రాజకీయ లబ్ధి కోసమే టీడీపీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ప్రజల గొంతు కోసిందని వైఎస్‌ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
బల్లికురవ, న్యూస్‌లైన్ :
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ప్రజల గొంతు కోసిందని వైఎస్‌ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం బల్లికురవ వచ్చిన అయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందన్నారు. విభజనకు మద్దతు ఇచ్చిన టీడీపీని కూడా ప్రజలు అసహ్యించుకొని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. మహానేత వైఎస్‌ఆర్ జీవించి ఉన్నప్పుడు విభజన అంశాన్ని లేవనెత్తని తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన హఠాన్మరణంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని ధ్వజమెత్తారు. తాజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థత వల్లే విభజన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించారని విమర్శించారు. కుట్రలు.. కుతంత్రాలతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఆయన్ను సీఎం చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని గొట్టిపాటి పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మలినేని గోవిందరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జండ్రాజుపల్లి మాతయ్య పాల్గొన్నారు.
అభివృద్ధికి బాటలు వేశా.. ఆదరించండి
నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేశానని, త్వరలో జరిగే ఎన్నికల్లో మీ అందరివాడిగా తిరిగి ఆదరించాలని గొట్టిపాటి రవికుమార్ కోరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం గురువారం స్థానిక కిషోర్ గ్రానైట్స్‌లో జరిగింది. సమావేశానికి మండల కన్వీనర్ మలినేని గోవిందరావు అధ్యక్షత వహించారు. రవికుమార్ మాట్లాడుతూ 1983 నుంచి 2004 వరకు నియోజకవర్గంలో 30 మంది మరణాలకు కారణమైన ఓ దుష్టశక్తి ఈ ఏడాది జనవరి 1న అద్దంకిలో రౌడీయిజంతో హంగామా సృష్టించిందని మండిపడ్డారు. ఓటర్ల మనసులో సుస్థిర స్థానం ఉంటే తప్ప గూండాగిరీ, రౌడీయిజంతో ప్రజాప్రతినిధిగా గెలవలేరని తన ప్రత్యర్థులకు హితవు పలికారు. ఇలాంటి దుష్టశక్తిని సాగనంపేందుకు కార్యకర్తలంతా పార్టీ విజయానికి కృషి చేస్తూ 2009లో ఇచ్చిన మెజార్టీని రెట్టింపు చేయాలని కోరారు. అనంతరం గ్రామాల వారీగా నెలకొన్న సమస్యలపై 21 గ్రామ పంచాయతీల్లోని కార్యకర్తలు, సర్పంచ్‌లతో గొట్టిపాటి సమీక్షించారు. సమావేశంలో మల్లాయపాలెం, కొణిదెన, నక్కబొక్కలపాడు, ముక్తేశ్వరం, వల్లాపల్లి సర్పంచ్‌లు అబ్బారెడ్డి బాలకృష్ణ, సీహెచ్ ఆంజనేయులు, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు, ఇస్రాయిల్, షేక్ అల్లాఉద్దీన్, వల్లాపల్లి సొసైటీ అధ్యక్షుడు మంచాల శ్రీనివాసరెడ్డి, ఉప్పుమాగులూరు, కేరాజుపాలెం, రాజుపాలెం, కూకట్లపల్లి, కొప్పరపాడు, ముక్తేశ్వరం, కొప్పరపాలెం, చెన్నుపల్లి మాజీ సర్పంచ్‌లు కల్లి వెంకటేశ్వరరెడ్డి, జాష్టి శ్రీరంగనాయకులు, గోపాలకృష్ణ, ఇప్పల నాసరరెడ్డి, షేక్ అబ్దుల్ సాహెబ్, కె.శంకరరెడ్డి, ఎం.ఆంజనేయులు, పి.అక్కయ్య, జి.శంకర్, పార్టీ నేతలు డి.శివయ్య, కె.సత్యనారాయణ, ఈ.పెద్దన్న, డి.అంజయ్య, గాలి వెంకటేశ్వర్లు, ఇప్పల నర్సిరెడ్డి పాల్గొన్నారు.