బల్లికురవ మండలం వేమవరంలో హత్యకు గురైన కరణం వర్గీయుల కేసులో మరో అడుగు ముందుకు పడింది.
బల్లికురవ(ప్రకాశం జిల్లా): బల్లికురవ మండలం వేమవరంలో హత్యకు గురైన కరణం వర్గీయుల కేసులో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం కొంత మంది నిందితులను సంతమాగులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో 17 మంది నిందితులు ఉన్నట్లు సమాచారం.
ఈ నెల 19న బల్లికురవ మండలం కె.రాజుపాలెంలో ఓ పెళ్లికి హాజరైన కరణం బలరాం వర్గీయులు పెదఅంజయ్య, రామకోటయ్యలను కళ్లలో కారం కొట్టి గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య అనంతరం నిందితులంతా పరారయ్యారు.