
ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్
ఒంగోలు: టీడీపీ నేత కరణం బలరాం వర్గీయుల దాడికి గురైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు. దాడి జరిగిన తీరును ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఢిల్లీ నుంచి రవికుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. టీడీపీ వర్గీయుల దాడిని ఖండించారు.
ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కారు అద్దాలను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.