రైతుల తరఫున పోరాటానికి సిద్ధం | i am ready to fight on farmers problems | Sakshi
Sakshi News home page

రైతుల తరఫున పోరాటానికి సిద్ధం

Published Mon, Dec 29 2014 1:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతుల తరఫున పోరాటానికి సిద్ధం - Sakshi

రైతుల తరఫున పోరాటానికి సిద్ధం

రైతులకు సాగునీరు అందించే వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కనీసం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 30 శాతం పంటలకు చుక్క నీరు కూడా అందించలేదు. జిల్లా రైతులకు నీటి విషయంలో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ప్రశ్నించడంతో మంత్రి పర్యటనకు వచ్చారు. సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగడం లేదు.

ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా, ప్రజా సమస్యలు వినకుండా  మంత్రి వెళ్లిపోవడం బాధాకరం. దాడులకు తెగబడితే వెనక్కు తగ్గేది లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం. రైతులు కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంత్రి వాస్తవ పరిస్థితి గమనించి జిల్లా రైతులకు న్యాయం చేయాలి.

గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement