడ్డి అంజయ్య, మేకల అంజిరెడ్డి, రామిరెడ్డి వెంకటస్వామి, యర్రబాలెం సుధాకర్, సాదినేని శ్రీనివాసరావు, జ్యోతి రమేష్, స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఎడ్ల పందేలు
పర్చూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఆదివారం నూతలపాడు గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతమైన నూతలపాడులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పార్టీ స్థానిక నాయకుడు పావులూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సభలో రవికుమార్ మాట్లాడారు. నూతలపాడు జూనియర్ కళాశాలలో గొట్టిపాటి నరసింహారావు(నరసయ్య) ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను ఆదివారం ఉదయం గొట్టిపాటి రవికుమార్, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ప్రారంభించారు. అనంతరం నరసయ్య 50వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసయ్య సతీమణి పద్మ, కుమార్తె లక్ష్మి పాల్గొన్నారు. సభా వేదికపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, గొట్టిపాటి నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నరసయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. సభలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ఒంగోలు జాతి పశుసంపదపై మక్కువతో గతంలో మార్టూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించినట్లు తెలిపారు. అప్పట్లో 250 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయని గుర్తుచేశారు. తర్వాత అనివార్య కారణాల వల్ల పోటీలు నిర్వహించలేకపోయామన్నారు. వైఎస్సార్ పేరున భవనం శ్రీనివాసరెడ్డి పోటీలు నిర్వహించడం అభినంద నీయమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు సక్రమం గా అమలవుతాయని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రస్తుత పాలకులు రాష్ట్రాన్ని ఏ విధంగా బ్రష్టు పట్టించారో ప్రతి ఒక్క పౌరుడూ గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. తన అన్న కుమారుడు భరత్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ.. ‘నాన్న పుట్టినరోజున ఆయనకు ఇష్టమైన ఎడ్లపోటీలు నిర్వహించడం ఆనందంగా ఉంద’ని అన్నారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలవాలని కోరారు. పోటీల నిర్వాహకుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నరసయ్య జయంతి రోజున రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా సభ్యులు వల్లభరెడ్డి సుబ్బారెడ్డి, జూనియర్ కళాశాల యాజమాన్య ప్రతినిధి భవనం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్రా శేషగిరిరావు, తాటి వెంకట్రావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మనుబోతు వెంకటరెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు తోకల కృష్ణమోహన్, బండారు ప్రభాకరరావు, పఠాన్ కాలేషావలి, కోట విజయభాస్కరరెడ్డి, ధూలిపాళ్ళ వేణుబాబు, దండా చౌదరి, యద్దనపూడి, పర్చూరు మండలాల యూత్ అధ్యక్షులు తమ్మా అమ్మిరెడ్డి, ఆకుల హేమంత్, నూతలపాడు సర్పంచ్ సుమలత, నూతలపాడు, ఆదిపూడి, పూనూరు సహకార సంఘాల అధ్యక్షులు కుర్రి బాపిరెడ్డి, యర్రం లక్ష్మారెడ్డి, పావులూరి వాసు, పార్టీ నాయకులు యర్రం నాగిరెడ్డి, వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొసనా రాంప్రసాద్, గాజుల రమేష్, దరువూరి వీరయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
అద్దంకిలో క‘రణం’
అద్దంకి, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యకాండకు తెగబడ్డారు. కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు వెంకటేష్ స్వయంగా తన కార్యకర్తలను దాడులకు ప్రోత్సహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి నిరసనగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తున్న వారిపై కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలోని తమ కార్యాలయంలో బుధవారం న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలు రాసాగారు. అలా వస్తున్న కార్యకర్తలను సింగరకొండ నుంచి వస్తున్న టీడీపీ నేతలు గేలి చేశారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. రాడ్లూ, కర్రలతో తీవ్రంగా కొట్టారు. భయంతో పరిగెడుతున్న కార్యకర్తల వెంటబడి మరీ కొట్టారు. చేతిలో ఇనుప రాడ్లూ, కర్రలు పట్టుకుని పరిగెడుతూ టీడీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. మోటార్ సైకిళ్లను ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ దాడిలో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. డీవీకే రెడ్డి, దుగ్గి నర్సింహారెడ్డి, చుండూరు మురళీసుధాకర్, నర్రా నాగేశ్వరరావు, కర్రి పరమేశ్, సురేష్ (గొట్టిపాటి రవికుమార్ కార్ డ్రైవర్)లు గాయపడ్డారు. వారిలో డీవీకే, దుగ్గిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేతల ధర్నా టీడీపీ వర్గీయుల దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ ఆందోళనకు దిగారు. మేరదమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిపై కార్యకర్తలు, నాయకులతో ధర్నా నిర్వహించారు. ఇది తెలిసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు మళ్లీ వైఎస్సార్ కాంగ్రేస్ కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ప్రతిఘటించడానికి సిద్ధపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఇరువర్గాలతో పోలీసులు చర్చలు జరిపి నచ్చజెప్పి పంపారు. కరణం బలరాం కుమారుడి వీరంగం పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గం మాత్రం కయ్యానికి కాలుదువ్వింది. పోలీసులు సర్దిచెప్పడంతో ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన విరమించి అక్కడి నుంచి నిష్ర్కమిస్తుండగా, అక్కడికి చేరుకున్న టీడీపీ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ మళ్లీ ఉద్రిక్తతను రేకెత్తించారు. వెంకటేష్ ఏకంగా తన వాహనం ఎక్కి తొడకొట్టి మరీ సవాల్ విసిరారు. ‘మా సంగతి మీకు తెలుసు... జాగ్రత్తగా ఉండండి...ఎవర్నీ తిరగనివ్వం’ అని హెచ్చరించారు. చేతిలో పార్టీ జెండా పట్టుకుని వేలు చూపిస్తూ ఊగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కరణం బలరాం కుమారుడిని నియంత్రించలేదు.. సరికదా ఇనుప రాడ్లూ, కర్రలు పట్టుకుని ఉన్న కార్యకర్తలను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు. సీనియర్ నేత బలరాం, ఆయన కుటుంబ దౌర్జన్యకాండపై స్థానికులు విస్తుపోయారు. కరణం రౌడీయిజానికి భయపడం గొట్టిపాటి రవికుమార్ కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ దౌర్జన్యాలకు భయపడేది లేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తానుగానీ తమ పార్టీగానీ ఎంతవరకైనా న్యాయబద్ధంగా పోరాడతామన్నారు. కరణం బలరాం ఒక ఫ్యాక్షనిస్టని, ఆయన నేరచరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. హత్య కేసుల్లో కరణం బలరాం జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ జ్ఞానోదయం కలగలేదన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వెంకటేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ పిల్ల రౌడీ అవతారం ఎత్తి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. -
అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై వైఎస్ఆర్ సీపీ రాస్తారోకో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమైక్యాంధ్రకు మద్దుతగా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గత ఐదురోజుల క్రితం ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో పోలీసులు ఆయన్ని ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
అద్దంకిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి దీక్ష భగ్నం
సమైక్యాంధ్రకు మద్దతుగా అద్దంకి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గొట్టిపాటి రవికుమార్ చేపట్టిన ఆమరణ నిరాహర దీక్షను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి గత ఐదు రోజులుగా అద్దంకిలో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకు కీణిస్తుంది. దాంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఆమరణ నిరాహర దీక్షను పోలీసులు భగ్నం చేశారు.