వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా అద్దంకి - నార్కట్పల్లి హైవేపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.
దాంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమైక్యాంధ్రకు మద్దుతగా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గత ఐదురోజుల క్రితం ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో పోలీసులు ఆయన్ని ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.