ఒంగోలు : టీడీపీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం మధ్య వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బుధవారం ఉదయం బల్లికురవలోని ఎండీవో కార్యాలయం వద్ద కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అక్కడికి చేరుకున్నారు.
తమ వారికి పింఛన్లు ఇవ్వటం లేదంటూ గొట్టిపాటి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో కరణం బలరాం వర్గీయులతో వారు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారుల తీరును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.